Know Adhar Number: ఆధార్ నెంబ‌ర్‌ను మ‌రిచిపోయారా..? ఇంట‌ర్‌నెట్‌, ఫోన్ నెంబ‌ర్ ఉంటే చాలు ఇట్టే తెలుసుకోవ‌చ్చు..

|

Jun 16, 2021 | 6:04 AM

Know Adhar Number: ప్ర‌స్తుతం ఆధార్ కార్డు జీవితంలో ఓ భాగ‌మైపోయింది. ఏ చిన్న పనికి అయినా ఆధార్ త‌ప్ప‌నిస‌రిగా మారింది. ఇక చివ‌రికి ఆధార్ నెంబర్ అయినా క‌చ్చితంగా చెప్పాల్సిందే. అయితే కొన్ని సంద‌ర్భాల్లో...

Know Adhar Number: ఆధార్ నెంబ‌ర్‌ను మ‌రిచిపోయారా..? ఇంట‌ర్‌నెట్‌, ఫోన్ నెంబ‌ర్ ఉంటే చాలు ఇట్టే తెలుసుకోవ‌చ్చు..
Aadhar Number
Follow us on

Know Adhar Number: ప్ర‌స్తుతం ఆధార్ కార్డు జీవితంలో ఓ భాగ‌మైపోయింది. ఏ చిన్న పనికి అయినా ఆధార్ త‌ప్ప‌నిస‌రిగా మారింది. ఇక చివ‌రికి ఆధార్ నెంబర్ అయినా క‌చ్చితంగా చెప్పాల్సిందే. అయితే కొన్ని సంద‌ర్భాల్లో ఆధార్ నెంబ‌ర్‌ను మ‌రిచిపోతాం. ఎక్క‌డా నోట్ చేసుకొని కూడా ఉండం. అలాంటి స‌మ‌యంలో ఆధార్ నెంబ‌ర్ అవ‌స‌రం ప‌డితే ఏలా చెప్పండి.? ఏమో అనే స‌మాధానం వ‌స్తుంది క‌దూ..! అయితే కొన్ని సింపుల్ టెక్నిక్స్‌తో మీ ఆధార్ కార్డు నెంబ‌ర్‌ను తెలుసుకోవ‌చ్చు. ఇందుకోసం ఫాలో కావాల్సిన స్టెప్స్ ఓసారి చూద్దాం. అయితే ఈ స‌దుపాయాన్ని ఉప‌యోగించుకోవాలనుకుంటే ఆధార్ కార్డుకు మీ ఫోన్ నెంబ‌ర్ లింక్ అయ్యి ఉండాలి. ఆధార్ నెంబ‌ర్‌ను తెలుసుకోవ‌డానికి ఫాలో కావాల్సిన స్టెప్స్‌..

* ముందుగా స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూట‌ర్‌లో బ్రౌజ‌ర్ ఓపెన్ చేసి.. యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ అయిన https://uidai.gov.in/ ఓపెన్ చేయాలి.

* అనంత‌రం వెబ్‌సైట్‌లోని ‘మై ఆధార్’ సెక్ష‌న్‌లోని ‘ఆధార్ స‌ర్వీసెస్’ క్లిక్ చేసి.. అందులో ఉన్న ‘రిట్రైవ్ లాస్ట్ ఆర్ ఫర్గాటెన్ ఈఐడీ/యూఐడీ’పై క్లిక్ చేయాలి.

* త‌ర్వాత ఓపెన్ అయిన కొత్త పేజీలో ఆధార్ నంబ‌ర్ (యూఐడీ)ని సెల‌క్ట్ చేసుకోవాలి.

* అనంత‌రం మీ రిజిస్ట‌ర్ మొబైల్ నెంబ‌ర్ లేదా ఈమెయిల్ ఐడీని ఎంట‌ర్ చేయాలి.

* ఇక అక్క‌డే ఉన్న క్యాప్చా కోడ్‌ను ఎంట‌ర్ చేసి.. సెండ్ ఓటీపీపై క్లిక్ చేయాలి.

* మొబైల్‌కు వ‌చ్చిన ఓటీపీని ఎంట‌ర్ చేసి ఎంట‌ర్ నొక్కాలి. దీంతో మొబైల్ నెంబ‌ర్‌కు ఆధార్ నెంబ‌ర్ మెసేజ్ రూపంలో వ‌స్తుంది.

Also Read: Tenth and Inter : ఏపీలో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ విద్యార్థుల అయోమయానికి త్వరలోనే శుభం కార్డు.!

Ambati : టీడీపీ నేతల భూకబ్జాలను చంద్రబాబు సమర్ధిస్తారా?. ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు సూటి ప్రశ్న

sridhar babu pcc: తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ పోస్ట్‌పై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టిన శ్రీధర్ బాబు..