OnePlus Pad: టెక్ లవర్స్‌కి గుడ్‌ న్యూస్‌.. వన్‌ప్లస్‌ నుంచి ట్యాబ్‌ వచ్చేస్తోంది. ఫీచర్లు, ధర ఎలా ఉండనున్నాయంటే.

|

Jan 28, 2023 | 7:40 PM

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం వన్‌ప్లస్‌ ఇప్పటి వరకు స్మార్ట్‌ ఫోన్‌లు, స్మార్ట్‌ టీవీలు, వాచ్‌లతో టెక్‌ మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తుంపును సంపాదించుకుంది. మొదట్లో ప్రీమియం ప్రొడక్ట్స్‌ను మాత్రమే తీసుకొచ్చిన వన్‌ప్లస్‌ తర్వాత బడ్జెట్‌ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ ప్రొడక్ట్స్‌ను...

OnePlus Pad: టెక్ లవర్స్‌కి గుడ్‌ న్యూస్‌.. వన్‌ప్లస్‌ నుంచి ట్యాబ్‌ వచ్చేస్తోంది. ఫీచర్లు, ధర ఎలా ఉండనున్నాయంటే.
One Plus Pad
Follow us on

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం వన్‌ప్లస్‌ ఇప్పటి వరకు స్మార్ట్‌ ఫోన్‌లు, స్మార్ట్‌ టీవీలు, వాచ్‌లతో టెక్‌ మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తుంపును సంపాదించుకుంది. మొదట్లో ప్రీమియం ప్రొడక్ట్స్‌ను మాత్రమే తీసుకొచ్చిన వన్‌ప్లస్‌ తర్వాత బడ్జెట్‌ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ ప్రొడక్ట్స్‌ను లాంచ్‌ చేస్తూ వస్తోంది. ఇక తాజాగా వన్‌ప్లస్‌ బ్రాండ్‌ నుంచి ట్యాబ్స్‌ కూడా రానున్నాయి. వన్‌ప్లస్ ఫిబ్రవరి 7న క్లౌడ్ 11 ఈవెంట్‌ను ప్రకటించింది.

ఈ ఈవెంట్‌లో వన్‌ప్లస్‌ OnePlus 11 5G, OnePlus 11R 5G స్మార్ట్‌ఫోన్‌లు, OnePlus TV 65 Q2 ప్రో, OnePlus బడ్స్ ప్రో 2, OnePlus మెకానికల్‌లను గ్రాండ్‌గా లాంచ్ చేయబోతోంది. అయితే ఇదే ఈవెంట్‌లో వన్‌ప్లస్‌ తొలిసారి తమ బ్రాండ్‌ నుంచి వన్‌ప్లస్‌ ప్యాడ్‌ను లాంచ్‌ చేస్తోంది. ఇదిలా ఉంటే వన్‌ప్లస్‌ ప్యాడ్ లాంచ్‌కు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, కంపెనీ అధికారిక సైట్‌లోని OnePlus 11 5G లైవ్ లిస్టింగ్‌లో OnePlus ప్యాడ్ గురించి ప్రస్తావించినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి. అంతేకాదు వన్‌ప్లస్‌ ప్యాడ్‌ ఫీచర్లు, ధరలకు సంబంధించి కొన్ని వివరాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ఈ వివరాల ప్రాకరం.. వన్‌ప్లస్‌ ప్యాడ్‌లో 12.4 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ + ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఇవ్వనున్నారు. స్నాప్‌డ్రాగన్‌ 865 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ట్యాబ్‌లో 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ఉండనున్నట్లు సమాచారం. కెమెరా విషయానికొస్తే ఇందులో డ్యూయల్‌ రియర్‌ కెమెరా ఉండనున్నట్లు తెలుస్తోంది. 13 ఎంపీ రెయిర్‌ మెయిన్‌ కెమెరా, 5 ఎంపీ సెకండరీ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో 45 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 10,900 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇవ్వనున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..