మీ ఇంట్లోకి కొత్తఫ్యాన్‌ కొనాలనుకుంటున్నారా..? అయితే, ఈ విషయాలను తప్పక తెలుసుకోండి..

|

May 15, 2023 | 2:56 PM

ఈ క్రమంలోనే తరచుగా ప్రజలు గందరగోళానికి గురవుతుంటారు.అయితే, అలాంటి వారికి ఉపశమనం కలిగించేలా సరైన సీలింగ్ ఫ్యాన్‌ ఎంపిక ఏ విధంగా ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం.. సిలీంగ్‌ ఫ్యాన్‌లో ఎన్ని బ్లేడ్‌లు ఉండాలి?

మీ ఇంట్లోకి కొత్తఫ్యాన్‌ కొనాలనుకుంటున్నారా..? అయితే, ఈ విషయాలను తప్పక తెలుసుకోండి..
Ceiling Fan
Follow us on

అసలే ఎండాకాలం.. బయట ఎండలు మండిపోతున్నాయి. భరించలేని వేడి, ఉక్కపోతతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కూలర్లు, ఏసీల ధరలు చూస్తేనే షాక్‌ కొడుతున్నాయి. ఇక వాటిని ఉపయోగించినా కూడా కరెంట్‌ బిల్లు కంగురు పుట్టిస్తుంది. ఇలాంటి కష్టాలను అధిగమించాలంటే.. మీ ఇంటికి సీలింగ్‌ ఫ్యాన్‌ ఉత్తమమైనదిగా చెప్పొచ్చు. అందుకే వేసవి కాలం వచ్చిందంటే సీలింగ్ ఫ్యాన్లకు డిమాండ్ బాగా పెరుగుతుంది. తక్కువ కరెంటు బిల్లు, గాలి ఎక్కువగా వచ్చే ఫ్యాన్లనే జనం చౌక ధరలకు కొనుగోలు చేయాలని భావిస్తుంటారు. అయితే, ప్రస్తుతం స్మార్ట్ సీలింగ్ ఫ్యాన్లు కూడా మార్కెట్‌లోకి వచ్చాయి. అయితే సీలింగ్ ఫ్యాన్‌ని కొనుగోలు చేసేటప్పుడు మీ ఇంటికి ఏది సరైనదో చూసుకోవటం ఈ రోజుల్లో చాలా కష్టం. ఎందుకంటే మార్కెట్లో చాలా క్వాలిటీ, డిజైన్, స్పెషాలిటీ ఫ్యాన్‌లు అందుబాటులో ఉన్నాయి. భారతదేశంలోని చాలా ఇళ్లలో 3 బ్లేడ్ ఫ్యాన్లు ఉన్నప్పటికీ, ఇప్పుడు ప్రజలు ఇతర ఎంపికలను ప్రయత్నించాలని కూడా ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే తరచుగా ప్రజలు గందరగోళానికి గురవుతుంటారు.అయితే, అలాంటి వారికి ఉపశమనం కలిగించేలా సరైన సీలింగ్ ఫ్యాన్‌ ఎంపిక ఏ విధంగా ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం.. సిలీంగ్‌ ఫ్యాన్‌లో ఎన్ని బ్లేడ్‌లు ఉండాలి? ఇంటికి ఉత్తమమైన ఫ్యాన్‌ను ఎంచుకున్నప్పుడు, బ్లేడ్‌ల సంఖ్య కాకుండా, దాని పిచ్, మోటారు శక్తి కూడా చాలా ముఖ్యమైనవి.

ఫ్యాన్ కొనుగోలు చేసేటప్పుడు బ్లేడ్‌పై ప్రత్యేక శ్రద్ధ అవసరం..

ఏరియాను బట్టి ఫ్యాన్‌కు పనుంటుంది. కొన్ని ప్రదేశాల్లో చల్లగా ఉంచడానికి ఒకటి కంటే ఎక్కువ లేదా అంతకంటే ఎక్కువ ఫ్యాన్లు అవసరమవుతాయి. అలాంటప్పుడు ఫ్యాన్‌ బ్లేడ్లు ఫ్యాన్‌ నాణ్యత, పనితీరును ప్రభావితం చేస్తాయి. అందువల్ల సీలింగ్ ఫ్యాన్ తీసుకునేటప్పుడు, దాని బ్లేడ్‌లపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.

3 బ్లేడెడ్ ఫ్యాన్..

ఇవి కూడా చదవండి

3 బ్లేడెడ్ ఫ్యాన్ తక్కువ భాగాలు, శక్తితో అధిక వేగంతో తిరుగుతుంది. దీంతో విద్యుత్ బిల్లుపై అంతగా ప్రభావం ఉండదు. ఇది కాకుండా, తిరుగుతున్నప్పుడు ఫ్యాన్‌ సౌండ్‌ కూడా తక్కువగా ఉంటుంది. అయితే, కొన్ని 3-బ్లేడ్ ఫ్యాన్‌లు ఎక్కువ బ్లేడ్‌లు ఉన్న సీలింగ్ ఫ్యాన్‌ల కంటే ఎక్కువ సౌండ్‌ చేస్తుంటాయి. తక్కువ స్థలం ఉన్న గదులకు ఇవి మంచి ఎంపిక.

4 బ్లేడ్ సీలింగ్ ఫ్యాన్లు.

ఎయిర్ కండిషనర్లు ఉన్న గదులకు 4-బ్లేడ్ సీలింగ్ ఫ్యాన్లు మంచి ఎంపిక. ఎందుకంటే ఈ ఫ్యాన్లు గదిలో గాలిని మరింత మెరుగ్గా వ్యాపించేలా పనిని చేస్తాయి, దీని కారణంగా గది త్వరగా చల్లబడుతుంది. కానీ 4 బ్లేడ్ ఫ్యాన్‌లు 3 బ్లేడ్ ఫ్యాన్‌ల కంటే నెమ్మదిగా నడుస్తాయి. పోల్చి చూస్తే ఖరీదైనవి కూడా. అలాగే దీనికి ఎక్కువ స్థలం అవసరం.

5 బ్లేడ్ సీలింగ్ ఫ్యాన్లు

3,4 బ్లేడ్‌లు ఉన్న ఫ్యాన్‌ల కంటే 5 బ్లేడ్‌లు కలిగిన సీలింగ్ ఫ్యాన్‌లు తిరిగేటప్పుడు తక్కువ శబ్దం చేస్తాయి. గదిలో గాలి ప్రసరణ కోసం ఇది ఇతర బ్రాండ్స్‌ కంటే మెరుగ్గా పనిచేస్తుంది. దీని ప్రధాన లక్షణం దీని డిజైన్, ఇది గృహాలంకరణ, అందాన్ని మెరుగుపరచడానికి పనిచేస్తుంది. ఇది సాధారణంగా బెడ్‌రూమ్‌లకు గొప్ప ఎంపికగా చెబుతున్నారు మార్కెట్‌ నిపుణులు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి..