Ice Age: మానవ మనుగడకు సంబంధించి వెలుగులోకి సంచలన నిజాలు.. వెల్లడించిన సైంటిస్టులు

|

Sep 24, 2021 | 2:07 PM

Ice Age: భూమిపై మనిషి మనుగడ ఎప్పటి నుంచి ఉందంటే దాదాపు 15 వేల సంవత్సరాల క్రితమే అని చెబుతుంటారు. కానీ, ఈ శాస్త్రవేత్తలు కూడా నిర్ధిష్ట కాలాన్ని కనిపెట్టలేకపోయారు.

Ice Age: మానవ మనుగడకు సంబంధించి వెలుగులోకి సంచలన నిజాలు.. వెల్లడించిన సైంటిస్టులు
Foot Print
Follow us on

Ice Age: భూమిపై మనిషి మనుగడ ఎప్పటి నుంచి ఉందంటే దాదాపు 15 వేల సంవత్సరాల క్రితమే అని చెబుతుంటారు. కానీ, ఈ శాస్త్రవేత్తలు కూడా నిర్ధిష్ట కాలాన్ని కనిపెట్టలేకపోయారు. ముంచు యుగం తరువాత మానవ ఉధ్భవం జరిగిందని భావిస్తూ వస్తున్నారు. అయితే, తాజా అధ్యయనాల్లో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. మంచు యుగంకంటే ముందే మనుషులు భూమిపై మనుగడ సాధించినట్లు గుర్తించారు. అందుకు సంబంధించిన మానవ పాత ముద్రలను కూడా గుర్తించారు. ఇప్పటి వరకు నానుడిలో ఉన్న సమయం కంటే 7 వేల సంవత్సరాల ముందు కూడా మనిషి మనుగడ భూమిపై ఉందన్నమాట.

ఇప్పటి వరకు మనం అనుకుంటున్న దానికంటే కనీసం 7వేల సంవత్సరాలకు ముందే అమెరికాలో మనిషి మనుగడ ఉందని కొత్త అధ్యయనం వెల్లడించింది. తాజాగా న్యూ మెక్సికోలోని వైట్ సాండ్స్‌లో 23,000, 21,000 సంవత్సరాలకు చెందిన మానవ పాదముద్రలను శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని పరిశీలించిన శాస్త్రవేత్తలు.. వంద సంవత్సరాల తరువాత కనిపెట్టిన అతిపెద్ద ఆవిష్కరణ ఇదేనని భావిస్తున్నారు. తాజా పరిశోధన.. అమెరికాలో మానవుల మనుగడకు సంబంధించి ఏళ్లుగా ఉన్న నమ్మకాన్ని మార్చేసిందని అటానమస్ యూనివర్సిటీ ఆఫ్ జకాటెకాస్‌లో పురావస్తు శాస్త్రవేత్త సిప్రియన్ ఆర్డెలియన్ అన్నారు. ఈ ఆవిష్కరణ అద్భుతం అని పేర్కొన్నారు.

అనేక దశాబ్దాలుగా.. మంచు యుగం ముగిసే సమయానికి మానవులు ఉత్తర, దక్షిణ అమెరికాను స్వాధీనం చేసుకున్నారని విశ్వసిస్తూ వచ్చారు. కారణం.. వారు ఉపయోగించిన ఈటె, సూదురు, ఇతర సామాగ్రి భయటపడటం. కానీ, తాజాగా బయటపడిన పాద ముద్రలతో మంచు యుగం కంటే ముందే మానవ ఆనవాళ్లు అమెరికాలో ఉన్నట్లు తేలిందన్నారు శాస్త్రవేత్తలు.

అమెరికాలో భారీ హిమానీనదాలు విస్తరించి ఉన్న ఈ ప్రాంతానికి మానువులు వచ్చారని, వారు సరస్సును దాటుతున్న సమయంలో పాదముద్రలు ఏర్పడ్డాయని శాస్తవ్రేత్తలు భావిస్తున్నారు. ఆ తరువాత ఏర్పడిన వాతావరణ పరిస్థితుల కారణంగా.. భూమి గట్టిపడి పాదముద్రలు అలాగే మిగిలిపోయాయని, తాజాగా వర్షాల కారణంగా ఆ పాదముద్రలు బయటపడినట్లు పేర్కొన్నారు.

Also read:

Viral Video: ఆ గేదె టాలెంట్‌కు సలాం కొట్టాల్సిందే .. ఈ వీడియో చూస్తే నోరెళ్లబడతారు..!

Covid 19 Effect: మీరు కోవిడ్ బారిన పడి కోలుకున్నారా?.. పురుషులకు పిడుగులాంటి వార్త..!

Chanakya Niti: వీటిని పాటిస్తే ఎలాంటి వారినైనా ఈజీగా కంట్రోల్ చేయొచ్చు.. నీతిశాస్త్రంలోని ఆసక్తికర విషయాలు మీకోసం..