పైన ఫొటో చూడగానే ఎవరో యాంకర్ వార్తలు చదువుతున్నట్లు కనిపిస్తోంది కదూ! మీరు చూసింది నిజమే ఆ యాంకర్ వార్తలు చదువుతోంది. కానీ ఆ ఫొటోలో ఉన్న మహిళ నిజమైన యాంకర్ కాదు. అవును మీరు చదివింది నిజమే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వార్తలు చెబుతోన్న ఏఐ న్యూస్ యాంకర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక రంగంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు అన్ని రంగాల్లో కృత్రిమ మేథ అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా మీడియా రంగంలోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ ఉపయోగం వచ్చేసింది.
తాజాగా ఒడిశాకు చెందిన ఓటీవీ దేశంలోని తొలిసారి ఏఐ న్యూస్ యాంకర్‌తో వార్తలు చదివించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. చీర కట్టులో ఉన్న ఈ ఏఐ న్యూస్ యాంకర్ ఇంగ్లిష్‌లో వార్తలు చకచకా చదివేస్తోంది. అచ్చంగా మనిషి ఎలా మాట్లాడుతుందో అలాగే మాట్లాడుతోంది. లిప్ సింక్ కూడా పర్‌ఫెక్ట్‌గా మ్యాచ్ కావడం ప్రత్యేకతగా చెప్పొచ్చు.
ఈ ఏఐ న్యూస్ యాంకర్‌గా లిసాగా నామకరణం చేశారు. ఈ యాంకర్.. టీవీతో పాటు, డిజిటల్ ప్లాట్ ఫామ్స్‌లోనూ ప్రధాన యాంకర్‌గా వ్యవహరిస్తుందని ఓటీవీ యాజమాన్యం తెలిపింది. టీవీ బ్రాడ్ కాస్టింగ్, జర్నలిజంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఈ యాంకర్‌ను తీసుకొచ్చామని టీవీ యాజమాన్యం తెలిపింది. లిసా భవిష్యత్తులో ప్రాంతీయ భాషల్లోనూ మాట్లాడుతుందని చెప్పుకొచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఉద్యోగాలు కోల్పోవడం ఖాయమనే చర్చ జరుగుతోన్న తురణంలో ఇలాంటి సంఘటనలు వార్తలకు ఊతమిచ్చినట్లవుతుంది.
Meet Lisa, OTV and Odisha’s first AI news anchor set to revolutionize TV Broadcasting & Journalism#AIAnchorLisa #Lisa #Odisha #OTVNews #OTVAnchorLisa pic.twitter.com/NDm9ZAz8YW
— OTV (@otvnews) July 9, 2023
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..