
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ ను అధికార ప్రసారకర్తగా ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు రెడీ అవుతోంది. ఓటీటీ ఫ్లాట్ ఫాంలో అందుబాటులో ఉన్న ఓటీటీ కంటెంట్ తోపాటు యూజర్లు ఐపీఎల్ మ్యాచులను వీక్షించేందుకు నెలవారీ నుంచి వార్షిక చెల్లుబాటు వరకు పలు ప్లాన్స్ జాబితాను అందిస్తోంది. కానీ కొంతమంది యూజర్లు ఈ ప్లాన్స్ ఫ్రీగా పొందవచ్చు. మీరు ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కస్టమర్ అయితే మీరు డిస్నీ ప్లస్, హాస్ట్ స్టార్ ను ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ ద్వారా పొందవచ్చు.
ఎయిర్ టెల్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కి ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌తో సహా కొన్ని ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌లతో ఓటీటీ ప్రయోజనాలను అందిస్తోంది. ఎంచుకున్న ప్లాన్‌లలో ఎయిర్ టెల్ 5జీ ప్రారంభించిన నగరాల్లో నివసిస్తున్న యూజర్ల కోసం 5G వేగంతో అపరిమిత కాలింగ్, ఎస్ఎంఎస్ డేటా ప్రయోజనాలు కూడా అందిస్తోంది.
రూ. 399 ప్లాన్:
ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటు అవుతుంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్‌కు 3 నెలల ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ ఉంటుంది. అన్ని లోకల్, STD, రోమింగ్ నెట్‌వర్క్‌లలో అపరిమిత కాలింగ్ చేసుకోవచ్చు. రోజుకు 100ఎస్ఎంఎస్ లు ఉచితం. వీటితోపాటు 2.5GB రోజువారీ డేటాను అందిస్తుంది. అదనపు ప్రయోజనాలు Xstream యాప్, Apollo 24|7 సర్కిల్ సబ్‌స్క్రిప్షన్, మరిన్నింటికి యాక్సెస్‌ను కలిగి ఉంటాయి.
రూ. 499 ప్లాన్:
ఈ ప్లాన్ కింద ఎయిర్ టెల్ 28 రోజుల చెల్లుబాటు ఉంటుంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్‌కు 3 నెలల ఫ్రీ సబ్‌స్క్రిప్షన్, 3జీబీ రోజువారీ డేటా, రోజుకు 100ఎస్ఎంఎస్, అన్లిమిటెడ్ కాల్స్‌ను అందిస్తుంది. అదనపు ప్రయోజనాలలో Xstream యాప్‌కు ఫ్రీ సబ్‌స్క్రిప్షన్, అపోలో 24|7 సర్కిల్ సబ్‌స్క్రిప్షన్, ఫ్రీ హలో ట్యూన్‌లు ఉన్నాయి.
రూ. 719 ప్లాన్:
ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌తో ఎయిర్‌టెల్ కస్టమర్లు 84 రోజుల పాటు ఈ ప్లాన్ వాడుకోవచ్చు. ఎయిర్ టెల్, డిస్నీ ప్లస్, హాట్ స్టార్ మొబైల్ కు మూడు నెలల పాటు ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ ఉంటుంది. Xtream యాప్ యాక్సెస్, 1.5GB రోజువారీ డేటా, అన్లిమిటెడ్ కాల్స్‌తోపాటు 100 ఫ్రీ ఎస్ఎంఎస్లు పొందుతారు.
రూ. 779 ప్లాన్:
ఈ ప్లాన్ 90 రోజుల చెల్లుబాటు అవుతుది. 1.5GB రోజువారీ ఇంటర్నెట్ డేటా. అన్లిమిటెడ్ కాల్స్‌తోపాటు రోజుకు 100ఎస్ఎంఎస్, ఎయిర్‌టెల్ యాప్, వెబ్‌లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్‌కు 3 నెలల ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ అందస్తుంది.
రూ. 839 ప్లాన్:
84 రోజుల ప్లాన్ వాలిడిటీతో, అపరిమిత కాలింగ్, రోజుకు 100ఎంఎస్ఎస్ లు, 2జీబీ డేటాను అందిస్తుంది. ఇది మొబైల్‌కు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ 3 నెలల సబ్‌స్క్రిప్షన్, ఎక్స్‌ట్రీమ్ యాప్‌కి యాక్సెస్ ఉంటుంది.
రూ. 999 ప్లాన్:
ఈ త్రైమాసిక ప్లాన్ 84 రోజుల చెల్లుబాటులో ఉంటుంది. 2.5జీబీ రోజువారీ డేటా రోల్‌ఓవర్, కాలింగ్ ఎస్ఎంఎస్ తోపాటు మొబైల్‌కు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ 3 నెలల సబ్‌స్క్రిప్షన్ ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌కు 84 రోజుల సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది.
రూ. 3359 ప్లాన్:
ఈ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ వార్షిక ప్లాన్ కింద, టెలికాం ఆపరేటర్ 356 రోజుల చెల్లుబాటు అవుతుంది, 2.5జీబీ రోజువారీ డేటా రోల్‌ఓవర్, ఎస్ఎంఎస్ కాలింగ్ ప్రయోజనాలతోపాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్‌కు 1-సంవత్సరం సభ్యత్వాన్ని అందిస్తుంది.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ కోసం