Airtel 5G Service: 5జీ సేవలకు ఎయిర్‌టెల్‌ సిద్ధం.. హైదరాబాద్‌లో ప్రయోగాత్మక సేవలు విజయవంతం

|

Jan 29, 2021 | 5:35 AM

Airtel 5G Service: దేశ వ్యాప్తంగా 5జీ సేవలను అందించేందుకు ఎయిర్‌టెల్‌ సిద్ధమవుతోంది. తాజాగా హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా 5జీ సేవల పరీక్షలను పూర్తి చేసినట్లు..

Airtel 5G Service: 5జీ సేవలకు ఎయిర్‌టెల్‌ సిద్ధం.. హైదరాబాద్‌లో ప్రయోగాత్మక సేవలు విజయవంతం
Follow us on

Airtel 5G Service: దేశ వ్యాప్తంగా 5జీ సేవలను అందించేందుకు ఎయిర్‌టెల్‌ సిద్ధమవుతోంది. తాజాగా హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా 5జీ సేవల పరీక్షలను పూర్తి చేసినట్లు ఎయిర్ టెల్‌ ప్రకటించింది. ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు, స్పెక్ట్రమ్‌ లభిస్తే వెంటనే దేశ వ్యాప్తంగా 5 జీ సేవలను ప్రారంభిస్తామని ఎయిర్‌ టెల్‌ ఎండీ, సీఈవో గోపాల్‌ విఠల్‌ ప్రకటించారు. కంపెనీకి అందుబాటులో ఉన్న 1800 మెగా హెర్జ్‌ బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌ ద్వారా ఎయిర్‌ టెల్‌ హైదరాబాద్‌లో ఈ ప్రయోగాలను పూర్తి చేసింది. 4జీ సేవల కంటే పది రేట్ల వేగంతో అందించవచ్చని తెలిపారు.

అయితే హైదరాబాద్‌లో 5జీ సేవల పనితీరు ఎయిర్‌టెల్‌ ఏపీ, తెలంగాణ సీఈవో వివరించారు. కాగా, హైదరాబాద్‌లో నిర్వహించిన పరీక్ష ద్వారా దేశంలో ప్రయోగాత్మకంగా 5జీ సేవలను అందించిన తొలి కంపెనీగా ఎయిర్‌ టెల్‌ నిలిచింది. ముఖేష్‌ అంబానీ నాయకత్వంలోని రిలయన్స్‌ జియో కూడా ఈ సేవలు అందించేందుకు సిద్ధమవుతుంది.

5జీ నెట్‌ వర్క్‌లో వాడే పరికరాలు తప్పనిసరిగా దేశీయంగా తయారై ఉండాలని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఇందుకు అవసరమైన పరీక్షల కోసం త్వరలోనే అనుమతి ఇస్తామని నేషనల్‌ ఇన్ఫర్మాటిక్స్‌ సెంటర్‌ నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర టెలికాం మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. 5జీ టెలికాం సేవల విషయంలో భారత్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ మిగతా దేశాల కంటే ముందు ఉండాలన్నారు.

Also Read: Google Maps: సరికొత్త హంగులతో వస్తోన్న గూగుల్ మ్యాప్స్… తెలుగుతో పాటు మరో 9 భాషల్లో..