Car Tips: వేసవిలో కార్లు ఎందుకు తక్కువ మైలేజ్ ఇస్తాయి? కారణం ఇదే!

Car Tips: వేసవి కాలంలో కారు టైర్లలో సాధారణ గాలికి బదులుగా నైట్రోజన్ నింపాలి. నైట్రోజన్ టైర్ లోపల ఉష్ణోగ్రతను చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది టైర్‌పై అధిక ఒత్తిడి పెరగకుండా నిరోధిస్తుంది. దీనివల్ల మైలేజ్ పెరగడమే కాకుండా టైర్ లైఫ్ కూడా పెరుగుతుంది..

Car Tips: వేసవిలో కార్లు ఎందుకు తక్కువ మైలేజ్ ఇస్తాయి? కారణం ఇదే!

Updated on: Mar 03, 2025 | 7:18 PM

వేసవిలో కార్లు తక్కువ మైలేజీ ఇస్తుంటాయి.అందుకే వేసవి రాకతో మైలేజ్ అకస్మాత్తుగా పడిపోయినప్పుడు ఏం జరుగుతోందనని కారు డ్రైవర్లు ఆందోళన చెందుతుంటారు. ఈ ప్రశ్నకు సమాధానం చాలా మందికి తెలిసి ఉండవచ్చు. కానీ వేసవి వచ్చే కొద్దీ కారు మైలేజ్ తగ్గడానికి గల కారణాన్ని తెలుసుకోవాలనుకునే వారు ఇంకా చాలా మంది ఉన్నారు. వేసవిలో కారు మైలేజ్ తగ్గడానికి గల కారణం ఏమిటో తెలుసుకుందాం?

ఎయిర్ కండిషనర్ (AC) వాడకం: వేసవి వచ్చిన వెంటనే కారులో AC ఎక్కువగా వాడుతుంటారు. ఇది ఇంజిన్‌పై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. ఏసీ నడపడం వల్ల ఇంజిన్‌కు ఎక్కువ శక్తి అవసరమవుతుంది. ఇది మైలేజీని ప్రభావితం చేస్తుంది.

టైర్‌పై ఒత్తిడి పెరగడం ప్రారంభమవుతుంది: వేసవి కాలంలో టైర్ లోపల ఉష్ణోగ్రత పెరగడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా టైర్‌పై ఒత్తిడి పెరుగుతుంది. టైర్లపై ఒత్తిడి పెరిగేకొద్దీ మైలేజ్ తగ్గడం ప్రారంభమవుతుంది. వేసవిలో టైర్లు పగిలిపోవడం గురించి మీరు వినే ఉంటారు. దానికి కారణం కేవలం టైర్ల నాణ్యత సరిగా లేకపోవడం వల్లనే కాదు.. టైర్ లోపల ఉష్ణోగ్రత పెరగడం వల్ల కూడా జరుగుతుంటుంది.

అందుకే వేసవి కాలంలో కారు టైర్లలో సాధారణ గాలికి బదులుగా నైట్రోజన్ నింపాలి. నైట్రోజన్ టైర్ లోపల ఉష్ణోగ్రతను చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది టైర్‌పై అధిక ఒత్తిడి పెరగకుండా నిరోధిస్తుంది.

దీనివల్ల మైలేజ్ పెరగడమే కాకుండా టైర్ లైఫ్ కూడా పెరుగుతుంది. పెట్రోల్ పంపులో మీకు రెగ్యులర్ గాలి ఉచితంగా లభిస్తుందని గమనించండి. కానీ నైట్రోజన్ గాలికి మీరు టైర్‌కు కొంత ఛార్జ్‌ చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా ఒక్కో టైర్‌కు రూ.10 వరకు తీసుకుంటారు. కొన్ని చోట్ల ఎక్కువగా ఉంటుంది. ఇంజిన్ వేడెక్కడం: వేడి కాలంలో ఇంజిన్ ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా ఇంజిన్ సామర్థ్యం తగ్గడం ప్రారంభమవుతుంది.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి