Best AI tools: ఈ టూల్స్‌తో పాత ఫొటోలు కొత్తగా మార్చొచ్చు!

ఇంట్లో పాత బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ఉన్నాయా? వాటిని లేటెస్ట్ ఫొటోస్ గా మార్చాలనుకుంటున్నారా? కొన్ని ఏఐ టూల్స్ సాయంతో ఈ పని చాలా ఈజీగా చేసేయొచ్చు. అవసరమైతే పాత ఫొటోలను వీడియోగా కూడా కన్వర్ట్ చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

Best AI tools: ఈ టూల్స్‌తో పాత ఫొటోలు కొత్తగా మార్చొచ్చు!
Best Ai Tools

Updated on: Sep 18, 2025 | 11:31 AM

పాత ఫొటోలను మెమరీస్ గా దాచుకుంటుంటారు చాలామంది. అయితే ఇప్పుడు వస్తున్న ఏఐతో  ఇలాంటి మెమరీస్ కు కొత్త లైఫ్ ఇవ్వొచ్చు. పాత ఫొటోస్ ను క్యాప్చర్ చేసి వాటిని ​సైట్​లో అప్​లోడ్​ చేస్తే చాలు  బ్యాక్‌గ్రౌండ్ ఛేంజ్ నుంచి  ఫొటో రెజల్యూషన్ వరకూ అన్నీ మార్చుకోవచ్చు. దీనికై ఏయే టూల్స్ బెస్ట్ అంటే..

రెమినీ. ఏఐ(remini.ai)

ఫోటోలను రీక్రియేట్ చేసే ఏఐ టూల్స్ రెమినీ బెస్ట్ టూల్ అని చెప్పొచ్చు. పాత ఫొటోలను మళ్లీ క్యాప్చర్​ చేసి ‘రెమినీ.ఏఐ’ వెబ్​సైట్​లో అప్​లోడ్​ చేస్తే చాలు. ఒక్క క్లిక్​తో పాత ఫొటోలు కలర్ ఫొటోస్ గా మారిపోతాయి. ఇందులో ఉండే ఏఐ.. పిక్సెల్స్‌ను రీడ్ చేసి వాటిని కరెక్ట్ చేస్తుంది. బ్యాక్‌గ్రౌండ్​, ఫేస్​ని డిటెక్ట్​ చేసి.. కలర్​ కరెక్షన్​ కూడా చేసేస్తుంది.

ఫొటొర్(fotor)

ఈ టూల్ లో ఉండే రీస్టోర్ అండ్ కలరైజ్ ఆప్షన్ ద్వారా  పాత ఫొటోలు కలర్ ఫొటోలుగా మార్చడమే కాకుండా  ఫొటో క్వాలిటీని కూడా పెంచుకోవచ్చు.

రన్ వే (Runwayml)

రన్ వే అనే మరో ఏఐ టూల్ ద్వారా పాత ఫొటోస్ ను కొత్తగా రీక్రియేట్ చేయడమే కాకుండా ఫొటోకు మూవ్ మెంట్ కూడా ఇవ్వొచ్చు. అంటే పాత ఫ్యామిలీ ఫొటోలో ఉన్న వ్యక్తులు హాయ్ చేప్తున్నట్టు గా లేదా నవ్వుతున్నట్టుగా వీడియో కూడా జనరేట్ చేయొచ్చు.

ఫొట్ ఏఐ(phot.ai)

ఈ టూల్ తో పాత బ్లాక్ అండ్ ఫొటోస్ పై ఉండే గీతలు, స్క్రాచెస్ వంటివి కూడా రిమూవ్ చేయొచ్చు. అలాగే ఇందులో ఫొటో కలరైజర్, ఇమేజ్ అప్‌స్కేలర్, బ్యాక్‌గ్రౌండ్ రిమూవర్ వంటి చాలా ఆప్షన్స్ ఉన్నాయి.

రిమూవల్. ఏఐ(removal.ai)

రిమూవల్ అనే ఏఐ టూల్ తో పాత ఫొటోస్ ను కొత్తగా రీడిజైన్ చేసుకోవచ్చు. ఫొటోలో అవసరం లేని వస్తువులు లేదా బ్యాక్ గ్రౌండ్ వంటివాటిని రిమూవ్ చేయడానకి ఈ టూల్ బాగా పనికొస్తుంది.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి