Android Mobile: ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా? ఆ వైరస్‌తో ముప్పు ఉందని హెచ్చరించిన కేంద్రం..

|

May 27, 2023 | 3:45 PM

మొబైల్ ఫోన్లు వాడేవారికి కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఆండ్రాయిడ్ ఫోన్లలో దామ్ అనే వైరస్‌తో ముప్పు ఉందంటూ తాజాగా ప్రకటించింది. ఈ వైరస్ మొబైల్ ఫోన్లలోకి చొరబడి కాల్ రికార్డులు, కాంటాక్టు నెంబర్స్, హిస్టరీ తదితర అంశాలను తన అధీనంలోకి తీసుకుంటుందని జాతీయ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ వినియోగదారుల్ని హెచ్చరించింది.

Android Mobile: ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా? ఆ వైరస్‌తో ముప్పు ఉందని హెచ్చరించిన కేంద్రం..
Daam Malware
Follow us on

మొబైల్ ఫోన్లు వాడేవారికి కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఆండ్రాయిడ్ ఫోన్లలో దామ్ అనే వైరస్‌తో ముప్పు ఉందంటూ తాజాగా ప్రకటించింది. ఈ వైరస్ మొబైల్ ఫోన్లలోకి చొరబడి కాల్ రికార్డులు, కాంటాక్టు నెంబర్స్, హిస్టరీ తదితర అంశాలను తన అధీనంలోకి తీసుకుంటుందని జాతీయ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ వినియోగదారుల్ని హెచ్చరించింది. మొబైల్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని.. అనుమానస్పదంగా కనిపించే ఎలాంటి లింకులపైనా క్లిక్ చేయొద్దని సూచించింది. ఫోన్‌లో ఉండే సెక్యూరిటీ నుంచి తప్పించుకొని.. రాన్‌సమ్‌వేర్‌ను పెంచుకునే సామర్థ్యం ఈ వైరస్‌కు ఉందని ది ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ తెలిపింది. ఈ దాడులను ఎదుర్కొనేందుకు కృషి చేస్తున్నామని చెప్పింది.

ఒకవేళ ఈ దామ్‌ మాల్‌వేర్‌ ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ అయితే.. ఆ తర్వాత మొబైల్‌ సెక్యూరిటీ వ్యవస్థను మభ్యపెడుతుంది. డేటాను దొంగిలించేందుకు యత్నిస్తుంది. దీంతో ఫోన్‌లోని రీడింగ్‌ హిస్టరీ, బుక్‌మార్క్స్‌ తదితర కీలక సమాచారాన్ని అపహరిస్తుంది. అలాగే ఈ మాల్‌వేర్‍ కాల్‌ డేటాను సైతం హ్యాక్‌ చేస్తుందని సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపింది. చివరగా సమాచారం మొత్తాన్ని దొంగిలించిన తర్వాత దానిని ‘enc’ ఫార్మాట్‌ రూంపంలో ఎన్‌క్రిప్ట్‌ చేసుకొని, ఒరిజినల్‌ డేటాను డిలీట్‌ చేస్తుందని పేర్కొంది. ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలంటే అనుమానాస్పద యూఆర్‌ఎల్ లింకులను క్లిక్‌ చేయవద్దని, గుర్తు తెలియని, అనుమానస్పద వ్యక్తులు ఎవరైనా మెసేజ్‌ చేసినా కూడా స్పందించవద్దని వినియోగదారుల్ని కోరింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..