ఇండియా ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ రెడీ అయ్యింది..నిప్పులు కక్కుతూ.. నింగిని చీల్చుకుంటూ దూసుకెళ్లడానికి సిద్ధమైంది. దేశంలోనే పూర్తిగా ఒక ప్రైవేట్ కంపెనీ తయారు చేసిన రాకెట్ ఇది. ఇస్రో వేదికగా ఈ నెల 12 నుంచి 16వ తేదీల్లో టేకాఫ్ కావడానికి రెడీ అవుతోంది. వెదర్‌ను బట్టి తుది ప్రయోగ తేదీ ఫిక్స్ చేస్తారు. ‘విక్రమ్–ఎస్’..కంప్లీట్ ప్రైవేట్ రాకెట్. స్కై రూట్ అనే స్పేస్ స్టార్టప్ కంపెనీ దీన్ని రూపొందించింది. గత ఏడాది నవంబర్‌లో దీన్ని విజయవంతంగా పరీక్షించింది. మున్ముందు విక్రమ్ సిరీస్‌లో పంపబడే రాకెట్లు..అంతరిక్ష యాత్రలకు కావాల్సిన అన్ని రకాల మిషిన్లు, సామాగ్రిని కూడా స్పేస్ స్టేషన్లకు తీసుకెళ్తాయని స్కైరూట్ నిర్వాహకులు చెబుతున్నారు.
‘విక్రమ్–ఎస్’ పేరుతో లాంచ్ అయ్యే రాకెట్‌ను..కలాం 80 అనే డిఫరెంట్ ఇంజిన్‌లతో పని చేస్తుంది. అనేక దశల్లో రూపొందబడే ప్రతి రాకెట్‌ను చాలాసార్లు పరీక్షించిన తర్వాత టేకాఫ్‌కు రెడీ చేస్తారు. ‘విక్రమ్–ఎస్’ రాకెట్‌కు అమర్చిన ఇంజిన్‌లను కూడా రెండేళ్ల పాటు పరీక్షించింది. భారత్ నుంచి ప్రైవేట్ రాకెట్ ప్రయోగాలు తరచుగా జరుగుతున్నందున, ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్ ప్రయోగాల కోసం ఊహించిన డిమాండ్ వస్తుందని.. ఇది.. తమ లాంటి ప్రైవేట్ స్పేస్ స్టార్టప్‌లకు ఊతమిస్తుందని స్కైరూట్ ఎగ్జిక్యూటివ్స్ చెబుతున్నారు. 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్‌లను రూపొదించిన సంస్థల్లో స్కైరూట్ ఒకటి.
‘విక్రమ్–ఎస్’ రాకెట్ లాంచ్‌తో ప్రపంచ వ్యాప్తంగా మరిన్ని ఆర్డర్‌లు తీసుకునే ప్రయత్నంలో ఉంది స్కైరూట్. 2025 నాటికి 60 వేల శాటిలైట్ లాంచ్ మిషన్‌లు జరగొచ్చని.. వీటిల్లో అధికశాతం తమలాంటి ప్రైవేట్ స్పేస్ కంపెనీలు దక్కించుకునే ప్రయత్నం చేస్తామని స్కైరూట్ సీఈఓ పవన్ కుమార్ చెప్పారు. స్కైరూట్ తొలి రాకెట్ ప్రయోగానికి ప్రారంభ్ అని పేరు పెట్టింది. శ్రీహరి కోట నుంచి ఆకాశంలోకి వెళ్లేందుకు ఇప్పటికే ప్లాట్‌ఫామ్ రెడీ చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులను బట్టి.. విక్రమ్ లాంచింగ్ జరుగనుంది. ఇస్రో, ఇన్‌స్పేస్ సహకారంతో చాలా తక్కువ సమయంలోనే ఈ మిషన్ సిద్దమైందని పవన్ కుమార్ చెప్పారు. భారత అంతరిక్ష పితామహుడు, ప్రఖ్యాత శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్‌కి నివాళిగా.. స్కైరూట్ రాకెట్లకు విక్రమ్ పేరు పెట్టారు. ఈ రాకెట్ ప్రయోగంతో భారత్‌లో తొలి ప్రైవేట్ రాకెట్‌ను ప్రయోగించిన ఘనత స్కైరూట్‌కే దక్కనుంది.
Thrilled to announce #Prarambh, our maiden launch mission, also the first for the Indian private space sector, with launch window between 12-16 Nov ’22. Thanks to Chairman @isro for unveiling our mission patch and @INSPACeIND for all the support.
Stay tuned?#OpeningSpaceForAll pic.twitter.com/xha83Ki2k0
— Skyroot Aerospace (@SkyrootA) November 8, 2022
మరిన్ని ఏపీ వార్తల కోసం