Bathing Tips: వర్షాకాలంలో ముందుజాగ్రత్తగా చెట్టుకింద నిల్చోకూడదంటూ చెబుతుంటారు. ఎందుకంటే పిడుగులు పడి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. అయితే ఇప్పుడు నిపుణులు కొత్త సలహా ఇస్తున్నారు. అదేంటంటే వర్షం కురుస్తున్న సమయంలో బాత్‌రూంలో స్నానం చేయకూడదని. ఇలా స్నానం చేయడం ప్రమాదకరమని నిపుణులు సూచిస్తున్నారు. వర్షం సమయంలో ఆకాశంలో మెరుపుల వల్ల మనిషికి ప్రమాదం ఉండే అవకాశం ఉందంటున్నారు. వర్షం కురుస్తున్న సమయంలో బాత్‌రూమ్‌లో షవర్ కింద స్నానం చేయడం వల్ల ఆకాశంలో మెరుపులు మెరిసి ఆ విద్యుత్ ప్రసరణ భూమికి చేరుకుంటుంది. దీంతో స్నానం చేస్తుండగా, ప్రమాదం సంభవించే అవకాశం ఉందంటున్నారు. సైన్స్ అలర్ట్ నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 24 వేల మంది పిడుగుపాటు కారణంగా మరణిస్తున్నారు. అలాగే దీని కారణంగా దాదాపు 2.5 లక్షల మంది గాయపడుతున్నారు. వర్షం కురుస్తున్న సమయంలో పిడుగుపాటు కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. నాటింగ్‌హామ్ విశ్వవిద్యాలయానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త జేమ్స్ రౌలింగ్ కూడా బాత్‌రూమ్‌లో ప్రాణహాని ఉందని వివరిస్తున్నారు.
రౌలింగ్ ప్రకారం.. మేఘాలు చాలా నీరు, మంచు బిందువులను కలిగి ఉంటాయి. నీటి బిందువులు మంచు బిందువులతో ఢీకొన్నప్పుడు, అవి ప్రతికూల చార్జ్‌ను ఉత్పత్తి చేస్తాయి. తమలో తాము సానుకూల చార్జ్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ విధంగా రెండూ ఢీకొనడంతో విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. ఈ కారణంగానే ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. భూమిపై నివసించే ప్రజలకు ఈ పిడుగుల ప్రమాదం పెరుగుతుంది.
ఆకాశంలో ఉరుము మేఘాలు భూమిపై నుండి ఉద్భవించినప్పుడు, అవి భూమిపై వ్యతిరేక చార్జ్‌ను సృష్టిస్తాయి. ఈ కారణంగానే మెరుపు బలమైన కాంతి రూపంలో భూమి వైపుకు వవస్తుంటుంది. దీని కారణంగా ప్రజల మరణాలు పెరిగే అవకాశం ప్రమాదం ఉంది. ఈ విద్యుత్ కనెక్షన్ కూడా షవర్ నుండి వస్తుందని చెబుతున్నారు.
పిడుగులు వచ్చినప్పుడల్లా మెటల్‌తో చేసిన వస్తువులపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. షవర్ పైపులు సాధారణంగా లోహంతో తయారు చేయబడినందున మెరుపు ఇంటిని తాకినప్పుడు అది భూమికి చేరుకోవడానికి ఒక మార్గాన్ని కనుగొంటుంది. షవర్ మెటల్ పైపులు ఇందుకు ప్రభావితమవుతాయి. ఈ విధంగా, షవర్ పైపు నుండి విద్యుత్తు, దాని నుండి నీరు బయటకు వచ్చే ప్రక్రియ మానవులకు ప్రమాదకరమని అంటున్నారు పరిశోధకులు.
వర్షకాలంలో ఉరుములు మెరుపులు వస్తుంటే బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాలని హెచ్చరిస్తున్నారు. దీని వల్ల పిడుగుపాటు ప్రమాదాన్ని నివారించవచ్చని సలహా ఇస్తున్నారు. అలాగే బాత్‌రూమ్ బయట ఉండకుండా ఇంటిలోపల ఉన్నా ప్రమాదమేనంటున్నారు నిపుణులు.
వర్షం సమయంలో ఏమీ చేయకూడదు: ఉదాహరణకు, కాంక్రీట్ గోడకు దగ్గరగా నిలబడకుండా ఉండండి. ఎందుకంటే వాటిలో ఇనుప కడ్డీలు ఉంటాయి. అలాగే ఇనుప వస్తువులను కడగకూడదు. విద్యుత్తు అంతరాయం సమయంలో నీటికి సంబంధించిన పనులు చేయవద్దు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి