Apple: iPhone కొనడం మీ కలా.. అయితే ఈ న్యూస్ మీ కోసమే.. అమెజాన్ లో అదిరిపోయే ఆఫర్స్.. ఎప్పుడంటే
ఇప్పుడు IPhone ట్రెండ్ నడుస్తోంది. ఐఫోన్ వాడడం ఒక డ్రీమ్ గా కూడా పెట్టుకుంటారు చాలామంది. డబ్బున్న రిచ్ పీపుల్ అయితే వెంటనే తమ కలను నెరవేర్చుకుంటారు. కాని పేద, మధ్య తరగతి ప్రజలు మాత్రం తమ డ్రీమ్ ను నెరవేర్చుకోవడానికి..

Apple iPhone: ఇప్పుడు IPhone ట్రెండ్ నడుస్తోంది. ఐఫోన్ వాడడం ఒక డ్రీమ్ గా కూడా పెట్టుకుంటారు చాలామంది. డబ్బున్న రిచ్ పీపుల్ అయితే వెంటనే తమ కలను నెరవేర్చుకుంటారు. కాని పేద, మధ్య తరగతి ప్రజలు మాత్రం తమ డ్రీమ్ ను నెరవేర్చుకోవడానికి ఎక్కువ సమయమే పడుతోంది. ప్రస్తుతం EMI ల కాలం కావడంతో మరికొంత మంది కొంత ధైర్యం చేసి ఇన్ స్టాల్ మెంట్స్ లో ఫోన్స్ కొంటూ తమ డ్రీమ్ ను నెరవేర్చుకుంటున్నారు. కాని ఇంకొంతమంది మాత్రం ధరలు తగ్గితే కొందాం, మంచి ఆఫర్స్ ఏవైనా పెడితే ఆపిల్ ఐ ఫోన్ కొందామని చూస్తారు. పండగలప్పుడు కొన్ని ఈ కామర్స్ వెబ్ సైట్ లు కస్టమర్లను ఆకర్షించేందుకు ఎన్నో ఆఫర్స్ పెడుతుంటాయి. ఇప్పుడు దసరా దగ్గరపడుతుండటంతో ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్ అమెజాన్ ఐఫోన్ లపై అదిరిపోయే ఆఫర్స్ అందిస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో Iphone 12ను రూ.40,000 కంటే తక్కువకు పొందే ఛాన్స్ వచ్చింది. ఇటీవల ఆపిల్ సంస్థ IPhone14 సిరీస్‌ను విడుదల చేసింది. కొత్త ఐఫోన్ విడుదల తర్వాత, ఆపిల్ తన పాత ఐఫోన్స్ ధరలను తగ్గించింది. అలాగే ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ఐఫోన్‌పై భారీ తగ్గింపులను ప్రకటించింది. ఐఫోన్ కల సాకారం చేసుకోవాలనుకునే వారికి మంచి అవకాశం కల్పించింది.
భారత్ లో ఐపీల్ అధికారిక సైట్‌లో Iphone 12ను రూ.59,990 ప్రారంభ ధరకు విక్రయిస్తుంది. అయితే Iphone 12ను రాబోయే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భారీ తగ్గింపులతో కొనుగోలు చేయవచ్చు. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సందర్భంగా అమెజాన్ తన మైక్రో-సైట్‌లో విడుదల చేసిన టీజర్‌లో ఐఫోన్ 12 మోడల్ ధర రూ. 40,000 లోపు కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. టీజర్‌లో వేరియంట్ నిర్ధారించబడనప్పటికీ, ఇది 64gb స్టోరేజ్‌తో కూడిన బేస్ వేరియంట్ ధర అయి ఉండవచ్చని తెలుస్తుంది. ఇది ఇప్పటివరకు ప్రకటించిన అన్ని ఐఫోన్ కంటే అతి తక్కువ ధర కానుంది.
Apple Iphone 12 ఫీచర్లు: Apple Iphone 12 ఫోన్ 1200nits గరిష్ట బ్రైట్నెస్ 6.1-అంగుళాల Oled డిస్‌ప్లే ప్యానెల్‌ను కలిగి ఉంది. ఇది Hdr, డాల్బీ విజన్‌కు సపోర్ట్ ఇచ్చే సూపర్ రెటినా Xdr డిస్‌ప్లే, సిరామిక్ షీల్డ్ ప్రోటెక్షన్‌ను అందిస్తుంది. ఈ ఫోన్‌లో A14 బయోనిక్ చిప్‌ని అమర్చారు. ఇది 64gb, 128gb, 256gb స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తుంది. ఐఫోన్ 12 లో రెండు 12mp బ్యాక్ కెమెరాలను ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఫోటోగ్రఫీ కోసం ట్రూ టోన్ ఫ్లాష్‌తో ప్యాక్ చేశారు. ఇందులో సెల్ఫీల కోసం 12mp లెన్స్ కూడా ఉంది. Iphone 12 Face Id కూడా ఉంది. ఇది ఫేస్ రెకగ్నిషన్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇది స్టీరియో స్పీకర్ సెటప్‌ను ప్యాక్ చేస్తుంది. Ip68 రేట్‌తో ఉంది. ఐఫోన్ 12 లైట్నింగ్ పోర్ట్‌ను ప్యాక్ చేస్తుంది.




మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం చూడండి..



