చిన్న పిల్లలపై జరుగుతోన్న లైగింక వేధింపులను అరికట్టేందుకు యాపిల్ సంస్థ ముందడుగు వేసింది. సరికొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రెడీ అయింది. ఐవోఎస్ ఫొటో లైబ్రరీలలో చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్( పిల్లల ఫోర్నోగ్రఫీ ఫొటోలు) గుర్తించేందుకు వీలుగా న్యూరల్ మ్యాచ్ ఫొటో ఐడెంటిఫికేషన్ టూల్‌ను అభివృద్ధి చేసినట్లు పేర్కొంది. ఐఓఎస్ కొత్త అప్‌డేట్‌లో ఈ ఫీచర్‌ను విడుదల చేసేందుకు యాపిల్ సిద్ధమైనట్లు ప్రకటించింది. దీని వల్ల పిల్లలపై జరుగుతున్న లైగింక వేధింపులకు అడ్డుకట్ట పడుతుందని యాపిల్ పేర్కొంది. మెషిన్ లెర్నింగ్ సహాయంతో పనిచేయనున్న ఈ కొత్త ఫీచర్.. యాపిల్ సంస్థ డివైజ్‌లలో పిల్లల అశ్లీల ఫొటోలను గుర్తించి హెచ్చరికలు జారీ చేస్తుందని తెలుస్తోంది. అయితే దీనిపై పలు విమర్శలు కూడా వస్తున్నాయి. ఇది వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా ఉందని ఆందోళనలు వినిపిస్తున్నాయి. ఈ ఫీచర్‌తో ప్రజలపై నిఘా ఉంచడమేనని సైజర్ నిపుణులు అంటున్నారు.
కాగా, ఈ విషయంలో యాపిల్ మాత్రం ధీమాగానే కనిపిస్తోంది. ఇలాంటి వాదనల్లో ఏమాత్రం నిజం లేదని వెల్లడిస్తోంది. వ్యక్తిగత డేటాకు ఎలాంటి ఢోకా లేదని, యూజర్ల ఫోన్లు, ఐక్లౌడ్ నుంచి గాని ఎలాంటి ఫొటోలు సేకరించదని, కేవలం సీఎస్‌ఏఎంను మాత్రమే గుర్తిస్తుందని పేర్కొంటోంది. అయితే దీనిపై ప్రముఖ సైబర్ నిపుణుడు మాథ్యూ గ్రీన్ మాట్లాడుతూ.. ‘యాపిల్ కొత్త ఫీచర్‌ను హ్యాకర్స్ తప్పదోవ పట్టించే అవకాశం కూడా ఉంది. సీఎస్‌ఏఎంను పోలిన ఫొటోలను ఇతరుల డివైజ్‌లలోకి పంపిస్తే.. అందువల్ల ఇతరులు చట్టపరమైన చిక్కులు ఎదుర్కొవాల్సి వచ్చే అవకాశం ఉంది. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే అవకాశం ఉందని’ అభిప్రాయపడ్డాడు.
మరోవైపు ఈ కొత్త ఫీచర్‌ను తొలుత అమెరికాలో ప్రవేశపెట్టనున్నట్లు యాపిల్ సంస్థ ప్రకటించింది. అనంతరం మిగతా దేశాల్లో అమలుచేయనున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్లలో ఈ సరికొత్త ఫీచర్‌ను పరీక్షించి, అనంతరం ఇతర డివైజ్‌లకు కూడా యాడ్ చేయనున్నారంట.
Also Read: Telegram Group Calling: ఇప్పుడు టెలిగ్రామ్ యాప్ ద్వారా ఒకేసారి వెయ్యిమందితో మాట్లాడొచ్చు!
Car Care in Rain: వర్షంలో కారు అద్దంపై నీరు నిలిచిపోతోందా? ఇలా చేసి చూడండి..