Nio Phone: మార్కెట్లో ఫోన్లన్నీ ఒక లెక్క.. ఈ ఫోన్ మరో లెక్క.. కేవలం డ్రైవర్ల కోసమే ఇది.. ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే..

చైనాకు చెందిన ప్రముఖ కార్ల తయారీదారు నియో ఓ కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. వాస్తవానికి కార్ల తయారీదారైన నియో తొలిసారి స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి అడుగుపెడుతోంది. కేవలం కార్ డ్రైవర్లను ఉద్దేశించి ఈ స్మార్ట్ ఫోన్ ను ఆవిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. తన కంపెనీకి చెందిన కార్లకు మరింత ఆకర్షణను తీసుకొచ్చేలా ఈ స్మార్ట్ ఫోన్ రూపొందించినట్లు పేర్కొంది.

Nio Phone: మార్కెట్లో ఫోన్లన్నీ ఒక లెక్క.. ఈ ఫోన్ మరో లెక్క.. కేవలం డ్రైవర్ల కోసమే ఇది.. ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే..
Nio Phone

Updated on: Aug 30, 2023 | 4:29 PM

ఇప్పటి వరకూ వచ్చిన ఫోన్లలో అనేక సాఫ్ట్ వేర్లు ఉన్నాయి. వివిధ రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. వేల సంఖ్యలోయాప్స్ అందులో పనిచేస్తున్నాయి. టాప్ బ్రాండ్లకు చెందిన స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో మనకు కనిపిస్తాయి. అయితే వాటన్నంటికీ భిన్నంగా, ఇంకా చెప్పాలంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తులకు మాత్రమే ఉపయోగపడేలా ఓ స్మార్ట్ ఫోన్ ను చైనాకు చెందిన ప్రముఖ కార్ల తయారీదారు నియో లాంచ్ చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. వాస్తవానికి కార్ల తయారీదారైన నియో తొలిసారి స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి అడుగుపెడుతోంది. కేవలం కార్ డ్రైవర్లను ఉద్దేశించి ఈ స్మార్ట్ ఫోన్ ను ఆవిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. తన కంపెనీకి చెందిన కార్లకు మరింత ఆకర్షణను తీసుకొచ్చేలా ఈ స్మార్ట్ ఫోన్ రూపొందించినట్లు పేర్కొంది. ఈ ఫోన్ ఏంటి? డ్రైవర్లకు ఉపయోపడటం ఏంటి? అందులోని ఫీచర్లేంటి? ఎప్పుడు లాంచ్ అవుతుంది? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఆటోమొబైల్ ఫీచర్లతో..

డ్రైవర్లు తమ స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా వివిధ ఆటోమొబైల్ ఫంక్షన్‌లను రిమోట్‌గా ఆపరేట్ చేయడానికి అనుమతించే విధంగా ఈ స్మార్ట్ ఫోన్లను కంపెనీ లాంచ్ చేస్తోంది. చైనాలో ఈ తరహా సిస్టమ్ బాగా ఆదరణ పొందతున్నాయి. ఫుల్లీ ఆటోమేటిక్, రిమోట్ ఆపరేటివ్ కార్లు మార్కెట్లో బాగా సేల్ అవుతున్నాయి. దీంతో నియో ఆ దిశగా తన కంపెనీ కార్లకు కనెక్ట్ అయ్యేలా ఓ స్మార్ట్ ఫోన్ ని మార్కెట్లోకి తీసుకొస్తోంది. కార్ల తలుపులు తెరవడం, ఎయిర్ కండిషనింగ్ ఆన్ చేయడం, కార్లను వాహనాలను ప్రారంభించడం వంటివి ఆటోమేటిక్ గా చేసేలా ఫోన్లో ఆటోమొబైల్ ఫంక్షన్లను జోడిస్తున్నట్లు నియో ప్రకటించింది.

లక్ష్యం ఇదే..

నియో సంస్థ ఫౌండర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ విలియం లిచే మాట్లాడుతూ తమ సంస్థకు చెందిన ఆటోమొబైల్స్ డ్రైవర్లను ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని కొత్త ఫోన్ తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఈ ఫోన్ మార్కెట్లోని ఇతర ఫోన్లతో పోటీపడదని స్పష్టం చేశారు. కేవలం తమ ఆటోమొబైల్ కస్టమర్ల కోసమే ఈ ఫోన్ తీసుకొస్తున్నట్లు వివరించారు. తమ వాహన వినియోగదారులకు సాధ్యమైనంత గొప్ప అనుభవాన్ని అందించడానికి ఫోన్‌ను క్యారియర్‌గా ఉపయోగించాలనుకుంటున్నట్లు వెల్లడించారు. వాహనదారులు స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీతో కూడిన సదుపాయాలను కోరుకుంటున్న నేపథ్యంలో ఈ తరహా ప్రయోగానికి తాము ముందుకు వచ్చినట్లు ప్రకటించారు. 2024 ద్వితీయార్థంలో కొత్త ఫోన్ లాంచ్ చేసే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

ఇన్వెస్టర్ల వెనుకంజ..

అయితే ఈ నియో కంపెనీ ఫోన్ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. వెనుకంజ వేస్తున్నారు. ఎందుకంటే నియో ఇప్పటికే నష్టాల్లో ఉంది. గత జనవరిలో టెస్లా ప్రారంభించిన ధర వార్ లో నియో నష్టాలు మరింత పెరిగాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోల్చితే, రెండవ త్రైమాసికంలో నియో నికర నష్టం 6.12 బిలియన్ యువాన్లకు ($839.51 మిలియన్లు) పెరిగింది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..