Dice Snakes: చనిపోయిందని నమ్మితే మీ పని గోవిందా.. ఈ పాముకు ఆస్కార్ కూడా తక్కువే.. కాటేస్తే నిమిషాల్లోనే..

Dice Snakes: చాలామంది పలు సమయాల్లో తప్పించుకునేందుకు నటిస్తుంటారు.. అలాంటి వారిని మనం తరచూ చూస్తూనే ఉంటాం.. అయితే.. మనుషుల్లోనే ఇలాంటి నటనను మనం గమనిస్తాం.. కానీ.. ఓ జాతికి చెందిన పాము.. మనుషులను మించి నటిస్తుందంట.. అది కూడా ఆస్కార్ లెవల్ పర్ఫామెన్స్ ఇస్తుందంట.. ఇదంతా కూడా పరిశోధకులు ఓ అధ్యయనంలో వెల్లడించారు.

Dice Snakes: చనిపోయిందని నమ్మితే మీ పని గోవిందా.. ఈ పాముకు ఆస్కార్ కూడా తక్కువే.. కాటేస్తే నిమిషాల్లోనే..
Dice Snakes

Updated on: May 12, 2024 | 1:05 PM

Dice Snakes: చాలామంది పలు సమయాల్లో తప్పించుకునేందుకు నటిస్తుంటారు.. అలాంటి వారిని మనం తరచూ చూస్తూనే ఉంటాం.. అయితే.. మనుషుల్లోనే ఇలాంటి నటనను మనం గమనిస్తాం.. కానీ.. ఓ జాతికి చెందిన పాము.. మనుషులను మించి నటిస్తుందంట.. అది కూడా ఆస్కార్ లెవల్ పర్ఫామెన్స్ ఇస్తుందంట.. ఇదంతా కూడా పరిశోధకులు ఓ అధ్యయనంలో వెల్లడించారు. ఈ పాము రక్తం, దుర్వాసనతో కనిపిస్తుంది.. ఇది మాంసాహారుల నుంచి తనను తాను రక్షించుకోవడానికి మరణించినట్లు నటిస్తుందని పరిశోధకులు తెలిపారు.

ఒక విచిత్రమైన కొత్త అన్వేషణలో.. బయోలజీ లెటర్స్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం దీనిని కనుగుంది.. పాచికల పాములు లేదా డైస్ స్నేక్ అనే ఈ నీటి పాము.. తమ మరణాలను నకిలీ చేయడంతోపాటు మాంసాహారుల నుండి తమను తాము రక్షించుకోవడానికి చాలా దూరం వెళ్తాయని అధ్యయనం వెల్లడించింది.

అధ్యయనం గురించి..

డైస్ స్నేక్ ( నాట్రిక్స్ టెస్సెల్లాట ) అనేది యురేషియన్ విషరహిత పాము.. ఇది నాట్రిసినే అనే ఉపకుటుంబానికి చెందిన కొలుబ్రిడే కుటుంబానికి చెందినది. దీనిని నీటి పాము అని కూడా అంటారు. నాట్రిక్స్ టెస్సెల్లాటా అని పాములు తెలివైనవని.. తమకు ముప్పు పొంచి ఉన్నదని గ్రహించిన క్రమంలో.. మరణించినట్లు నటిస్తాయని.. ఇందులో “నోటినిండా” రక్తం స్రవించడం, మలంతోపాటు.. దుర్వాసనతో కూడిన ద్రావణాన్ని విడుదల చేస్తాయని.. అధ్యయనంలో తెలిపారు.

ముఖ్యంగా, డైస్ స్నేక్ లు తెలివితో ఇలా చేస్తాయని.. ఆ తర్వాత దాడి నుంచి తప్పించుకుని.. వేరే వాటిపై దాడికి వ్యూహం పన్నుతాయని పేర్కొంది.

డైస్ స్నేక్స్ ఐరోపా, ఆసియాలోని కొన్ని ప్రాంతాలకు చెందిన విషరహిత పాములు. అయితే.. అన్ని డైస్ స్నేక్స్ ఇలాంటి తెలివిని ప్రదర్శించవని.. అధ్యయనం పేర్కొంది.. కొన్ని నిశ్చలంగా ఉంటాయని పేర్కొంది..

పరిశోధకులు ఏమి కనుగొన్నారంటే..?

పరిశోధకులు అధ్యయనం చేసిన 263 డైస్ స్నేక్స్ లలో 124 మలంతో దుర్వాసనతో కనిపించాయని.. 28 మాత్రం బ్లడ్ వామ్టింగ్ చేసుకుంటున్నట్లు గమనించారు.

మొత్తంమీద, డైస్ స్నేక్స్ దాదాపు ఆరు నుంచి 24 సెకన్లు పాటు చచ్చిపోయినట్లు నటిస్తూ.. ఎరను వేటాడతాయని అధ్యయనం తెలిపింది.

ఈ ప్రవర్తన ఆడ లేదా మగ పాములలో.. గాయాలు, శరీర ఉష్ణోగ్రత, పరిమాణం, వయస్సు, కడుపులో ఆహారం ఉండటం, ఆడపాములలో గుడ్లు ఉండటం.. తదితర అంశాలతో ఆధారపడి ఉంటుందని.. రచయితలలో ఒకరైన వుకాసిన్ బెజెలికా CNN కి చెప్పారు.

బంధించబడినప్పుడు ఈ పాములు తీవ్రంగా పోరాడుతాయని.. అరుపు కూడా భయంకరంగా ఉంటుందని పరిశోధకులు వివరించారు.

మరిన్ని సైన్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..