iPhone 15 Pro: ఐఫోన్‌ 15 ప్రో సిరీస్‌లో 8 జీబీ ర్యామ్‌, అద్భుతమైన ఫీచర్స్‌.. ముందే లీకులు..!

|

Oct 29, 2022 | 5:21 AM

ఐఫోన్ 14 సిరీస్‌ను ప్రారంభించి ఎక్కువ సమయం పట్టలేదు. కంపెనీ తదుపరి సిరీస్‌కు సంబంధించి లీక్‌లు తెరపైకి రావడం ప్రారంభించాయి. ఐఫోన్ 14 సిరీస్‌లో..

iPhone 15 Pro: ఐఫోన్‌ 15 ప్రో సిరీస్‌లో 8 జీబీ ర్యామ్‌, అద్భుతమైన ఫీచర్స్‌.. ముందే లీకులు..!
Iphone
Follow us on

ఐఫోన్ 14 సిరీస్‌ను ప్రారంభించి ఎక్కువ సమయం పట్టలేదు. కంపెనీ తదుపరి సిరీస్‌కు సంబంధించి లీక్‌లు తెరపైకి రావడం ప్రారంభించాయి. ఐఫోన్ 14 సిరీస్‌లో ప్రారంభించబడిన ఐఫోన్ 14 ప్రో అప్‌గ్రేడ్ వెర్షన్ ఐఫోన్ 15 ప్రో లక్షణాలు లీక్ అయ్యాయి. ఒక పరిశోధనా సంస్థ ఈ లక్షణాలను అంచనా వేసింది. రాబోయే ఆపిల్ ఐఫోన్ 15 ప్రో మోడల్‌లు వచ్చే ఏడాది మెరుగైన ఫిచర్స్‌తో అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలున్నాయని అంచనా వేసింది.లీక్ అయిన సమాచారం ప్రకారం.. ఆపిల్‌ తదుపరి తరం A17 బయోనిక్ చిప్‌సెట్ iPhone 15 Pro, iPhone 15 Pro Max మోడల్‌లలో అచ్చే అవకాశాలున్నాయి. ట్రెండ్‌ఫోర్స్ అనే పరిశోధనా సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సంవత్సరం ప్రారంభించిన A16 బయోనిక్ చిప్‌సెట్‌తో నాన్-ప్రో మోడల్‌లను విడుదల చేయనున్నట్లు చెబుతున్నారు.

iPhone 14 Pro, iPhone 14 Pro Max అప్‌గ్రేడ్ వెర్షన్‌లు అంటే iPhone 15 Pro, iPhone 15 Pro Maxలను 8 GB RAMతో తీసుకురావచ్చు. ప్రస్తుత ప్రో మోడల్‌లు 6 జీబీ ర్యామ్‌తో వస్తున్నాయని చెబుతోంది. ఇంకో విషయం ఏంటంటే ఆపిల్ తన ఐఫోన్ మోడల్‌లలో కనిపించే ర్యామ్ వివరాలను ఎప్పుడూ వెల్లడించదు.

ఆపిల్ తన కొత్త ఐఫోన్ 15 సిరీస్‌ను వచ్చే ఏడాది లైట్నింగ్ పోర్ట్ మినహా USB టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌తో ప్రారంభించవచ్చని పరిశోధనా సంస్థ అంచనా వేసింది. వచ్చే ఏడాది రానున్న ఐఫోన్ 15 మోడల్‌లు వెనుక భాగంలోని ప్రైమరీ కెమెరాలో 8P లెన్స్‌తో వస్తాయని పరిశోధనా సంస్థ పేర్కొంది. అయితే ప్రస్తుతానికి సెన్సార్ ఎన్ని మెగాపిక్సెల్‌లుగా ఉంటుందో సమాచారం ఇవ్వలేదు.

ఇవి కూడా చదవండి

ఐఫోన్ 15 ప్రో మాక్స్ టెలిఫోటో కెమెరా గురించి అందిన సమాచారం ప్రకారం.. ఈ లెన్స్ 10x ఆప్టికల్ జూమ్‌ను సపోర్ట్ చేస్తుందని సమాచారం. ట్రెండ్‌ఫోర్స్ ప్రకారం.. Qualcomm 5G మోడెమ్‌ను iPhone 15 ప్రో సిరీస్‌లో చూడవచ్చు. కొంతకాలం క్రితం వెలువడిన నివేదికలో రాబోయే ఐఫోన్ మోడల్‌లను రాబోయే రెండేళ్లలో ఆపిల్ 5G మోడెమ్‌తో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమాచారం లీక్‌ల ఆధారంగా ఉంది. కంపెనీ వైపు నుండి ఇంకా అధికారిక వివరాలు వెల్లడించలేదు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..