Android Users: మీ స్మార్ట్ ఫోన్‌లో ఈ యాప్‌లు ఉన్నాయా.? వెంట‌నే డిలీట్ చేయండి.. ఇప్ప‌టికే 10 కోట్ల యూజ‌ర్ల డేటా లీక్‌..

|

May 25, 2021 | 10:07 PM

Android Users: స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత అన్ని ప‌నులు సుల‌భంగా మారిపోయాయి. ఏ ప‌నినైనా స్మార్ట్ ఫోన్‌తో చేసే రోజులు వ‌చ్చేశాయి. అయితే స్మార్ట్‌ఫోన్‌తో ప‌నులు ఈజీగా...

Android Users: మీ స్మార్ట్ ఫోన్‌లో ఈ యాప్‌లు ఉన్నాయా.? వెంట‌నే డిలీట్ చేయండి.. ఇప్ప‌టికే 10 కోట్ల యూజ‌ర్ల డేటా లీక్‌..
Data Leake From Apps
Follow us on

Android Users: స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత అన్ని ప‌నులు సుల‌భంగా మారిపోయాయి. ఏ ప‌నినైనా స్మార్ట్ ఫోన్‌తో చేసే రోజులు వ‌చ్చేశాయి. అయితే స్మార్ట్‌ఫోన్‌తో ప‌నులు ఈజీగా మారాయ‌ని సంతోషించేలోపే సైబ‌ర్ నేర‌గాళ్ల దాడితో భ‌ద్ర‌త క‌రువై పోతోంది. మొబైల్ ఫోన్‌లోని వ్య‌క్తిగ‌త స‌మాచారం హ్యాక‌ర్ల చేతుల్లోకి వెళ్లిపోతోంది. ర‌క‌ర‌క‌ల యాప్‌ల‌తో మాల్‌వేర్ల‌ను ఫోన్ల‌లోకి పంపించి.. డేటాను కాజేస్తున్నారు.
తాజాగా చెక్ పాయింట్ రీసెర్చ్ అనే సంస్థ‌కు చెందిన ప‌రిశోధ‌కులు ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. కొన్ని ఆండ్రాయిడ్ యాప్‌లు స్మార్ట్ ఫోన్ యూజ‌ర్ల డేటాను కాజేస్తున్న‌ట్లు తేలింది. ఇప్ప‌టికే ఇలాంటి ప‌లు యాప్‌ల‌ను 10 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్‌ల‌లో ఈ యాప్‌లో డౌన్‌లోడ్ అయినట్లు గుర్తించారు. మాల్వేర్‌తో కూడిన యాప్‌ల‌లో ప్ర‌ముఖంగా ఆస్ట్రాల‌జీ, ఫ్యాక్స్‌, ట్యాక్సీ స‌ర్వీసెస్‌, స్క్రీన్ రికార్డింగ్ వంటి ఉన్న‌ట్లు క‌నుగొన్నారు. వీటిలో ముఖ్యంగా ఆస్ట్రోగురు,టీలావా (ట్యాక్సీ యాప్‌), యాప్ లోగో మేక‌ర్ వంటి యాప్‌లున్నాయి. ఈ యాప్‌లు యూజ‌ర్ల వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని దోచేస్తున్న‌ట్లు నిపుణులు గుర్తించారు. పేరు, పుట్టిన తేదీ, లొకేష‌న్‌ల‌తో పాటు వ్య‌క్తిగ‌త చాటింగ్‌ను కూడా హ్యాక‌ర్లు దోచేస్తున్నారని సైబ్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ యాప్‌ల‌ను డౌన్‌లోడ్ చేసుకున్న స‌మయంలో ఇచ్చే ప‌ర్మిష‌న్ల ఆధారంగానే హ్యాక‌ర్లు స‌మాచారాన్ని కాజేస్తున్నారు. ఇలాంటి యాప్‌లు మీ స్మార్ట్ ఫోన్‌లో ఉంటే వెంట‌నే డిలీట్ చేసుకోమ‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

Also Read: MLA Kakani : ఆనందయ్యతో కాకాణి చర్చలు.. అధ్యయనం నేపథ్యంలో ప్రస్తుతానికి ఎవరూ కృష్ణపట్నం రావొద్దని ఎమ్మెల్యే మనవి

ICC Hall Of Fame: ఘోర తప్పిదం చేసిన ఐసిసి.. విపరీతంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. ఇంతకీ ఆ తప్పేంటంటే..

రొమాన్స్ చేద్దామంటూ పిలిచింది.. అదును చూసి మర్మాంగాన్ని కోసేసింది.. ఇంతకీ ఏం జరిగందంటే..