BSNL 5G: త్వరలోనే బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు షురూ.. ఇకపై జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి పోటీ

|

Aug 05, 2024 | 1:21 PM

భారతదేశంలో ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం బాగా పెరిగింది. ముఖ్యంగా భారత టెలికం మార్కెట్‌లోకి జియో రాకతో ఇంటర్నెట్ వినియోగం అనేది ప్రతి ఒక్కరి చేతుల్లోకి వచ్చి చేరిందంటే అతిశయోక్తి కాదు. అయితే మారుతున్న రోజులను బట్టి జియో కూడా వరుసగా రీచార్జి ధరలను పెంచింది.  క్రమేపి ఎయిర్‌టెల్, వీఐ వంటి సంస్థలు కూడా జియోకు సరిసమానంగా రీచార్జ్ ధరలను పెంచాయి. అయితే ఎక్కువగా స్మార్ట్ ఫోన్ వినియోగించని ప్రజలు కూడా ఆయా కంపెనీలు నిర్ణయంతో తక్కువ ధరలోనే రీచార్జ్ ప్లాన్స్ ఏ నెట్‌వర్క్ ఇస్తుందో? అని చూస్తున్నారు.

BSNL 5G: త్వరలోనే బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు షురూ.. ఇకపై జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి పోటీ
Bsnl 5g
Follow us on

భారతదేశంలో ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం బాగా పెరిగింది. ముఖ్యంగా భారత టెలికం మార్కెట్‌లోకి జియో రాకతో ఇంటర్నెట్ వినియోగం అనేది ప్రతి ఒక్కరి చేతుల్లోకి వచ్చి చేరిందంటే అతిశయోక్తి కాదు. అయితే మారుతున్న రోజులను బట్టి జియో కూడా వరుసగా రీచార్జి ధరలను పెంచింది.  క్రమేపి ఎయిర్‌టెల్, వీఐ వంటి సంస్థలు కూడా జియోకు సరిసమానంగా రీచార్జ్ ధరలను పెంచాయి. అయితే ఎక్కువగా స్మార్ట్ ఫోన్ వినియోగించని ప్రజలు కూడా ఆయా కంపెనీలు నిర్ణయంతో తక్కువ ధరలోనే రీచార్జ్ ప్లాన్స్ ఏ నెట్‌వర్క్ ఇస్తుందో? అని చూస్తున్నారు. వీరందరికీ బీఎస్ఎన్ఎల్ ఓ ప్రత్యామ్నాయంగా మారింది. అయితే బీఎస్ఎన్ఎల్‌లో ఇప్పటికీ 5 జీ నెట్‌వర్క్ లేకపోవడంతో వినియోగదారులు ఒకింత అసహనానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో వీరికి గుడ్ న్యూస్ చెబుతున్నట్లు త్వరలోనే బీఎస్ఎన్ఎల్ 5 జీ సర్వీసులు అందుబాటులోకి వస్తాయని టెక్ నిపుణులు చెబుతున్నారు. కాబట్టి బీఎస్ఎన్ఎల్ 5 జీ సర్వీసుల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ఎయిర్‌టెల్, జియో రీచార్జీ ధరలను పెంచిన తర్వాత నుంచి అంటే ఇంచుమించు జూలై 3 నుంచి బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలను సంబంధించిన వార్తలు వైరల్‌గా మారుతున్నాయి. బీఎస్ఎన్ఎల్ భవిష్యత్‌లో 5జీ నెట్‌వర్క్ ద్వారా హై-స్పీడ్ ఇంటర్నెట్, మెరుగైన కాలింగ్ ఫీచర్లను అందించాలని యోచిస్తోంది. బీఎస్ఎన్ఎల్ 5జీను ఉపయోగించి ఇప్పటికే మొదటి కాల్ విజయవంతంగా చేశారు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్‌వర్క్‌ని ఉపయోగించి ప్రారంభ కాల్ చేశారు. అలాగే ఈ విషయానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

కేంద్రమంత్రి సింధియా బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్‌వర్క్ ద్వారా వీడియో కాల్‌లో మాట్లాడుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్‌వర్క్‌ను విడుదల చేయడంలో కొంచెం ఆలస్యం జరిగినప్పటికీ ఇది త్వరలో ప్రారంభించబడుతుందని సింధియా పేర్కొన్నారు. నివేదికల ప్రకారం బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు ఈ నెలాఖరు నాటికి అందుబాటులోకి రావచ్చు. భవిష్యత్తులో 6జీని కూడా ప్రవేశపెట్టాలని బీఎస్ఎన్ఎల్ కంపెనీ యోచిస్తోందని టెక్ నిపుణులు చెబుతున్నారు. అయితే మొదటగా బీఎస్ఎన్ఎల్ 5 జీ సేవలు దేశంలోని ప్రధాన నగరాల్లోని వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి