ఏఐ స్పీడ్ మామూలుగా లేదు.. టెక్ ప్రపంచాన్ని షేక్ చేసిన టాప్ న్యూస్ ఇదే.. తెలుసుకోకపోతే మీరు వెనుకనే..!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో ఈ వారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఏఐ ఆధారిత సైబర్ దాడులపై ప్రపంచ దేశాలకు హెచ్చరికల నుంచి, గూగుల్ జెమినీ కొత్త సామర్థ్యాలు, GPT-5 వైద్యరంగంలో చూపిన ప్రతిభ, మార్కెట్లోకి వచ్చిన కొత్త ఏఐ టూల్స్ వరకు టెక్ ప్రపంచాన్ని కుదిపేసిన అప్‌డేట్స్ వెలుగులోకి వచ్చాయి. విద్య, ఆరోగ్యం, భద్రత, వ్యాపారం వంటి ప్రతి రంగంలోనూ ఏఐ ప్రభావం వేగంగా విస్తరిస్తోందని నిపుణులు చెబుతున్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. అక్కడ.. ఇక్కడ అనే కాదు.. ఎక్కడైనా.. ఏ విషయంలోనైనా.. ఏఐ అనాల్సిందే.. కృత్రిమ మేధస్సు (ఏఐ) లేకుండా ప్రస్తుతం పనులు అయ్యేలా కనిపించడం లేదు.. సులువుగా.. క్షణాల్లో పనులు అయ్యేలా చాలా మంది ఏఐని ఉపయోగిస్తున్నారు. అయితే.. ప్రస్తుతం ఏఐ.. అప్డేటెడ్ వర్షన్ తో దూసుకెళ్తోంది.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచంలో ఈ వారం ఎన్నో సంచలనాత్మక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వాలకు భద్రతా హెచ్చరికల దగ్గరి నుండి, క్లాస్‌రూమ్ పాఠాల వరకు, అలాగే ఏళ్లుగా ఉన్న మెడికల్ మిస్టరీలను ఛేదించడం వరకు.. ఏఐ సత్తా చాటిందని నిపుణులు పేర్కొంటున్నారు. మున్ముందు ఏఐ స్పీడ్ మరింత పెరుగుతుందని పేర్కొంటున్నారు.. ఈ వారం డిజిటల్ ప్రపంచంలో ట్రెండ్ అయిన టాప్ న్యూస్ మీకోసం..
ప్రపంచ దేశాలకు వార్నింగ్: సైబర్ దాడులతో అలర్ట్
ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన ‘ఫైవ్ ఐస్’ (అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్) ఇంటెలిజెన్స్ దేశాలు తొలిసారిగా ఒక్కటై తీవ్రమైన హెచ్చరిక జారీ చేశాయి. ఏఐ సాయంతో జరిగే సైబర్ దాడులు ఊహించిన దానికంటే వేగంగా, రాబోయే కొద్ది నెలల్లోనే పెరిగే ముప్పు ఉందని వార్నింగ్ ఇచ్చాయి. ప్రభుత్వాలు, బడా కంపెనీలు వెంటనే అప్రమత్తం కాకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశాయి.
మన కంప్యూటర్లను వాడనున్న జెమినీ
గూగుల్ జెమినీ 3.5 ఫ్లాష్‌లో ఒక అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ఇకపై ఏఐ కేవలం మనతో చాటింగ్ చేయడమే కాదు, మన బ్రౌజర్లు, యాప్స్, డెస్క్‌టాప్‌లను కూడా దానంతట అదే ఆపరేట్ చేయగలదు. భద్రత కోసం గూగుల్ దీనికి ప్రత్యేకమైన సెక్యూరిటీ ట్రైనింగ్ కూడా ఇచ్చింది. అంటే, ఇకపై జెమినీ ఒక వర్చువల్ అసిస్టెంట్‌లా మన పనులన్నీ సులువుగా చేసేస్తుందన్నమాట.
క్లాస్‌రూమ్, స్టాక్ మార్కెట్‌లోకి గూగుల్ ఎంట్రీ
గూగుల్ ఈ వారం రెండు కీలకమైన టూల్స్ లాంచ్ చేసింది. మొదటిది, విద్యార్థుల కోసం ‘ఉచిత ఏఐ స్టడీ నోట్‌బుక్స్’. కెమిస్ట్రీ లాంటి కష్టమైన సబ్జెక్టులను కూడా ఇది సులువుగా వివరిస్తుంది. రెండవది, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల కోసం రియల్-టైమ్ డేటాతో ‘గూగుల్ ఫైనాన్స్’ మొబైల్ యాప్. చదువు నుండి డబ్బుల పెట్టుబడి వరకు.. ప్రతి ముఖ్యమైన నిర్ణయంలో ఏఐని భాగం చేయడమే గూగుల్ టార్గెట్.
మూడేళ్ల మెడికల్ మిస్టరీని గంటల్లో ఛేదించిన GPT-5
ఏఐ కేవలం కోడింగ్, రైటింగ్ కోసమే కాదు, సైంటిస్టులకు ఏ రేంజ్‌లో సాయపడుతుందో ఈ ఘటనే నిదర్శనం. ఒక ఇమ్యునాలజిస్ట్ (వైద్య పరిశోధకుడు) మూడేళ్లుగా సాల్వ్ చేయలేకపోయిన ఒక ప్రయోగాన్ని, GPT-5 ప్రో కేవలం కొన్ని గంటల్లోనే ఛేదించి ఆశ్చర్యపరిచింది. వైద్యరంగంలో ఏఐ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్.
మార్కెట్లోకి వచ్చిన 10 సరికొత్త ఏఐ టూల్స్ ఇవే:
- IdeaProof: మీ స్టార్టప్ ఐడియా వర్కౌట్ అవుతుందా లేదా అనేది కాంపిటీటర్ల డేటాతో సహా 120 సెకన్లలో చెప్పేస్తుంది.
- Automateed: బొమ్మలు, కవర్ డిజైన్‌తో సహా 150 పేజీలకు పైగా ఉన్న పుస్తకాన్ని ఏఐతోనే రాయించేయొచ్చు.
- MojoMake: టెక్స్ట్ నుంచి వీడియోలు, 4K ఇమేజెస్ క్రియేట్ చేసే ఆల్-ఇన్-వన్ టూల్.
- ClipMode: కేవలం ఒకే ఒక్క సెల్ఫీతో అద్భుతమైన వీడియోలు, బ్రాండెడ్ ఫోటోలు తయారు చేసుకోవచ్చు.
- Any Video Converter: పాత, బ్లర్ అయిన వీడియోలను 4K క్వాలిటీకి మార్చేస్తుంది.
- StickyPrompts: అన్ని ఏఐ మోడల్స్‌కు సంబంధించిన ప్రాంప్ట్స్ ఒకే చోట దొరికే లైబ్రరీ.
- Should I Get a Patent: మీ ఐడియాకు పేటెంట్ హక్కులు తెచ్చుకోవచ్చా లేదా అని విశ్లేషించి చెబుతుంది.
- AirMusic: 25 రకాల స్టైల్స్‌లో పాటలు, మ్యూజిక్ వీడియోలు క్రియేట్ చేస్తుంది.
- Bytemine: బిజినెస్ సేల్స్ పెంచుకోవడానికి కోట్లాది మంది కాంటాక్ట్స్ ఇస్తుంది.
- ForthWrite: మీరు రాసే స్టైల్‌ని అర్థం చేసుకుని, మీలాగే ఈమెయిల్స్ డ్రాఫ్ట్ చేసి పెడుతుంది.
ఓపెన్ సోర్స్: ప్రైవసీకి పెద్దపీట
క్లౌడ్ మీద ఆధారపడకుండా మీ కంప్యూటర్‌లోనే వాడుకునేలా ఈ వారం మూడు ఓపెన్ సోర్స్ టూల్స్ వచ్చాయి:
Pinokio: ఎటువంటి కోడింగ్ లేకుండా ఏ ఓపెన్-సోర్స్ ఏఐ యాప్‌నైనా సింగిల్ క్లిక్‌తో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
RuView: ఇది నిజంగా సంచలనం! ఇంట్లో ఉండే సాధారణ వై-ఫై సిగ్నల్స్‌తోనే మనుషుల కదలికలను, ఆరోగ్యాన్ని (హార్ట్ బీట్ వంటివి) కెమెరాలు లేకుండానే కనిపెట్టేస్తుంది. వృద్ధుల ఆరోగ్య పర్యవేక్షణకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
OpenHuman: ఇంటర్నెట్‌తో పనిలేకుండా పూర్తిగా మీ కంప్యూటర్‌లోనే పనిచేసే పర్సనల్ ఏఐ.
మీ చేతికే ఏఐ ఫిట్‌నెస్ కోచ్
ప్రముఖ బాస్కెట్‌బాల్ ఆటగాడు స్టెఫెన్ కర్రీతో కలిసి ‘జెమినీ పవర్డ్ ఫిట్‌నెస్ బ్యాండ్’ మార్కెట్లోకి వచ్చింది. ఇది కేవలం మీరు ఎన్ని అడుగులు వేశారో చెప్పడమే కాదు.. మీ హార్ట్ రేట్, నిద్ర, ఆక్సిజన్ లెవల్స్‌ను ట్రాక్ చేసి, ఈరోజు మీరు వర్కౌట్ చేయాలా లేక రెస్ట్ తీసుకోవాలా అని కచ్చితంగా చెబుతుంది. నిద్రలో గుండె సంబంధిత సమస్యలను కూడా పసిగట్టడం దీని స్పెషాలిటీ.
ఆంత్రోపిక్ ఫ్రీ కోర్సులు
క్లాడ్ (Claude) ఏఐని తయారు చేసిన ఆంత్రోపిక్ సంస్థ, ఉచితంగా 13 ఏఐ కోర్సులను లాంచ్ చేసింది. ఏఐ మీద పట్టు సాధించాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశం. మనం ఏఐని కేవలం పనులు చేయించుకోవడానికే కాకుండా, తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి వాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
అయితే.. జాతీయ భద్రత నుండి మన ఆరోగ్యం వరకు.. విద్య నుండి వినోదం వరకు.. ప్రతి రంగంలోనూ ఏఐ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. ఈ స్పీడ్ ఎంత లాభమో, అంతే ప్రమాదం కూడా అని ఇంటెలిజెన్స్ సంస్థలు వార్నింగ్స్ చెబుతున్నాయి. అందుకే ఈ రోజుల్లో టెక్నాలజీ పట్ల అప్‌డేట్‌గా ఉండటం కేవలం ఆప్షన్ కాదు, అది మన అవసరం..
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
