Boat Wave Lite: బోట్‌ నుంచి మరో కొత్త స్మార్ట్‌ వాచ్‌ వచ్చేసింది.. బడ్జెట్‌ ధరలో ఆకట్టుకునే ఫీచర్లు..

|

Apr 01, 2022 | 11:14 AM

Boat Wave Lite: ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్‌ వాచ్‌ (Smart Watch)ల హవా నడుస్తోంది. ఒకప్పుడు వాచ్‌ అంటే కేవలం సమయం తెలుసుకోవడానికి ఉపయోగించే ఓ వస్తువు. మరి ఇప్పుడు వాచ్‌ చేయలేని పని అంటూ ఉండదు. మీరు రోజుకు ఎన్ని గంటలు పడుకుంటున్నారు, ఎంతసేపు నడుస్తున్నారు...

Boat Wave Lite: బోట్‌ నుంచి మరో కొత్త స్మార్ట్‌ వాచ్‌ వచ్చేసింది.. బడ్జెట్‌ ధరలో ఆకట్టుకునే ఫీచర్లు..
Boat Wave Lite
Follow us on

Boat Wave Lite: ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్‌ వాచ్‌ (Smart Watch)ల హవా నడుస్తోంది. ఒకప్పుడు వాచ్‌ అంటే కేవలం సమయం తెలుసుకోవడానికి ఉపయోగించే ఓ వస్తువు. మరి ఇప్పుడు వాచ్‌ చేయలేని పని అంటూ ఉండదు. మీరు రోజుకు ఎన్ని గంటలు పడుకుంటున్నారు, ఎంతసేపు నడుస్తున్నారు, ఎన్ని క్యాలరీలు ఖర్చు చేస్తున్నారు. ఇలా ప్రతీ విషయాన్ని చెప్పేస్తున్నాయి. ఇదిలా ఉంటే మొదట్లో స్మార్ట్‌ వాచ్‌ల ధరలు భారీగా ఉండేవి. తక్కువలో తక్కువ రూ. 20 వేలు ఉండేవి. కానీ ప్రస్తుతం చాలా కంపెనీలు వీటిని తయారీ చేస్తుండడంతో స్మార్ట్‌ వాచ్‌ల ధరలు తగ్గుతున్నాయి.

దేశీ కంపెనీలు సైతం స్మార్ట్‌ వాచ్‌లను రూపొందిస్తున్నాయి. ఇలా స్మార్ట్‌ గ్యాడ్జెట్లను తయారు చేస్తున్న దేశీయ ప్రముఖ సంస్థల్లో బోట్‌ ఒకటి. ఇప్పటికే పలు ఆకర్షణీయమైన స్మార్ట్‌ వాచ్‌లను విడుదల చేసిన బోట్‌ తాజాగా మరో కొత్త స్మార్ట్‌ వాచ్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. మార్చి 31న మధ్యాహ్నం నుంచి ఈ స్మార్ట్‌ వాచ్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ వాచ్‌లో ఉన్న ఫీచర్లు, ధర వివరాలపై ఓ లుక్కేయండి..

బోట్‌ వేవ్‌ లైట్‌ (Boat Wave Lite) పేరుతో తీసుకొచ్చిన ఈ వాచ్‌లో 1.69 ఇంచెస్‌ డిస్‌ప్లేను అందించారు. 500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 160 డిగ్రీల యాంగిల్ ఆఫ్ వ్యూ, 70 శాతం ఆర్‌జీబీ కలర్ గాముట్ డిస్‌ప్లే దీని సొంతం. ఈ వాచ్‌ బరువు 44.8 గ్రాములుగా ఉంది. హార్ట్‌రేట్‌ మానిటరింగ్‌, ఎస్‌పీఓ2 బ్లడ్‌ ఆక్సిజన్‌ ట్రాకర్‌, స్లీప్‌ ట్రాకర్‌ వంటి ఫీచర్లను అందించారు.

వీటితోపాటు రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్‌తో పాటు10 స్పోర్ట్స్ మోడ్స్‌కు సపోర్ట్ చేస్తుంది. గూగుల్ ఫిట్, యాపిల్ హెల్త్ ఇంటిగ్రేషన్‌కు కూడా ఈ వాచ్‌ సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ వాచ్‌ను ఒక్కసారి చార్జ్‌ చేస్తే 7 రోజులపాటు పనిచేస్తుంది. వాటర్‌, డస్ట్‌ రెసిస్టెంట్స్‌ కోసం ఐపీ 67 రేటింగ్ ప్రత్యేకంగా అందించారు. ధర విషయానికొస్తే రూ. 1,999కి అందుబాటులో ఉంది.

Also Read: Inter Exams: ఆ జిల్లాల్లో ఇంటర్ పరీక్ష రద్దు.. ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

Dream: కలలో ఇవి కనిపిస్తే భవిష్యత్‌లో ఆ సంఘటనలు.. కొన్ని శుభాలు మరికొన్ని అశుభాలు..!

Eat Fruits: పండ్లు ఏ సమయంలో తింటే మంచిదో తెలుసా.. నిపుణులు ఏమంటున్నారంటే..