అమెజాన్ బంపర్ ఆఫర్.. సగం రేటుకే ‘ప్రైమ్’

| Edited By: Srinu

Jul 13, 2019 | 4:33 PM

కస్టమర్లను ఆకట్టుకునే విధంగా రకరకాల ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తూ వస్తోన్న ఈ- కామర్స్ దిగ్గజం అమెజాన్ తాజాగా భారత్‌లో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.999 ఖరీదైన అమెజాన్‌ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ను సగం రేటుకే అంటే రూ.499కే ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది. అయితే కేవలం 18 నుంచి 24ఏళ్ల వయసు గల వారు మాత్రమే దీనికి అర్హులు. ఈ నెల 15-16రోజుల్లో జరుగుతోన్న ప్రైమ్‌ డే సేల్‌లో భాగంగా ఈ ఈఫర్‌ను ఇస్తున్నట్లు అమెజాన్ ప్రైమ్ ఇండియా డైరక్టర్, హెడ్ […]

అమెజాన్ బంపర్ ఆఫర్.. సగం రేటుకే ‘ప్రైమ్’
Follow us on

కస్టమర్లను ఆకట్టుకునే విధంగా రకరకాల ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తూ వస్తోన్న ఈ- కామర్స్ దిగ్గజం అమెజాన్ తాజాగా భారత్‌లో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.999 ఖరీదైన అమెజాన్‌ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ను సగం రేటుకే అంటే రూ.499కే ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది. అయితే కేవలం 18 నుంచి 24ఏళ్ల వయసు గల వారు మాత్రమే దీనికి అర్హులు. ఈ నెల 15-16రోజుల్లో జరుగుతోన్న ప్రైమ్‌ డే సేల్‌లో భాగంగా ఈ ఈఫర్‌ను ఇస్తున్నట్లు అమెజాన్ ప్రైమ్ ఇండియా డైరక్టర్, హెడ్ అక్షయ్ సాహి ఒక ప్రకటనలో తెలిపారు. దీని వలన యువవ ఉత్తమమైన షాపింగ్ అనుభూతిని, వినోదాన్ని పొందవచ్చని ఆయన వెల్లడించారు.

అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాలని అనుకునే యువత.. ప్రైమ్ యాప్‌లో యూత్ ఆఫర్‌ బ్యానర్‌పై క్లిక్ చేసి రూ.999 చెల్లించాలి. చిరునామా వివరాలు, పాన్‌కార్డు, ఫొటో అప్‌లోడ్ చేసి వారి వయస్సును ధృవీకరించడం ద్వారా ఈ ఆఫర్‌ పొందవచ్చు. ఆ తరువాత వివరాలను ధ్రువీకరించిన అనంతరం పది రోజుల్లోగా రూ.500 అమెజాన్ పే వ్యాలెట్‌లో జమ అవుతుంది. కాగా ఈ ఆఫర్ సంస్థ అధికారిక ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ యాప్‌ల ద్వారా మాత్రమే లభిస్తుందని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.