
అతి పెద్ద డేటా ఉల్లంఘన వెలుగులోకి వచ్చింది. మిలియన్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులలో ఆందోళనలను రేకెత్తించింది. ఇటీవలి నివేదికల ప్రకారం, Gmail, Facebook, Instagram,Netflix వంటి ప్రధాన ప్లాట్‌ఫారమ్‌ల నుండి 140 మిలియన్లకు పైగా వినియోగదారు పేర్లు, పాస్‌వర్డ్‌లు లీక్ అయ్యాయి. ఆశ్చర్యకరంగా, ఈ డేటాను హ్యాకర్ దొంగిలించలేదు, కానీ ప్రమాదకరమైన మాల్వేర్ ద్వారా చోరీకి గురైంది. సైబర్ భద్రతా నిపుణులు వినియోగదారులు తక్షణ జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.
ఈ లీక్‌ను సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు జెరెమియా ఫౌలర్ కనుగొన్నారు. అతను ఎక్స్‌ప్రెస్‌విపిఎన్ ద్వారా తన పరిశోధనలను పంచుకున్నారు. దాదాపు 96GB డేటా ఇంటర్నెట్‌లో ఎటువంటి భద్రత, ఎన్‌క్రిప్షన్ లేకుండా బహిర్గతమైంది. అందరికీ అందుబాటులో ఉంది. ఈ డేటా సైబర్ నేరస్థుడి ద్వారా చొప్పించబడలేదు, కానీ తప్పుగా కాన్ఫిగర్ చేసిన డేటాబేస్‌లో గుర్తించారు. హోస్టింగ్ ప్రొవైడర్ దానిని తొలగించే వరకు, దానికి నిరంతరం కొత్త లాగిన్ వివరాలు జోడించడం జరుగుతుంది.
ఈ డేటా ఉల్లంఘనలో దాదాపు ప్రతి ప్రధాన డిజిటల్ ప్లాట్‌ఫామ్ నుండి వినియోగదారు పేర్లు, పాస్‌వర్డ్‌లు ఉన్నాయి. ముఖ్యంగా Gmail, Yahoo, Outlook వంటి ఇమెయిల్ ఖాతాల నుండి Facebook, Instagram, TikTok, X వరకు డేటా చోరీ జరిగినట్లు పేర్కొన్నారు. Netflix, Disney Plus, HBO Max, Roblox వంటి వినోద వేదికలు కూడా ప్రభావితమయ్యాయి. OnlyFans కు చెందిన, కొన్ని ప్రభుత్వ లాగిన్ వివరాలు కూడా లీక్‌లో భాగమని పేర్కొన్నారు.
దాదాపు 48 మిలియన్ల Gmail ఖాతాల నుండి సమాచారం లీక్ అయినట్లు నివేదిక వెల్లడించింది. అదనంగా, 4 మిలియన్ల Yahoo ఖాతాలు, 1.5 మిలియన్ల Outlook ఖాతాల వివరాలు కూడా ఉన్నాయి. సోషల్ మీడియా విషయానికొస్తే, 17 మిలియన్ల Facebook ఖాతాలు, 6.5 మిలియన్ల Instagram ఖాతాలు, సుమారు 8,00,000 TikTok ఖాతాల నుండి డేటా చోరీకి గురైంది. సుమారు 4.2 మిలియన్ల Netflix ఖాతాల నుండి లాగిన్ సమాచారం కూడా లీక్ అయ్యినట్లు వెల్లడించారు.
ఈ మొత్తం విషయంలో అత్యంత ఆందోళనకరమైన అంశం ఏమిటంటే, డేటాను హ్యాకర్ దొంగిలించలేదు. ఇన్ఫోస్టీలర్ అనే ప్రమాదకరమైన మాల్వేర్ దొంగిలించింది. ఈ మాల్వేర్ నిశ్శబ్దంగా పరికరాల్లోకి చొరబడి వినియోగదారుల పేర్లు, పాస్‌వర్డ్‌లు, ఇతర సున్నితమైన సమాచారాన్ని దొంగిలిస్తుంది. ఈ డేటాబేస్ ఆన్‌లైన్‌లో ఉన్నంత కాలం, మాల్వేర్ నిరంతరం కొత్త డేటాను జోడిస్తుంది. ప్రస్తుతం ఎంత మంది డేటాను డౌన్‌లోడ్ చేసుకున్నారో అంచనా వేయడం కష్టమని నిపుణులు అంటున్నారు.
సైబర్ నిపుణులు వినియోగదారులు తమ పరికరాలను మాల్వేర్ కోసం వెంటనే స్కాన్ చేయాలని, అన్ని ముఖ్యమైన ఖాతాల కోసం పాస్‌వర్డ్‌లను మార్చాలని సిఫార్సు చేస్తున్నారు. ప్రతి యాప్, సేవకు ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌లను కలిగి ఉండటం చాలా ముఖ్యం. అదనంగా, Gmail, Facebook, Instagram, Netflix వంటి ప్లాట్‌ఫామ్‌లలో రెండు-కారకాల ప్రామాణీకరణను ప్రారంభించడం వలన మీ ఆన్‌లైన్ భద్రత బలపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..