ప్రముఖ వాచ్ మేకర్ సంస్థ అయిన మేక్సిమా యువత కోసం మరో అధునాతన స్మార్ట్ వాచ్‌ను మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. భారతదేశంలో స్మార్ట్ యాక్ససరీస్ బిజినెస్ రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో అన్ని కంపెనీలు కొత్త కొత్త మోడల్స్ స్మార్ట్ వాచ్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా యువతను ఆకట్టుకునేలా మాక్సిమా కొత్త స్మార్ట్ వాచ్‌ను రిలీజ్ చేసింది. మాక్సిమా ప్రో నైట్ ప్లస్ పేరుతో రిలీజ్ చేసిన ఈ స్మార్ట్ వాచ్ సూపర్ డిజైన్‌తో అధునాతన ఫీచర్స్‌తో వస్తుంది. మాక్సిమా వాచ్‌లు అంటే వాటి బిల్డ్ క్వాలిటీ ఫ్యాన్స్ ఉంటారు. ఎందుకంటే ఆ కంపెనీ కేవలం తక్కువ ధరకే ప్రీమియం వాచ్‌లను అందుబాటులోకి తీసుకువస్తుంది. అందుకే ఈ బ్రాండ్‌కు జనాధరణ విపరీతంగా పెరుగుతుంది. తాజాగా రిలీజ్ చేసిన మ్యాక్స్ ప్రో నైట్ ప్లస్ స్మార్ట్ వాచ్ కూడా కేవలం రూ.1999కే అందుబాటులో ఉంచింది. దీంతో ఈ వాచ్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇతర వాచ్‌లకు గట్టిపోటినివ్వనుంది. మ్యాక్స్ ప్రో నైట్ ప్లస్ స్మార్ట్ వాచ్‌లో ఇచ్చే ఇతర ఫీచర్లు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..