Airtel Tech Mahindra: భారత్‌లో త్వరలోనే 5జీ సేవలు (5G Services) అందుబాటులోకి రానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. దాదాపు అన్ని టెలికాం కంపెనీలు 5జీ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఆగస్టు నాటికి 5జీ ఆధారిత ఇంటర్‌నెట్ సేవలను తీసుకురావాలనే సంకల్పంతో ఉంది. ఇందులో భాగంగానే అధునాత టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ టెక్ మహీంద్రాతో చేతులు కలిపింది.
5జీ నెట్‌వర్క్, ప్రైవేటు నెట్‌వర్క్‌లు, క్లౌడ్ వంటి విభాగాల్లో కంపెనీలకు అవసరమ్యే డిజిటల్ సొల్యూషన్స్‌ను సంయుక్తంగా అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అంతేకాకుండా మార్కెటింగ్ అవసరాలకు అనుగూణంగా వ్యూహాత్మక భాగస్వామ్యం ఒప్పందం చేసుకున్నాయి. ఎయిర్‌టెల్ ఇప్పటికే 5జీ సేవలను ప్రయోగాత్మకంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. ఇక టెక్ మహీంద్రా 5జీ సర్వీసులకు సంబంధించిన అప్లికేషన్స్, ప్లాట్‌ఫామ్‌లను రూపొందించింది.
ఈ రెండు కంపెనీల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం 5జీ ఇంటర్‌నెట్ సేవలను మరింతగా వినియోగంలోకి తెచ్చేందుకు సహాయపడే సొల్యూషన్స్‌ను అభివృద్ది చేయనున్నాయి. ఇందులో భాగంగానే ఇన్నోవేషన్ ల్యాన్‌ను ఏర్పాటు చేయనున్నాయి. ఈ ఒప్పందం కారణంగా 5జీ టెక్నాలజీ రంగంలో రానున్న రోజుల్లో భారీగా ఉద్యోగాల కల్పన జరగనుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
Viral Video: తగ్గేదెలే.. పుష్ప సాంగ్‌కు స్టెప్పులేసిన చింపాంజీ.. నవ్వులు పూయిస్తున్న వీడియో..
ముగిసిన సమంత, నయన్‌ల సినిమా షూటింగ్.. సెట్స్‌లో సందడే సందడి.