Tech Tips: వారెవ్వా.. అతి తక్కువ ధరకే బెస్ట్ ల్యాప్‌టాప్స్.. అస్సలు మిస్ అవ్వకండి..

ఈ డిజిటల్ యుగంలో విద్యార్థులకు ల్యాప్‌టాప్స్ చాలా అవసరం. చాలా బ్రాండ్‌లలో రూ. 50,000 లోపు బెస్ట్ ల్యాప్‌టాప్ అందుబాటులో ఉన్నాయి. ఇవి అద్భుత పనితీరు, మంచి బ్యాటరీ జీవితం, తేలికపాటి డిజైన్‌తో మార్కెట్‌లోకి వచ్చాయి. దీన్ని క్యాంపస్‌కు చాలా ఈజీగా తీసుకెళ్లవచ్చు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకోవచ్చు.

Tech Tips: వారెవ్వా.. అతి తక్కువ ధరకే బెస్ట్ ల్యాప్‌టాప్స్.. అస్సలు మిస్ అవ్వకండి..
Best Laptops Under Rs 50000

Updated on: Sep 15, 2025 | 3:33 PM

చదువుకోవడం, నోట్స్ రెడీ చేసుకోవడం, అసైన్‌మెంట్‌లను పూర్తి చేయడం, ఇష్టమైన షోలను చూడటం .. విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లో చేయవలసిన పనుల చాలా ఉంటాయి. వారికి ల్యాప్‌టాప్ అనేది కేవలం ఒక సాధనం మాత్రమే కాదు.. ఎంతో ముఖ్యమైనది. అయితే, బడ్జెట్ అనేది ఒక పెద్ద సవాలు. మధ్యతరగతి ప్రజలు ధర ఎక్కువ అని వెనకడుగు వేస్తుంటారు. విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూ.50,000 లోపు దొరికే కొన్ని అద్భుతమైన ల్యాప్‌టాప్‌ల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఏసస్ వివో బుక్ 15

ఏసస్ వివో బుక్ 15 విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇది ఇంటెల్ 12th జనరేషన్ కోర్ i5 ప్రాసెసర్‌తో వస్తుంది. 8GB ర్యామ్, 15.6 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేను కలిగి ఉంది. బ్యాక్‌లిట్ కీబోర్డ్, కోపైలట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది కేవలం 1.7 కిలోలు మాత్రమే ఉండటంతో సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. దీన్ని ధర రూ.35,500గా ఉంది.

HP 15

బడ్జెట్‌లో ఉన్న మరో అద్భుతమైన ల్యాప్‌టాప్ HP 15. ఇది విద్యార్థులకు మంచి పనితీరును అందిస్తుంది. ఇది ఇంటెల్ 13th జనరేషన్ కోర్ i3-1315U ప్రాసెసర్‌తో వస్తుంది. 8GB ర్యామ్, 512GB స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తుంది. దీన్ని బరువు 1.59 కిలోలు. హెచ్‌పీ ఫాస్ట్ ఛార్జ్‌తో కేవలం 45 నిమిషాల్లో 50శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. దీన్ని ధర రూ.34839

డెల్ డెల్ ఇన్‌స్పైరాన్ 3530

రోజువారీ ఉపయోగం కోసం డెల్ ఇన్‌స్పైరాన్ 3530 ఒక అద్భుతమైన ఎంపిక. ఇది 13th జనరేషన్ కోర్ i3-1305U ప్రాసెసర్‌తో వస్తుంది. 8GB ర్యామ్, 512GB స్టోరేజ్ ఆప్షన్‌ను కలిగివుంది. 15.6 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ డీస్‌ప్లే తో 120Hz రిఫ్రెష్ రేట్ ను కలిగివుంది. దీన్ని బరువు 1.62 కిలోలు. విండోస్ 11 హోమ్, ఎమ్‌ఎస్ ఆఫీస్ హోమ్, 5 నెలల McAfee సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా వస్తాయి. దీన్ని ధర రూ.38,090గా ఉంది.

రియల్ మీ బుక్

రియల్ మీ బుక్ అనేది పోర్టబులిటీకి ప్రాధాన్యత ఇచ్చే వారికి బెస్ట్ ఆప్షన్. దీన్ని బరువు కేవలం 1.38 కిలోలు. చాలా తేలికగా ఉండడంతో ఎక్కడిక్కైనా ఈజీగా తీసుకెళ్లవచ్చు. ఇది ఇంటెల్ 11th జనరేషన్ కోర్ i5 ప్రాసెసర్‌తో వస్తుంది. 8జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఆప్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా 14 ఇంచెస్ 2K డిస్‌ప్లే, 400 నిట్స్ బ్రైట్‌నెస్‌తో ఇది స్పష్టమైన విజువల్స్ అందిస్తుంది. ఇది 11 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుంది. దీన్ని ధర రూ. 43,016గా ఉంది.

ఈ ల్యాప్‌టాప్‌లు అన్నీ రూ.50,000 లోపు మంచి పనితీరు మరియు ఫీచర్లను అందిస్తాయి, విద్యార్థుల అవసరాలను సులభంగా తీరుస్తాయి. మీ అవసరాలకు తగ్గట్టుగా ఈ జాబితా నుండి మీకు నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..