Body Sensor: ఇంటి నుంచి డాక్టర్ కు పేషెంట్ పరిస్థితిపై సమాచారం ఇచ్చే బాడీ సెన్సార్..కరోనా పేషెంట్స్ కోసమే!

|

Jun 11, 2021 | 9:53 PM

Body Sensor: కరోనా రోగులకు ఇంట్లో కూర్చునే లక్షణాలను పర్యవేక్షించడానికి సహాయపడే ఒక ప్రత్యేక రకం సెన్సార్‌ను అమెరికన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ సెన్సార్ ప్రత్యేక రకమైన ప్యాచ్‌గా ఉంటుంది.

Body Sensor: ఇంటి నుంచి డాక్టర్ కు పేషెంట్ పరిస్థితిపై సమాచారం ఇచ్చే బాడీ సెన్సార్..కరోనా పేషెంట్స్ కోసమే!
Corona Patients Body Sensor
Follow us on

Body Sensor: కరోనా రోగులకు ఇంట్లో కూర్చునే లక్షణాలను పర్యవేక్షించడానికి సహాయపడే ఒక ప్రత్యేక రకం సెన్సార్‌ను అమెరికన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ సెన్సార్ ప్రత్యేక రకమైన ప్యాచ్‌గా ఉంటుంది. దీనిని రోగి ఛాతీపై ఉంచాల్సి ఉంటుంది. ఈ ప్యాచ్ మొబైల్ పరికరానికి అనుసంధానిస్తారు. దీంతో ఆక్సిజన్ స్థాయి, హృదయ స్పందన రేటును ప్రత్యక్షంగా ఎప్పటికప్పుడు ఫోన్ స్క్రీన్ పై చూడవచ్చు.

దీనిద్వారా పరిస్థితి మరింత దిగజారడానికి ముందే వైద్యులను అప్రమత్తం చేయవచ్చు. ఈ సెన్సార్‌ను అమెరికాలోని చికాగో విశ్వవిద్యాలయం, డిజిటల్ మెడిసిన్ స్టార్టప్ ఫిజిఐక్యూ సంయుక్తంగా తయారు చేశాయి. ఈ సెన్సార్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమర్చారు. పరిశోధన ప్రకారం, ఈ సెన్సార్ సహాయంతో, రోగిని సుదూర ఆసుపత్రిలో కూర్చున్న వైద్యుడు ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చు. శరీరంలో మార్పులు కనిపించినప్పుడు, పరిస్థితి మరింత దిగజారడానికి ముందే వారు రోగిని అప్రమత్తం చేస్తారు. వారిని సకాలంలో ఆసుపత్రిలో చేర్చవచ్చు. దీనితో, ఆసుపత్రుల్లో రోగుల అనవసరమైన రద్దీని నివారించవచ్చు. పెరుగుతున్న ఇన్ఫెక్షన్ కారణంగా పరిస్థితి మరింత దిగజారిపోయే ప్రమాదాన్ని కూడా ఇది తగ్గిస్తుంది.

సెన్సార్ ప్యాచ్ ఈ విధంగా పనిచేస్తుంది..
ప్రస్తుతం తెలుస్తున్న వివరాల ప్రకారం.. పరిశోధనలో పాల్గొన్న ప్రతి రోగికి ఈ సెన్సార్ ప్యాచ్ ఇచ్చారు. దీనికి పల్స్ ఆక్సిమీటర్, సెన్సార్ ఉన్నాయి. సెన్సార్ మొబైల్ ఫోన్‌లో ఉన్న బ్లూటూత్‌కు కనెక్ట్ చేశారు. మొబైల్‌లో ఆక్సిజన్ లేదా హృదయ స్పందనలో మార్పులు ఇందులో కనిపించేలా చేశారు. ఇందులో ఏదైనా తేడా కనిపిస్తే.. అంటే హృదయస్పందన రేటు పెరగడం లేదా తగ్గడం, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం వంటివి ఉంటె, వైద్యులకు సందేశం వెళ్ళిపోతుంది.

59 ఏళ్ల ఏంజెలా మిచెల్ వృత్తిరీత్యా ఫార్మసీ టెక్నీషియన్. జూలై 2020 లో ఏంజెలా కరోనా బారిన పడింది. ఆమె ఐసోలేశాన్లో ఉన్నారు. ఆమెకు ఈ పాచ్ అనుసంధానించారు. ఈ అనుభవంపై ఏంజెలా ఇలా చెప్పారు..” రెండు రాత్రులు ఒంటరిగా ఉన్న తరువాత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంది. అనేనుఉదయం నిద్రలేచినప్పుడు, నాకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంది. నేను స్నానం చేయడానికి బాత్రూంకు వెళ్ళినప్పుడు, నాకు చెమటలు పట్టాయి. అటువంటి స్థితిలో, నేను బాత్రూంలోనే లేవలేని పరిస్థితిలో ఉండిపోయాను. అప్పుడు ఫోన్ మోగింది. నా పరిస్థితి పర్యవేక్షిస్తున్నట్లు ఆసుపత్రి నుండి కాల్ వచ్చింది. నన్ను అత్యవసర పరిస్థితుల్లో వెంటనే చేర్చాలని వైద్యులు సూచించారు. అయితే, నేను ఆసుపత్రికి చేరలేకపోయాను. కొద్దిగా ఆరోగ్యం బాగానే అనిపించి ఆసుపత్రికి వెళ్ళలేదు. కానీ, మరునాడు మళ్ళీ డాక్టర్ కాల్ వచ్చింది. నేను ఆసుపత్రికి రాకపోతే, నన్ను తీసుకెళ్లడానికి అంబులెన్స్ పంపిస్తామని చెప్పారు. అలాగే నాకు అంబులెన్స్ పంపించారు. నేను ఆసుపత్రిలో చేరిన తరువాత, నా ఆక్సిజన్ స్థాయి క్లిష్టమైన స్థాయికి పడిపోయిందని కనుగొన్నారు. వెంటనే నాకు ఆక్సిజన్ అందించారు. దీంతో నా ప్రాణం నిలిచింది.”

Also Read: Facebok New Featue: ఇక‌పై మీరు ఫేస్‌బుక్‌లో ఏం చూస్తున్నారో చాలా సీక్రెట్‌.. అందుబాటులోకి కొత్త ఫీచ‌ర్‌..

Zhurong Rover: చైనాకు చెందిన జురాంగ్‌ రోవర్‌ చిత్రాలను తీసిన అమెరికకు చెందిన ఉపగ్రహం