పెరిగిన స్మార్ట్ యాక్ససరీస్ వినియోగంతో ఇటీవల చాలా కంపెనీలు కొత్త కొత్త యాక్ససరీస్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా అత్యంత ప్రజాదరణ పొందిన స్మార్ట్‌వాచ్‌లైతే వారానికి రెండు నుంచి మూడు కొత్త వాచ్‌లు లాంచ్ అవుతున్నాయి. గతంలో కేవలం టైమ్ చూసుకోవడానికి మాత్రమే ఉపయోగించే వాచ్‌లు ప్రస్తుతం సూపర స్మార్ట్‌గా తయారుకావడంతో వయస్సు భేదం లేకుండా అందరూ స్మార్ట్ వాచ్‌లను వినియోగిస్తున్నారు. అనూహ్యంగా పెరిగిన డిమాండ్‌తో అన్ని కంపెనీలు కొత్త కొత్త స్మార్ట్ వాచ్‌లను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా తక్కువ ధరలోనే వీటిని అందుబాటులో ఉంచుతున్నాయి. కాబట్టి భారతదేశంలో ఎక్కువమంది మధ్యతరగతి వీటిని వినియోగానికి ముందుకు వస్తున్నారు. దీంతో కంపెనీలు అత్యాధునిక ఫీచర్లతో స్మార్ట్ వాచ్లను రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా అర్బన్ ఫ్యూజన్ కొత్త స్మార్ట్ వాచ్‌ను రిలీజ్ చేసింది. స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లోనే తొలిసారిగా క్వాడ్ సెన్సార్‌లతో వచ్చే ఈ స్మార్ట్ వాచ్ ధర రూ.3999గా కంపెనీ నిర్ణయించింది. ఈ అర్బన్ వాచ్ అన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లతో పాటు రిటైల్ అవుట్‌లెట్‌లతో అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్‌వాచ్ ఫీచర్ల గురించి ఓ సారి తెలుసుకుందాం.
ఈ స్మార్ట్ వాచ్ ఫ్లేమ్ ఆరెంజ్, కార్పొరేట్ బ్లాక్ అనే రెండు రంగుల ఎంపికల్లో లభిస్తుంది. అలాగే ఈ స్మార్ట్‌వాచ్ 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 1.46 అంగుళాల ఎమోఎల్‌ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. అలాగే ఈ డిస్ప్లే 1000 నిట్‌ల గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉందని బ్రాండ్ పేర్కొంది. ఈ స్మార్ట్‌వాచ్‌లో పగిలిపోయే అల్లాయ్ బాడీ, రౌండ్ డయల్, సిలికాన్ స్ట్రాప్ ఉన్నాయి. అర్బన్ నుంచి వచ్చిన కొత్త స్మార్ట్‌వాచ్‌లో ఆరోగ్య పర్యవేక్షణ కోసం క్వాడ్ సెన్సార్‌లు అమర్చారు. ఇవి హృదయ స్పందన రేటు, రక్తపోటు, ఎస్‌పీఓ2 నిద్ర విధానాల కోసం కచ్చితమైన రీడింగ్‌లను అందజేస్తాయని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు.
ఈ స్మార్ట్‌వాచ్ బ్లూటూత్ కాలింగ్‌కు మద్దతు ఇస్తుంది . ఇది అడ్రస్ బుక్, డయల్ ప్యాడ్ వంటి సంబంధిత ఫీచర్‌లతో పాటు నాయిస్ ఐసోలేటింగ్ మైక్రోఫోన్‌ను కూడా కలిగి ఉంది. అర్బన్ ఫ్యూజన్ 100కి పైగా అనుకూలీకరించదగిన వాచ్ ఫేస్‌లను కూడా అందిస్తుంది. ఫిట్‌నెస్ ఔత్సాహికుల కోసం ఇది కేలరీలు బర్న్ చేసిన, స్టెప్ పెడోమీటర్ వంటి 100కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉంది. అదనంగా ఈ స్మార్ట్ వాచ్ కాలిక్యులేటర్లు, అలారం, నోటిఫికేషన్‌లు వంటి సాధనాలను కూడా అందిస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..