Cyber Crime: పాస్‌వర్డ్ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా.? మొదటికే మోసం జరుగుతుంది..

ప్రపంచవ్యాప్తంగా జరుగుతోన్న సైబర్‌ నేరాలకు వీక్‌ పాస్‌వర్డ్ ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఆన్‌లైన్‌ ఖాతాలు సెక్యూర్‌గా ఉండడానికి పాస్‌వర్డ్‌లు అత్యంత ముఖ్యమైన సాధనంగా అభివర్ణిస్తున్నారు. ఇదే విషయమై ఢిల్లీ పోలీసులు ప్రజలను అలర్ట్ చేశారు. ఒకటి కంటే ఎక్కువ ఖాతాలకు ఒకే పాస్‌వర్డ్‌ను ఉపయోగించడం ప్రమాదకరమని పోలీసులు చెబుతున్నారు. హ్యాకర్ల కంటే ఒక అడుగు ముందే ఉండాలంటే...

Cyber Crime: పాస్‌వర్డ్ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా.? మొదటికే మోసం జరుగుతుంది..
Password

Updated on: Oct 30, 2023 | 10:24 AM

ఇంటర్‌నెట్ వినియోగం రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే నేరాలు సైతం అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. చిన్ని చిన్న లొసుగులను ఆసరగా చేసుకొని నేరాలకు పాల్పడుతున్నారు. ప్రపంచంలో ఏదో మూలన కూర్చొని మన ఖాతాలో డబ్బులు కాజేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌లు, బ్యాంక్‌ యాప్స్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత సైబర్ నేరాలు భారీగా పెరుగుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా జరుగుతోన్న సైబర్‌ నేరాలకు వీక్‌ పాస్‌వర్డ్ ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఆన్‌లైన్‌ ఖాతాలు సెక్యూర్‌గా ఉండడానికి పాస్‌వర్డ్‌లు అత్యంత ముఖ్యమైన సాధనంగా అభివర్ణిస్తున్నారు. ఇదే విషయమై ఢిల్లీ పోలీసులు ప్రజలను అలర్ట్ చేశారు. ఒకటి కంటే ఎక్కువ ఖాతాలకు ఒకే పాస్‌వర్డ్‌ను ఉపయోగించడం ప్రమాదకరమని పోలీసులు చెబుతున్నారు. హ్యాకర్ల కంటే ఒక అడుగు ముందే ఉండాలంటే, బలహీనమైన పాస్‌వర్డ్‌లకు దూరంగా ఉండాలని ఢిల్లీ పోలీసులు ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు.

ఢిల్లీ పోలీసులు ట్వీట్..

అంతేకాకుండా మరికొన్ని ముఖ్యమైన సైబర్ సెక్యూరిటీ చిట్కాలను సైతం పంచుకున్నారు. సైబర్ నేరాల బారిన పడకూడదంటే పాస్‌వర్డ్‌ కచ్చితంగా సెక్యూర్‌గా ఉండాలని చెబుతున్నారు. ఇటీవల ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ సైబర్ నేరగాళ్ల బారిన పడి రూ. 50 లక్షలు పోగొట్టుకున్నారు. ఇక రిటైర్డ్‌ కల్నర్‌ అయితే ఏకంగా రూ. 2.5 కోట్లు పోగొట్టుకున్నాడని తెలిపారు. టెక్నాలజీపై అవగాహన ఉన్న వారు కూడా ఇలా మోసపోవడం దారుణమని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఇక సైబర్ నేరాలకు సంబంధించి నివేదికలు ఇవ్వడానికి ఢిల్లీ పోలీసులు ప్రత్యేక హెల్ప్‌లైన్‌, వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. వినియోగదారులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయొచ్చు. అలాగే 1930కి డయల్‌ చేయొచ్చని అధికారులు తెలిపారు.

మహిళలు, పిల్లలపై సైబర్ నేరాలపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. ఈ పోర్టల్‌లో ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తారు. ఈ పోర్టల్ ఆన్‌లైన్ చైల్డ్ పోర్నోగ్రఫీ (CP), చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్ (CSAM) లేదా రేప్/గ్యాంగ్ రేప్ (CP/RGR) కంటెంట్‌కు సంబంధించిన ఫిర్యాదులను సైతం ఈ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయొచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..