5G SIM Upgrade Scam: మీ 4G నుండి 5Gకి మార్చడానికి ప్లాన్ చేస్తున్నారా? జాగ్రత్త.. రిస్క్‌లో పడిపోతారు!
దేశంలో టెక్నాలజీ పెరిగిపోతోంది. 5జీ టెక్నాలజీ వచ్చేసింది. అయితే టెక్నాలజీ ఎంత పెరిగితో అన్ని మోసాలు జరుగుతున్నాయి. 5G టెక్నాలజీని తీసుకువచ్చేందుకు సిద్ధంగా ఉన్నందున..
దేశంలో టెక్నాలజీ పెరిగిపోతోంది. 5జీ టెక్నాలజీ వచ్చేసింది. అయితే టెక్నాలజీ ఎంత పెరిగితో అన్ని మోసాలు జరుగుతున్నాయి. 5G టెక్నాలజీని తీసుకువచ్చేందుకు సిద్ధంగా ఉన్నందున టెలికాం ప్రొవైడర్లు మొదటి దశ ప్రారంభానికి అనేక నగరాలను గుర్తించడంతో స్కామర్లు కూడా బయటపడ్డారు. ఈ స్కామర్‌లు భారతదేశంలోని ప్రసిద్ధ టెలికాం కంపెనీల కస్టమర్ కేర్ నుండి ప్రతినిధిగా వ్యవహరిస్తారు. మీ 4G సిమ్‌ను 5Gకి అప్‌గ్రేడ్ చేయడంలో మీకు సహాయపడే విధంగా మీ డేటాకు ప్రాప్యతను పొందేందుకు ప్రయత్నిస్తారు. ఈ స్కామర్‌లు ఫిషింగ్ పద్ధతిని ఉపయోగిస్తున్నారు. బ్యాంక్ పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు మొదలైన వారి వ్యక్తిగత డేటా వివరాలను అడుగుతారు. ముంబై పోలీసులు కూడా రెండు రోజుల క్రితం ఒక ట్వీట్‌ను జారీ చేశారు. ఈ స్కామర్‌ల బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేశారు.
టెక్‌లో అప్‌గ్రేడేషన్ వల్ల స్కామర్‌లు దూసుకుపోవడానికి వేచి ఉన్నారని, వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు రిస్క్ అలర్ట్ ట్విట్ చేస్తూ హెచ్చరిస్తున్నారు. ప్రజలను 4జీ నుంచి 5జీకి కనెక్ట్ చేసేందుకు వివరాలను అడుగుతూ మోసగిస్తున్నట్లు గుర్తించారు. ఇలాంటి విషయాల్లో ఎవ్వరు ఫోన్ చేసినా మీ వ్యక్తిగత వివరాలతో పాటు బ్యాంకింగ్ సమాచారాన్ని షేర్ చేసుకోవద్దని, వారు పంపిన లింక్‌లపై ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయవద్దని హెచ్చరిస్తున్నారు. వివరాలు చెప్పినట్లయితే మీ బ్యాంకు మొత్తం ఖాళీ అయిపోతుందని పోలీసులు ట్విట్ చేశారు. చాలా మంది 5జీకి మారడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా అప్రమత్తం చేస్తున్నారు.
5Gకి మారడం వల్ల కాల్ డ్రాప్/కనెక్ట్, నెట్‌వర్క్ లభ్యత, తక్కువ స్పీడ్ వంటి సమస్యలను పరిష్కరిస్తే చాలా మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఆన్‌బోర్డ్‌లోకి వచ్చే అవకాశం ఉంది. మరో 43 శాతం మంది 10 శాతం వరకు అదనపు టారిఫ్ చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని, భారతదేశంలోని ప్రాంతం, కనెక్టివిటీని బట్టి 40-50 Mbps 4G వేగంతో పోలిస్తే, 5G సేవలు 300 Mbps లేదా అంతకంటే ఎక్కువ వేగానికి మద్దతు ఇస్తాయని నివేదిక చెబుతోంది.
Risk Alert! Upgradation in tech brings about a new wave of scammers waiting to pounce. The most recent one is fraudsters offering to guide you to convert to 5G. Do not share your personal/banking information or click on any unknown links.#Scam2022 #5GScam #CyberSafe pic.twitter.com/9S0XphLM9Q
— मुंबई पोलीस – Mumbai Police (@MumbaiPolice) October 12, 2022
ఇందు కోసం ఓ సర్వే జరిగింది. సర్వేలో పాల్గొన్న 20 శాతం మంది తమ వద్ద ఇప్పటికే 5G మొబైల్‌ఉందని చెప్పగా, మరో 4 శాతం మంది ఈ సంవత్సరం 5జీ మొబైల్‌ను తీసుకునేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. మరో 20 శాతం మంది 2023లో 5G మొబైల్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉందని చెప్పారు. భారతదేశంలోని 500 మిలియన్లకు పైగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులలో ఈ సంవత్సరం చివరి నాటికి సుమారు 100 మిలియన్ల మంది 5Gని ఉపయోగించుకుంటారని తెలుస్తోంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి