Amazon Sale: ల్యాప్ టాప్‌లపై టాప్ లేపే డీల్స్.. ఏకంగా 44శాతం వరకూ తగ్గింపు.. మిస్ అవ్వొద్దు..

|

May 20, 2023 | 7:27 PM

అమెజాన్ లో స్మార్ట్‌వాచ్‌లు, ఫోన్‌లు, సౌండ్‌బార్‌లపై పలు డిస్కౌంట్లు ఉన్నాయి. అయితే ఈ కథనంలో ల్యాప్ టాప్ లపై ఉన్న ఆఫర్లను మీకు అందిస్తున్నాం. హెచ్ పీ, లెనోవా వంటి ప్రముఖ బ్రాండ్‌ల నుండి అత్యుత్తమ ల్యాప్‌టాప్‌లు, గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై 44% వరకు తగ్గింపు లభిస్తోంది.

Amazon Sale: ల్యాప్ టాప్‌లపై టాప్ లేపే డీల్స్.. ఏకంగా 44శాతం వరకూ తగ్గింపు.. మిస్ అవ్వొద్దు..
Asus Tuf Gaming A15
Follow us on

ల్యాప్ టాప్ కొనాలనుకొంటున్నారా? తక్కువ బడ్జెట్లో బెస్ట్ ల్యాప్ టాప్ కావాలనుకొంటున్నారా? గేమింగ్ ల్యాప్ అయితే బాగుండు అనుకొంటున్నారా? మంచి ఫీచర్లతో పాటు అధిక పనితీరు కలిగిన ల్యాప్ టాప్ కోసం వెతుకుతున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే.. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ అమెజాన్ మరోసారి అదిరే ఆఫర్లను తీసుకొచ్చింది. అమెజాన్ బ్లాక్‌బస్టర్ వాల్యూ డేస్ సేల్ లో భాగంగా ల్యాప్ టాప్ లపై అద్భుతమైన తగ్గింపును అందిస్తోంది. ఈ సేల్ మే 19న ప్రారంభమైంది. మే 24 వరకు ఈ ఆఫర్ పనిచేస్తుంది. ఒక్క ల్యాప్ టాప్ లపైనే కాక స్మార్ట్‌వాచ్‌లు, ఫోన్‌లు, సౌండ్‌బార్‌లపై పలు డిస్కౌంట్లు ఉన్నాయి. అయితే ఈ కథనంలో ల్యాప్ టాప్ లపై ఉన్న ఆఫర్లను మీకు అందిస్తున్నాం. హెచ్ పీ, లెనోవా వంటి ప్రముఖ బ్రాండ్‌ల నుండి అత్యుత్తమ ల్యాప్‌టాప్‌లు, గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై 44% వరకు తగ్గింపు లభిస్తోంది. ఈ నేపథ్యంలో ల్యాప్ టాప్లపై అందుబాటులో ఉన్న బెస్ట్ డీల్స్ ను మీకు అందిస్తున్నాం. ఓ లుక్కేయండి..

అసుస్ టఫ్ ఏ15, 15.6-అంగుళాల ఏఎండీ రైజెన్ 5 4GB గేమింగ్ ల్యాప్‌టాప్.. అందుబాటులో ఉన్న బెస్ట్ గేమింగ్ ల్యాప్ టాప్లలో ఇదీ ఒకటి. అమెజాన్ స్పెషల్ సేల్ లో ఈ ల్యాప్ టాప్ పై 31% తగ్గింపు లభిస్తోంది. ఇది 8జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ స్పేస్ తో వస్తోంది. దీని ధర రూ. 49,990గా ఉంది.

హెచ్ పీ విక్టస్ గేమింగ్ ల్యాప్ టాప్ ఏఎండీ రైజన్ 5 5600హెచ్ 15.6 అంగుళాల హెచ్ డీ ఐపీఎస్.. దేశంలోని అత్యుత్తమ ల్యాప్ టాప్ లలో ఒకటైన హెచ్పీ ల్యాప్ టాప్ లపై కూడా అమెజాన్ 27% తగ్గింపు అందిస్తోంది. ఇది శక్తివంతమైన ఏఎండీ రైజెన్ ప్రాసెసర్ 5 5600 హెచ్ ఆధారంగా పనిచేస్తోంది.. ఇది టర్బో బూస్ట్ టెక్నాలజీతో వస్తుంది. ఇది మీకు అద్భుతమైన గేమింగ్ అనుభవాన్ని అందిస్తోంది. యాంటీ గ్లేర్ టెక్నాలజీతో వస్తోంది. ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే ఉంటుంది. దీని ధర రూ.56,490గా ఉంది.

ఇవి కూడా చదవండి

అసుస్ వివో బుక్ 16-అంగుళాల, ఏఎండీ రైజెన్ 5 5600 హెచ్, లైట్ ల్యాప్‌టాప్.. అమెజాన్ బ్లాక్‌బస్టర్ వాల్యూ డేస్ సేల్ 2023లో ఈ అసుస్ వివో బుక్ పై 28% తగ్గింపు లభిస్తోంది. ఇది 8జీబీ ర్యామ్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో పాటు యాంటీ గ్లేర్ డిస్‌ప్లేతో వస్తోంది. ఇంటిగ్రేటెడ్ ఏఎండీ రాడియన్ వేగా 7 గ్రాఫిక్‌లతో వస్తుంది. ఇది గరిష్టంగా 8 గంటల బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ ధర రూ. 49,990గా ఉంది.

లెనోవో ఐడియా ప్యాడ్ స్లిమ్ 3 ఇంటెల్ కోర్ ఐ3-1115జీ4 11వ జెన్ 15.6 అంగుళాల ఫుల్ హెచ్డీ ల్యాప్‌టాప్.. ఈ లెనోవా ల్యాప్‌టాప్‌పై అమెజాన్ లో 44% వరకు తగ్గింపు లభిస్తోంది. ఇది 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యంతో ఇది వస్తుంది. మెరుగైన గేమింగ్ పనితీరు కోసం ఇంటిగ్రేటెడ్ ఇంటెల్ హెచ్‌డి గ్రాఫిక్స్‌తో పాటు 6 గంటల బ్యాటరీ లైఫ్‌ ఇస్తుంది. 15.6 అంగుళాల ఫుల్ హెచ్ డీ యాంటీ-గ్లేర్ డిస్‌ప్లేతో వస్తోంది. ఈ ల్యాప్‌టాప్ ధర రూ. 33,990 గా ఉంది.

డెల్ ఇన్ స్పిరాన్ 3511 ల్యాప్ టాప్.. డెల్ భారతదేశంలోని ప్రముఖ ల్యాప్‌టాప్ బ్రాండ్‌లలో ఒకటి. అమెజాన్ బ్లాక్‌బస్టర్ వాల్యూ డేస్ సేల్ సందర్భంగా ఈ డెల్ ల్యాప్‌టాప్‌పై 30% తగ్గింపు లభిస్తుంది. ఈ డెల్ ల్యాప్‌టాప్ ధర రూ. 50,990గా ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..