Dash Board Camera: కారు దొంగతనాలను అరికట్టేందుకు అమెజాన్ కొత్త డివైజ్.. దీంతో మీ వాహనం ఇక సేఫ్..

కార్ ల దొంగతనాలను అరికట్టేందుకు అమెజాన్ ఓ కొత్త డివైస్ ను అందుబాటులోకి తెచ్చింది. అమెజాన్ కు చెందిన రింగ్ విభాగం రెండేళ్ల విరామం తర్వాత మొదటి కార్ డ్యాష్ బోర్డు కెమెరాను ప్రవేశపెట్టింది.

Dash Board Camera: కారు దొంగతనాలను అరికట్టేందుకు అమెజాన్ కొత్త డివైజ్.. దీంతో మీ వాహనం ఇక సేఫ్..
Car Video Recorder
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Narender Vaitla

Updated on: Jan 07, 2023 | 4:50 PM

ఎంతో కష్టపడి రూపాయి, రూపాయి కూడబెట్టుకుని ఫ్యామిలీతో ఆనందంగా బయటకు వెళ్లడానికి కార్ కొనుగోలు చేస్తుంటారు. అయితే కారును బయట ఎక్కడైనా పార్క్ చేసినా దాని భద్రతపై అనుమానం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. అలాగే కార్ ఎవరికైనా ఇచ్చినా వారు దాన్ని ఎలా  వాడుతారో? అని భయపడుతుంటాం. సరిగ్గా ఇలాంటి భయాలకు చెక్ పెట్టెలా ఓ డివైస్ మార్కెట్ లో వచ్చింది. కార్ ల దొంగతనాలను అరికట్టేందుకు అమెజాన్ ఓ కొత్త డివైస్ ను అందుబాటులోకి తెచ్చింది. అమెజాన్ కు చెందిన రింగ్ విభాగం రెండేళ్ల విరామం తర్వాత మొదటి కార్ డ్యాష్ బోర్డు కెమెరాను ప్రవేశపెట్టింది. అమెజాన్ రింగ్ సంస్థను 2018 లో కొనుగోలు చేసింది. అప్పటి నుంచి గృహ సెక్యూరిటీ కెమెరాలను కొన్నేళ్లుగా విక్రయిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ వ్యాపారాన్ని విస్తరిస్తూ కార్ డ్యాష్ బోర్డు కెమెరాతో వస్తున్నామని ఇటీవల కంపెనీ సీఈసీ సమావేశంలో వెల్లడింది. 

కారు లో పెట్టుకునే డ్యాష్ క్యామ్ వాహనంలోని చలనం, బయటి ఆటంకాలు, కారు మన ప్రమేయం లేకుండా మూవ్ అయ్యినా, అలాగే ఎవరైనా దొంగిలించడానికి ప్రయత్నించినా, లేదా పార్క్ చేసినప్పడు ఎవరైనా ఢీకొట్టినా వెంటనే మనకు అలర్ట్ వచ్చేస్తుంది. 2020లో ప్రకటించిన వెర్షన్ కు అప్ డేట్ గా ఈ డ్యాష్ కెమెరా నిలవనుంది. మానిటర్ రింగ్ యాప్ తో పని చేస్తుంది. వినియోగదారులు కారు లైవ్ ఫీడ్ వీక్షించడానికి అలాగే టూ వే ఆడియోతో కమ్యునికేట్ చేయడానికి వీలు కల్పిస్తుంది. అలాగే ట్రిగ్గర్ చేసిన సెన్సార్ ల ద్వారా తగ్గిన హెచ్చరికలను వినియోగదారులకు చేరవేస్తుంది. అలాగే అవసరమైనప్పుడు ఆడియో, వీడియో రికార్డింగ్ ను నిలిపివేసే సౌకర్యం కల్పించినట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు. 

అయితే అమెజాన్ ఈ ప్రొడక్ట్ ను కార్స్ లో అందించడానికి చాలా కృషి చేసిందని మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అన్ని కార్లు ఇంటర్నెట్ ఫెసిలిటీతో వస్తున్న నేపథ్యంలో ఈ ప్రొడక్ట్ కు మార్కెట్ లో మంచి ఆదరణ లభిస్తుందని అంచనా వేస్తున్నారు. అలాగే అలెక్సా వాయిస్ ఫెసిలిటీ తో డ్రైవింగ్ సమయంలో సూచనలు, సలహాలు కూడా వచ్చేలా ఈ ప్రొడక్ట్ ఉండనుందని అంచనా వేస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి.