Dangerous Apps: ఈ రెండు ప్రమాదకరమైన యాప్‌లు మీ మొబైల్‌లో ఉంటే వెంటనే డిలీట్‌ చేయండి.. లేకపోతే మీ బ్యాంకు అకౌంట్‌ ఖాళీ!

|

Sep 11, 2022 | 1:49 PM

Dangerous Apps: ఈ మధ్య కాలంలో ఎన్నో నకిలీ యాప్‌లు పుట్టుకొస్తున్నాయి. కొన్ని యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకోవడం వల్ల వ్యక్తిగత వివరాలు నేరగాళ్లకు తెలిసిపోతుంది..

Dangerous Apps: ఈ రెండు ప్రమాదకరమైన యాప్‌లు మీ మొబైల్‌లో ఉంటే వెంటనే డిలీట్‌ చేయండి.. లేకపోతే మీ బ్యాంకు అకౌంట్‌ ఖాళీ!
Dangerous Apps
Follow us on

Dangerous Apps: ఈ మధ్య కాలంలో ఎన్నో నకిలీ యాప్‌లు పుట్టుకొస్తున్నాయి. కొన్ని యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకోవడం వల్ల వ్యక్తిగత వివరాలు నేరగాళ్లకు తెలిసిపోతుంది. యూజర్లకు ప్రమాదకరంగా మారే ఇలాంటి యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎప్పటికప్పుడు తొలగిస్తుంది. ఇప్పుడు మరోసారి భయంకరమైన షార్క్‌బాట్ మాల్వేర్ ప్లే స్టోర్‌లో కనిపించింది. ఈ నకిలీ క్లినర్‌ యాప్‌లు మొబైల్‌ యూజర్ల బ్యాంకు వివరలు, ఇతర వ్యక్తిగత వివరాలను సేకరిస్తుంది. ఈ వైరస్ వినియోగదారుల బ్యాంకింగ్ డేటాను దొంగిలిస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రమాదకరమైన యాప్‌లలో Mister Phone Cleaner, Kylhavy Mobile Security వంటి యాప్‌లు ఉన్నాయని గూగుల్‌ గుర్తించింది. ఈ రెండు యాప్‌లు మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉంటే వెంటనే తొలగించడం ముఖ్యం. లేకపోతే మీ బ్యాంకు వివరాలు తెలుసుకోవడమే కాకుండా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ యాప్‌లు దాదాపు 60వేల మందికిపైగా తమ ఫోన్‌లలో డౌన్‌లోడ్‌ చేసుకున్నారని గుర్తించారు. NCC గ్రూప్‌కు చెందిన ఫాక్స్-ఐటీ ప్రకారం.. ఈ వైరస్ ఆస్ట్రేలియా, స్పెయిన్, జర్మనీ, పోలాండ్, ఆస్ట్రియా, అమెరికాలో నివసిస్తున్న వినియోగదారులను లక్ష్యంగా చేసుకునే ఉద్దేశ్యంతో తయారు చేయబడింది. యాంటీవైరస్ యాప్‌ల కోసం నకిలీ అప్‌డేట్‌గా మాల్వేర్‌ను ఇన్‌స్టాల్ చేయమని ఈ యాప్‌లు వినియోగదారుని అడుగుతాయి. వీటిని ఇన్‌స్టాల్‌ చేసుకోగానే అంతే సంగతి. మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంకు, ఇతర వివరాలన్ని దొంగిలించేస్తారు.

Google Play Storeలో రెండు SharkbotDopper యాప్‌లు యాక్టివ్‌గా ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి మాత్రమే కాకుండా ఆటోమేటెడ్ ట్రాన్స్‌ఫర్ సిస్టమ్‌ని ఉపయోగించి ఫండ్ ట్రాన్స్‌ఫర్ మోసపూరిత ప్రక్రియ వల్ల మీరు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.

ఇవి కూడా చదవండి

షార్క్‌బాట్ వెర్షన్‌లో వినియోగదారు నుండి సెషన్ కుక్కీలను దొంగిలించి బ్యాంక్ ఖాతాలోకి లాగ్ చేసే ఫీచర్ కనుగొనబడింది. ఈ యాప్‌లు ఇప్పుడు Google Play Store నుండి తొలగించబడ్డాయి. అయితే ఈ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకున్న వారు వెంటనే తమ ఫోన్‌ల నుండి తీసివేయాలని సూచించారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి