10G Broadband: అల్ట్రా-హై-స్పీడ్ ఇంటర్నెట్‌.. ఇక్కడ 10G బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలు..!

10G Broadband: 10G బ్రాడ్‌బ్యాండ్ కేవలం వేగవంతమైన ఇంటర్నెట్‌కు మాత్రమే పరిమితం కాదు. ఇది క్లౌడ్ గేమింగ్, రిమోట్ సర్జరీ, స్మార్ట్ హోమ్‌లు, టెలిమెడిసిన్, స్మార్ట్ ఫార్మింగ్, అటానమస్ వెహికల్స్ వంటి ఆధునిక సాంకేతికతలకు మద్దతు ఇస్తుంది. ఈ నెట్‌వర్క్ ద్వారా చైనా తన స్మార్ట్ సిటీ, డిజిటల్

10G Broadband: అల్ట్రా-హై-స్పీడ్ ఇంటర్నెట్‌.. ఇక్కడ 10G బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలు..!

Updated on: Apr 25, 2025 | 3:53 PM

ఇటీవల కొన్ని వెబ్‌సైట్లలో చైనా ప్రపంచంలోనే మొట్టమొదటి 10G బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిందని రాస్తున్నాయి. కానీ ఇది సరైనది కాదు. నిజానికి ఈ అల్ట్రా-హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవ ఇప్పటికే దక్షిణ కొరియా, జపాన్, రొమేనియా వంటి దేశాలలో ఉంది. చైనా నెట్‌వర్క్ ఖచ్చితంగా వేగవంతమైనది, అధునాతనమైనది. కానీ దానిని ప్రపంచంలో మొదటిది కాదని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. హువావే, చైనా యునికామ్ సహకారంతో అభివృద్ధి చేసిన ఈ టెక్నాలజీ ప్రస్తుత ప్రామాణిక ఫైబర్-ఆప్టిక్ కనెక్షన్ల కంటే గణనీయంగా వేగాన్ని అందిస్తుంది.

10G బ్రాడ్‌బ్యాండ్ అంటే ఏమిటి?

10G బ్రాడ్‌బ్యాండ్‌లోని ‘G’ అంటే ‘గిగాబిట్’, మొబైల్ నెట్‌వర్క్‌లలో ఉపయోగించే ‘జనరేషన్’ కాదు. ఇది వైర్డు ఫైబర్-ఆప్టిక్ ఇంటర్నెట్ కనెక్షన్. ఇది సెకనుకు 10 గిగాబిట్ల వేగాన్ని అందిస్తుంది. అంటే మీరు 20 GB 4K సినిమాను కేవలం 20 సెకన్లలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీని వేగం దాదాపు 9,834 Mbps వరకు పెరుగుతుంది. అయితే భారతదేశంలో సగటు వేగం ఇప్పటికీ 60 Mbps వద్ద ఉంది.

హుబే ప్రావిన్స్‌లోని సునాన్ కౌంటీలో చైనా 10G నెట్‌వర్క్‌ను ప్రారంభించిందని అనేక నివేదికలలో ఉంది. వాస్తవానికి, చైనా దేశవ్యాప్తంగా ఈ సాంకేతికత పైలట్ ప్రాజెక్టులను ప్రారంభించింది. వీటిలో జియోంగాన్, షాంఘై, గ్వాంగ్‌డాంగ్ వంటి పెద్ద ప్రాంతాలు ఉన్నాయి. ఇది అధికారికంగా జనవరి 2025లో ప్రకటించింది. అప్పటి నుండి ఇది అనేక ప్రాంతాలలో అమలు అవుతోంది.

ప్రపంచంలోని అనేక దేశాలు 10G:

ఈ రేసులో చైనా ఖచ్చితంగా వేగంగా ముందుకు సాగుతోంది. కానీ దక్షిణ కొరియా, జపాన్, యుఎస్, యుకె, యుఎఇ వంటి దేశాలు ఇప్పటికే 10G బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌లను ప్రారంభించాయి. ఈ నెట్‌వర్క్‌లు ప్రధానంగా వ్యాపారం, స్మార్ట్ టెక్నాలజీ కోసం ఉపయోగించనున్నాయి.

చైనా 10G వేగాన్ని భారతదేశంతో పోల్చినట్లయితే, తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఢిల్లీ వంటి నగరాల్లో, కొంతమంది ప్రొవైడర్లు 1 Gbps వరకు ప్లాన్‌లను ప్రకటిస్తారు. వేగం 77 Mbps మించదు. మార్చి 2025 నాటికి భారతదేశంలో సగటు స్థిర బ్రాడ్‌బ్యాండ్ వేగం 58.62 Mbps. భారతదేశం ప్రపంచంలో 87వ స్థానంలో ఉంది.

ఈ హై-స్పీడ్ నెట్‌వర్క్ ఎక్కడ ఉపయోగపడుతుంది?

10G బ్రాడ్‌బ్యాండ్ కేవలం వేగవంతమైన ఇంటర్నెట్‌కు మాత్రమే పరిమితం కాదు. ఇది క్లౌడ్ గేమింగ్, రిమోట్ సర్జరీ, స్మార్ట్ హోమ్‌లు, టెలిమెడిసిన్, స్మార్ట్ ఫార్మింగ్, అటానమస్ వెహికల్స్ వంటి ఆధునిక సాంకేతికతలకు మద్దతు ఇస్తుంది. ఈ నెట్‌వర్క్ ద్వారా చైనా తన స్మార్ట్ సిటీ, డిజిటల్ పరివర్తన కలను సాకారం చేసుకునే దిశగా ఒక పెద్ద అడుగు వేసింది.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి