iPhone 13 Price Leak: ఈ నెల 14న ఐఫోన్ 13 సిరీస్ విడుదల.. వీటి ధర ఎంతో లీక్ అయ్యింది.. ఎంతంటే?

|

Sep 09, 2021 | 3:21 PM

Apple iPhone 13 Price Leak: యాపిల్ ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్. సరికొత్త ఫీచర్లతో కూడిన ఐఫోన్ 13 సిరీస్‌ను ఈ నెల(సెప్టెంబర్) 14న విడుదల చేయనున్నారు.

iPhone 13 Price Leak: ఈ నెల 14న ఐఫోన్ 13 సిరీస్ విడుదల.. వీటి ధర ఎంతో లీక్ అయ్యింది.. ఎంతంటే?
Iphone 13
Follow us on

Apple iPhone 13 Price Leak: యాపిల్ ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్. సరికొత్త ఫీచర్లతో కూడిన ఐఫోన్ 13 సిరీస్‌ను ఈ నెల(సెప్టెంబర్) 14న విడుదల చేయనున్నారు. కాలిఫోర్నియా స్ట్రీమింగ్ ఈవెంట్‌ ద్వారా ఐఫోన్ 13తో పాటు ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్‌లను యాపిల్ సంస్థ విడుదల చేయనుంది. యాపిల్ వాచ్ సిరీస్ 7, కొత్త యాపిల్ ఎయిర్ పాడ్స్ 3 తదితరాలను ఉపకరణాలను కూడా విడుదల చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దేశీయ మార్కెట్‌లో ఐఫోన్ 13 ఫోన్లను అక్టోబర్‌లో అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశముంది. అంతర్జాతీయంగా దీన్ని విడుదల చేసిన తర్వాత ధరను యాపిల్ సంస్థ ప్రకటించవచ్చని ప్రచారం జరిగింది.

అయితే విడుదలకు కొన్ని రోజుల ముందే ఐఫోన్ 13 ధర మీడియాలో లీక్ అయ్యింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఐఫోన్ 13 ధర 799 డాలర్లు(రూ.58,600)గా ఉండే అవకాశమున్నట్లు తెలుస్తోంది. స్థానిక పన్నులను కలుపుకుని భారత్‌లో దీని ధర కాస్త ఎక్కువగా ఉండే అవకాశమున్నట్లు సమాచారం.

కాగా ఐఫోన్ 13 ప్రో ధర 999 డాలర్లు(రూ.73,300), ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ధర 1099 డాలర్లు (రూ.80,679), ఐఫోన్ 13 మినీ 699 డాలర్లు(రూ.51,314)గా ఉండొచ్చని తెలుస్తోంది. స్థానిక పన్నులు అదనంగా ఉంటాయి. ఐఫోన్ 13 సిరీస్‌లో మిగిలిన అన్నిటికంటే ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్‌లో అత్యధిక ఫీచర్స్ ఉండనున్నాయి. ఇందులో 6.7-అంగుళాల OLED 120Hz డిస్‌ప్లే ఉంటుంది. ఐఫోన్ 13లో 6.1-అంగుళాల OLED డిస్‌ప్లే ఉంటుంది.

అలాగే ఐఫోన్ 13 సిరీస్‌లోని అన్ని మోడల్స్ 5జీని సపోర్ట్ చేస్తాయి. అలాగే వీటి అన్నిటిలోనూ 25W ఛార్జింగ్ టెక్నాలజీ ఉంటుంది.

Also Read..

అమ్మాయి పేరుతో ఇన్‌స్టాగ్రాంలో వల.. ఇంటర్‌ విద్యార్థినికి నరకం.. పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

RC 15: నా కలను రామ్‌చరణ్‌ నిజం చేశాడు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మెగాస్టార్‌ చిరంజీవి.