Chandrayaan 2: చంద్రుడిపై పరిశోధనలో మరో ముందడుగు.. భారీగా సోడియంను గుర్తించిన చంద్రయాన్‌ 2..

|

Oct 08, 2022 | 1:42 PM

చంద్రుడిపై పరిశోధనల్లో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో అడుగు ముందుకు వేసింది. చంద్రుడి ఉపరితలాన్ని పరిశీలించేందుకు గాను ఇస్రో చేపట్టిన చంద్రయాన్‌ -2 తాజాగా కీలక వివరాలను అందించింది. చంద్రుడి ఉపరితలంపై భారీ మొత్తంలో సోడియం ఉన్నట్లు చంద్రయాన్‌-2..

Chandrayaan 2: చంద్రుడిపై పరిశోధనలో మరో ముందడుగు.. భారీగా సోడియంను గుర్తించిన చంద్రయాన్‌ 2..
Chandrayaan 2
Follow us on

చంద్రుడిపై పరిశోధనల్లో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో అడుగు ముందుకు వేసింది. చంద్రుడి ఉపరితలాన్ని పరిశీలించేందుకు గాను ఇస్రో చేపట్టిన చంద్రయాన్‌ -2 తాజాగా కీలక వివరాలను అందించింది. చంద్రుడి ఉపరితలంపై భారీ మొత్తంలో సోడియం ఉన్నట్లు చంద్రయాన్‌-2 గుర్తించింది. చంద్రయాన్‌-2లో ఉన్న క్లాస్‌ (చంద్రయాన్‌ -2 లార్జ్ ఏరియా సాఫ్ట్ ఎక్స్‌రే స్పెక్టోమీటర్) సోడియంను గుర్తించింది.

చంద్రుడిపై ఉన్న సోడియం నిల్వలను ఈ పరికరం మ్యాపింగ్ చేసినట్లు ఇస్రో తెలిపింది. ఇదిలా ఉంటే చంద్రుడిపై సోడియం నిల్వలను గుర్తించడం ఇదే తొలిసారి కాదు గతంలో చంద్రయాన్-1లోని ఫ్లూరోసెన్స్ స్పెక్టోమీటర్ (సీ1ఎక్స్‌ఎస్) తొలిసారిగా చంద్రుడిపై సోడియం ఉన్నట్లు గుర్తించింది. సోడియం నిల్వలను గుర్తించిన చంద్రయాన్‌ -2 లార్జ్ ఏరియా సాఫ్ట్ ఎక్స్‌రే స్పెక్టోమీటర్‌ను (క్లాస్‌) ఇస్రో శాస్త్రవేత్తలు యూఆర్ రావు శాటిలైట్ సెంటర్‌లో తయారు చేశారు. అత్యంత సామర్థ్యం కలిగిన ఈ పరికరం చంద్రుడిపై లూనార్‌ గ్రెయిన్స్‌తో కలిసి ఉన్న సోడియం కణాలను గుర్తించింది.

ఈ సోడియం అణువులు సౌర లేదా యూవీ కిరణాలకు వికిరణం చెందడం ద్వారా చాలా త్వరగా బయటపడ్డాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రుడిపై ఉన్న ఎక్సోస్పియర్‌ అనే ప్రాంతంలో సోడియంను గుర్తించారు. ఇది చంద్రుని ఉపరితలం వద్ద ప్రారంభమై వేల కిలోమీటర్ల మేర విస్తరించి ఉందని అభిప్రాయపడుతున్నారు. ఈ పరిశోధనల ద్వారా మన సౌర వ్యవస్థ వెలుపల పాదరసంతో పాటు ఇతర వాయు రహిత వస్తువుల సారూప్య నమూనాల అభివృద్ధికి సహాయపడుతుందని ఇస్రో తెలిపింది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..