ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌‌తో ఫోటోలను నగ్నంగా చూపించే యాప్స్‌.. అమ్మాయిలూ జర జాగ్రత్త

ప్రపంచ వ్యాప్తంగా అనేక రంగాల్లో... టెక్నాలజీ పరంగా విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. నూతన టెక్నాలజీ వల్ల.. మన పని మరింత సులభతరం అవుతోంది...

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌‌తో  ఫోటోలను నగ్నంగా చూపించే యాప్స్‌.. అమ్మాయిలూ జర జాగ్రత్త
Deepnude App

Updated on: Aug 07, 2021 | 8:44 PM

ప్రపంచ వ్యాప్తంగా అనేక రంగాల్లో… టెక్నాలజీ పరంగా విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. నూతన టెక్నాలజీ వల్ల.. మన పని మరింత సులభతరం అవుతోంది. అనేక సేవలను కూడా మనం క్షణాల్లోనే పొందగలుగుతున్నాం. అయితే.. ఒక అంశానికి సంబంధించి లాభ‌, న‌ష్టాలు రెండూ ఉన్నట్లే.. టెక్నాల‌జీ వ‌ల్ల మ‌న‌కు ఎన్ని లాభాలు ఉన్నాయో.. అన్ని న‌ష్టాలూ ఉన్నాయి. కొంద‌రు ప్రబుద్ధులు టెక్నాల‌జీని మంచి ప‌నికి కాకుండా… కేవ‌లం చెడ్డ ప‌నుల‌కే వినియోగిస్తున్నారు. ముఖ్యంగా.. మహిళలను కించపరిచేలా కొన్ని నీచమైన యాప్స్‌ పుట్టుకొస్తున్నాయి. మొన్నటికి మొన్న.. ఒంటి మీద నూలు పోగు లేకుండా చూపించే న్యూడ్‌ యాప్స్‌ వస్తే…., తాజాగా.. ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ సాయంతో.. ఏకంగా ఫోటోలను కూడా.. నగ్నంగా చూపించే యాప్స్‌ బుల్లి స్క్రీన్‌పై ప్రత్యక్ష మవుతుండటం.. సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీతో.. కొత్తకొత్త యాప్‌లు తెరపైకి వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వారి అవసరాలకు అనుగుణంగా యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. అయితే.. కొన్ని యాప్‌లు మాత్రం.. సమాజానికి చేటుగా దాపరించాయి. నిండుగా దుస్తులు ధరించి సంప్రదాయబద్దంగా ఉండే మహిళలను కూడా… పూర్తి నగ్నంగా చూపించే యాప్స్‌ వస్తున్నాయి. కృత్రిమ మేథ సాయంతో.. ఆ యాప్స్‌ను తయరు చేస్తున్నారు.

బట్టలు వేసుకొని నిండుగా ఉన్న మహిళల ఫొటోలను… ఈ యాప్‌లో ఓపెన్ చేస్తే… వారు పూర్తి నగ్నంగా కనిపించేలా వీటిని రూపొందించారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా.. ఇలాంటి యాప్స్‌ ఎన్నో మార్కెట్లోకి వచ్చాయి. ఇంకా వస్తునే ఉన్నాయి. ఇప్పుడిదే పెద్ద దుమారం రేపుతోంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వల్ల మనకు ఎన్ని లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే.. వస్తువులు మనుషుల్లా ఆలోచింపజేసే టెక్నాలజీనే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అంటారు. ఈ టెక్నాలజీ తన చుట్టూ ఉన్న సమాచారాన్ని తీసుకొని… దానికి తగిన విధంగా స్పందిస్తుంది. ఇందులో విశేషం ఏమిటంటే…. ఈ టెక్నాలజీ మనమిచ్చే సమాచారాన్ని అర్థం చేసుకొని.. తన స్పందనను భవిష్యత్తులో మరింత మెరుగుపరుచుకునేందుకు కృషి చేస్తుంది. అయితే.. ఈ అత్యాధునిక టెక్నాలజీని అడ్డం పెట్టుకుని కొన్ని దిక్కుమాలిన కంపెనీలు.. ఈ న్యూడ్‌ ఫోటో యాప్‌లను తయారు చేస్తున్నారు.

ఇప్పటికే.. కృత్రిమ మేథస్సుతో తయారైన.. డీప్‌ న్యూడ్‌ అనే యాప్‌.. మార్కెట్లోకి వచ్చింది. ఈ యాప్‌లోకి ఏ మహిళకు చెందిన ఫోటోనైనా అప్‌లోడ్‌ చేస్తే.. ఆ ఫోటోలో ఆ మహిళ ధరించి ఉన్న దుస్తులను.. ఈ యాప్‌ ఆటోమేటిక్‌గా తీసేస్తుంది. దీంతో ఆ ఫోటోలో ఉన్న మహిళ నగ్నంగా దర్శనమిస్తుంది. ప్రస్తుతం ఇలాంటి నీచమైనయాప్స్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  మహిళల ఫోటోలను కృత్రిమ మేధ సాయంతో.. నగ్నంగా చూపించే సాఫ్ట్‌వేర్ సేవలకు గిరాకీ పెరుగుతోంది. ఇలా తయారు చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఒక్క జూన్ నెలలోనే ఈ సేవలను 50 లక్షల సార్లు ఉపయోగించినట్లు డేటా సూచిస్తోంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో మహిళల ఫోటోలను నగ్నంగా మార్చిన తర్వాత.. ఆ న్యూడ్‌ ఫోటోలను.. సోషల్‌ మీడియాల్లో పోస్ట్‌ చేస్తున్నారు. సెలెబ్రిటీలతో పాటు.. ఒలింపిక్స్‌ అథ్లెట్ల ఫోటోలు కూడా.. ఇలాంటి యాప్స్‌, వెబ్‌సైట్ల బారిన పడుతున్నారు. అందుకే.. ఇలాంటి టూల్స్‌ను నిషేధించాల్సిన అవసరం ఉందని, దీనిపై ప్రభుత్వాలు వెంటనే స్పందించి.. కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు.. చట్టంలో కూడాని మహిళా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఇప్పటికే.. బ్రిటన్‌ పార్లమెంట్‌లో కూడా ప్రస్తావన వచ్చింది. ఇలాంటి సాఫ్ట్‌ వేర్‌లను నిషేధించాలని ఎంపీ మరియా మిల్లర్‌ డిమాండ్‌ చేశారు.

మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు తయారు చేయడాన్ని నేరంగా పరిగణిస్తున్న ఈ రోజుల్లో.. ఈ న్యూడ్‌ ఫోటో యాప్స్‌ ఇంతగా ఎలా దిగజారి ప్రవర్తిస్తున్నాయని అంతా తిట్టిపోస్తున్నారు. ఇలాంటి యాప్‌ల వల్ల మహిళల్లో అభద్రతా భావం ఏర్పడుతుందని, వేదింపులు పెరుగుతాయంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇప్పటికీ ఈ యాప్స్‌కు సంబంధించిన కొన్ని వెర్షన్లు.. లేటెస్ట్‌ టూల్స్‌.. ఆన్‌లైన్లో ఉన్నాయని, వెంటనే వాటిని కూడా తొలగించాలని కోరుతున్నారు. యాప్‌ స్టోర్ సంస్థలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఇలాంటి చట్టవిరుద్ధమైన యాప్‌లపై నిషేదం విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇలాంటి యాప్‌లు వినియోగించడం చట్టరీత్యా నేరం. ఇవి చెలామణిలోకి వస్తే మహిళలు బయట ప్రపంచంలో స్వేచ్ఛగా తిరగాలంటేనే భయపడే పరిస్థితులు ఏర్పడతాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు సైతం ఇలాంటి యాప్‌లను నిషేదించేందుకు చర్యలు తీసుకోవాలని, లేకపోతే అసాంఘిక శక్తులు వీటిని దుర్వినియోగం చేస్తాయని పలు సామాజిక సంస్థలు కోరుతున్నాయి. కాబట్టి.. మీరు కూడా ఇలాంటి యాప్‌లకు దూరంగా ఉండండి. ఈ విషయాన్ని మీ స్నేహితులతోనూ షేర్ చేసుకుని అప్రమత్తం చేయండి.

Also Read: : ఒకప్పుడు ఊబకాయుడు.. ఇప్పుడు వండర్ క్రియేట్ చేసిన వీరుడు.. జయహో నీరజ్

సీతానగరం గ్యాంగ్ రేప్ కేసులో మీడియా ముందుకు నిందితులు.. ఈ కర్కోటకుల క్రైమ్స్ తెలిస్తే దడే

 

Follow Us