Google Map: గూగుల్ మ్యాప్స్‌లో కీలక మార్పులు.. ఇప్పుడు ఈ సేవలు ఉచితం.. వచ్చే ఏడాది నుంచి అమలు..

|

Dec 12, 2024 | 6:55 PM

Google Map: గూగుల్‌ నుంచి ఎన్నో సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఏది వెతకాలన్నా.. ఏదీ చూడాలన్నా, ఎక్కడికైనా వెళ్లాలన్నా రూట్‌ మ్యాప్‌ కోసం గూగుల్‌ను ఆశ్రయిస్తుంటాము. అయితే వచ్చే ఏడాది నుంచి గూగుల్‌లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. వినియోగదారులకు మరిన్ని ఫీచర్స్‌ను అందించనుంది..

Google Map: గూగుల్ మ్యాప్స్‌లో కీలక మార్పులు.. ఇప్పుడు ఈ సేవలు ఉచితం.. వచ్చే ఏడాది నుంచి అమలు..
Follow us on

ప్రముఖ నావిగేషన్ యాప్ గూగుల్ మ్యాప్స్ కోసం గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ భారీ మార్పులు చేస్తోంది. గూగుల్ తన మ్యాప్స్ ప్లాట్‌ఫారమ్ నుండి భారతీయ డెవలపర్‌లకు మరిన్ని ఫీచర్లను అందించనున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు భారతీయ డెవలపర్లు రూట్‌లు, స్థలాలు, పర్యావరణ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్ (API), సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కిట్ (SDK) మొదలైనవాటిని ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఈ సేవ మార్చి 1, 2025 నుండి అందుబాటులో రానున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Room Heater: మీరు రూమ్ హీటర్ వాడుతున్నారా? ఈ తప్పులు చేయకండి.. మీకే శత్రువుగా మారొచ్చు..!

మార్చి 1, 2025 నుండి డెవలపర్‌లు నెలవారీ పరిమితి వరకు మ్యాప్స్, రూట్‌లు, లొకేషన్, ఎన్విరాన్‌మెంట్ వంటికి ఉచిత యాక్సెస్‌ను పొందుతారు. ఇది ఎటువంటి ముందస్తు ఖర్చు లేకుండా డైనమిక్ వీధి వీక్షణ వంటి విభిన్న వాటిని సులభంగా ఇంటిగ్రేట్ చేయడానికి వారిని అనుమతిస్తుంది. మీరు ప్రతి నెల $6,800 వరకు విలువైన ఉచిత సేవలను ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

70 లక్షల కిలోమీటర్ల కంటే ఎక్కువ రోడ్ల కవరేజీ:

డెలివరీ నుండి ట్రావెల్ యాప్‌ల తయారీ వరకు ప్రతిదానికీ భారతదేశంలో Google మ్యాప్స్ ప్లాట్‌ఫారమ్ ఉపయోగిస్తున్నారు. భారతదేశంలో మా కవరేజీ 7 మిలియన్ కిలోమీటర్ల కంటే ఎక్కువ రోడ్లు, 300 మిలియన్ భవనాలు, 35 మిలియన్ వ్యాపారాలు, ఇతర వాటిల్లో విస్తరించి ఉందని చెబుతోంది. అలాగే గూగుల్ మ్యాప్స్ ప్లాట్‌ఫారమ్ ఇటీవల భారతదేశంలో నిర్దిష్ట ధరలను ప్రారంభించిందని టెక్ దిగ్గజం తెలిపింది. ఇది చాలా APIలలో గరిష్టంగా 70 శాతం వరకు తక్కువ ధరలు ఉంటాయని, ఎంపిక చేసిన Google Maps ప్లాట్‌ఫారమ్ APIలపై డెవలపర్‌లకు 90 శాతం వరకు తగ్గింపులను అందించే ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC)తో కలిసి ఉంటుందని తెలిపింది.

ఇది చదవండి: Airtel Cheapest Plan: ఎయిర్‌టెల్‌ సూపర్‌ ప్లాన్‌.. కేవలం రూ.1999 ప్లాన్‌తో 365 రోజుల వ్యాలిడిటీ!

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి