
ఈ విశ్వంలో మనుషులు కాకుండా వేరే జీవులు కూడా ఉన్నారనే అంశం కొత్తదేం కాదు. వేరే గ్రహంపై ఏలియన్స్ ఉన్నారని చాలా మంది బలంగా నమ్ముతుంటారు. వారి నమ్మకానికి మరింత బలం చేకూరుస్తూ.. భారత శాస్త్రవేత్తల బృందం ఏలియన్స్ ఉన్న గ్రహాన్ని గుర్తించారు. అహ్మాదాబాద్‌లోని ఫిజికల్ రిసెర్చ్ లాబోరేటరీకి చెందిన శాస్త్రవేత్తల టీమ్ ఈ అద్భుతాన్ని కనిపెట్టారు. ఈ గ్రహం సౌర వ్యవస్థ బయట ఉంటుంది. TOI-6038A Bగా పిలువబడే ఈ గ్రహం, 78.5 భూమి ద్రవ్యరాశి, 6.41 భూమి వ్యాసార్థాలతో కూడిన భారీ పరిమాణంలో ఉంటుంది. 263 భూ గ్రహాలను కలిపితే.. ఎంత పెద్దగా ఉంటుందో ఈ గ్రహం అంత పెద్దగా ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీనిని PRL మౌంట్ అబు అబ్జర్వేటరీలో 2.5 మీటర్ల టెలిస్కోప్ ద్వారా కనుగొన్నారు. ఇది బైనరీ వ్యవస్థలో భాగంగా ఉంది.
ఈ గ్రహం ఒక ప్రకాశవంతమైన, లోహంతో కూడిన F-రకం నక్షత్రం చుట్టూ వృత్తాకార కక్ష్యలో తిరుగుతూ ఉంటుంది. F-రకం నక్షత్రం అనేది మన సూర్యుడి కంటే మరింత వేడిగా, ప్రకాశవంతంగా ఉంటుంది, కానీ విశ్వంలోని ఉన్న మరికొన్ని అత్యంత వేడి నక్షత్రాల కంటే తీవ్రంగా ఉండదు. ఈ రకమైన నక్షత్రాలు సూర్యుని ప్రకాశం కంటే 1.5 నుండి 5 రెట్లు ఎక్కువ. TOI-6038A b నెప్ట్యూన్ లాంటి, వాయు దిగ్గజం ఎక్సోప్లానెట్‌ల మధ్య పరివర్తన ప్రాంతంలో ఉంది, దీనిని ఉప-శని అని పిలుస్తారు, ఈ వర్గం మన సౌర వ్యవస్థలో లేదు, ఇది గ్రహ నిర్మాణం, పరిణామాన్ని అధ్యయనం చేయడానికి ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి