MPassport Seva App: పాస్‌పోర్టు అప్లయ్ చేయడానకి సరికొత్త యాప్.. ఇక ఆ కష్టాలకు చెల్లు.. సింపుల్ టిప్స్‌తో అప్లయ్ చేయండిలా..

|

May 14, 2023 | 8:00 PM

పాస్ పోర్ట్ కోసం కూడా ఆన్‌లైన్ అప్లికేషన్ పంపేలా కొత్త యాప్‌ను లాంచ్ చేశారు. పాస్‌పోర్ట్ అనేది జాతీయతకు ధ్రువీకరణగా పనిచేస్తుంది. ప్రస్తుతం పాస్‌పోర్టు ప్రక్రియను సులభతరంగా చేసేలా ప్రభుత్వం ఎంపాస్‌పోర్ట్ సేవా యాప్‌ను లాంచ్ చేసింది.

MPassport Seva App: పాస్‌పోర్టు అప్లయ్ చేయడానకి సరికొత్త యాప్.. ఇక ఆ కష్టాలకు చెల్లు.. సింపుల్ టిప్స్‌తో అప్లయ్ చేయండిలా..
Mpassport
Follow us on

ప్రస్తుతం భారతదేశంలో స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగింది. యువత ఎక్కువగా ఎలాంటి అవసరాల కోసం అయినా స్మార్ట్ ఫోన్‌పై ఆధారపడుతున్నారు. దీంతో చాలా వరకూ ప్రభుత్వ సంస్థలు ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభించాయి. అలాగే యాప్స్‌ ద్వారా కూడా అప్లికేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించాయి. తాజాగా విదేశాలకు వెళ్లడానికి ఉపయోగపడే పాస్ పోర్ట్ కోసం కూడా ఆన్‌లైన్ అప్లికేషన్ పంపేలా కొత్త యాప్‌ను లాంచ్ చేశారు. పాస్‌పోర్ట్ అనేది జాతీయతకు ధ్రువీకరణగా పనిచేస్తుంది. ప్రస్తుతం పాస్‌పోర్టు ప్రక్రియను సులభతరంగా చేసేలా ప్రభుత్వం ఎంపాస్‌పోర్ట్ సేవా యాప్‌ను లాంచ్ చేసింది. ఈ యాప్ ద్వారా పాస్‌పోర్ట్ ప్రక్రియను క్రమబద్ధీకరించనుంది. ఈ ప్రక్రియను మరింత సౌకర్యవంతంగా చేయడానికి భారతదేశంలో ఎక్కడి నుంచైనా పాస్‌పోర్ట్ దరఖాస్తుతో పాటు మొబైల్ ఫోన్‌ల నుంచి కూడా పాస్‌పోర్ట్ దరఖాస్తు ఫారమ్‌లను పూరించేలా చేస్తుంది. ఇలాంటి చర్యలు పాస్‌పోర్ట్ దరఖాస్తు విధానాన్ని సులభతరం చేస్తాయి. ప్రస్తుతం పాస్‌పోర్ట్ సేవా యాప్‌ని ఉపయోగించి కొత్త పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు ఎలా చేసుకోవాలో? ఓ సారి తెలుసుకుందాం.

  • స్టెప్-1: గూగుల్ ప్లే స్టోర్ లేదా ఐఓఎస్ యాప్ స్టోర్ నుంచి ఎంపాస్‌పోర్ట్  సేవా అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని యాప్‌ను ఓపెన్ చేయాలి.
  • స్టెప్-2: “కొత్త యూజర్ రిజిస్టర్” ఎంపికపై క్లిక్ చేసి, ఆపై డ్రాప్-డౌన్ మెను నుంచి కావాల్సిన పాస్‌పోర్ట్ కార్యాలయాన్ని ఎంచుకోండి.
  • స్టెప్-3: పేరు, పుట్టిన తేదీ,ఈమెయిల్ ఐడీ మొదలైన అవసరమైన వివరాలను పూరించండి.
  • స్టెప్-4: ప్రత్యేకమైన లాగిన్ ఐడీని సృష్టించాలి.
  • స్టెప్-5: ఖాతా కోసం బలమైన పాస్‌వర్డ్‌ను సెట్ చేయండి.ఆపై భద్రతా ప్రశ్నను ఎంచుకుని, పాస్‌వర్డ్ మర్చిపోయి ఉంటే దాన్ని తిరిగి పొందేందుకు సమాధానాన్ని అందించండి.
  • స్టెప్-6: క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి, “సమర్పించు”పై క్లిక్ చేయడం ద్వారా కొనసాగించండి.
  • స్టెప్-7 : సమర్పించిన తర్వాత, ఖాతా యాక్టివేషన్ కోసం ఈ మెయిల్‌కు ధ్రువీకరణ లింక్ పంపుతారు.
  • స్టెప్-8: ధ్రువీకరణ లింక్‌ను క్లిక్ చేసిన తర్వాత దరఖాస్తుదారు కొత్త వెబ్‌పేజీకి వెళ్తారు. అక్కడ వారు నిర్ధారణ కోసం లాగిన్ ఐడీని నమోదు చేయాలి.
  • స్టెప్-9:   ఖాతా విజయవంతంగా ధ్రువీకరించిన తర్వాత దరఖాస్తుదారు యాప్‌ను మూసివేసి, మళ్లీ ప్రారంభించాలి.
  • స్టెప్-10:  ఆపై దరఖాస్తుదారు “ఎక్సిస్టింగ్ యూజర్” ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
  • స్టెప్-11: లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాలి.
  • స్టెప్-12: ఆ తర్వాత, “తాజా పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేయి”పై క్లిక్ చేయాలి.
  • స్టెప్-13 : అవసరమైన ఫారమ్‌ను పూరించాలి. ఆ యాప్‌లో అందించిన దశలను జాగ్రత్తగా అనుసరించండి.
  • స్టెప్-14:  అవసరమైన రుసుము చెల్లింపును కొనసాగించండి.
  • స్టెప్-15:  చివరి దశలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పాస్‌పోర్ట్ కేంద్రాన్ని సందర్శించడానికి అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేయాలి. 

అంతే ఎక్కడికీ వెళ్లకుండా సింపుల్ మీ పాస్‌పోర్ట్ అప్లికేషన్ పూర్తవుతుంది. ఆ పై డౌన్‌లోడ్ అయిన పీడీఎఫ్‌ను ప్రింట్ తీసుకుని మీరు ఎంచుకున్న తేదీకి అనుగుణంగా పాస్‌పోర్ట్ కేంద్రానికి వెళ్తే సరిపోతుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..