Asteroid : భూమి అతి దగ్గరగా భారీ గ్రహ శకలం.. అదే జరిగితే వినాశనమే!

|

Mar 25, 2023 | 4:30 PM

నేడు(మార్చి 25) ఓ భారీ గ్రహశకలం భూమికి దగ్గరగా వస్తుందట. ఎంత దగ్గర అంటే మనకు అతి సమీపంగా ఉండే చందమామ కంటే దగ్గరగా వస్తుందట. అది కూడా భూ కక్ష్యలో నుంచే వెళ్లబోతోంది. ఇప్పుడు ఇదే అందరికీ ఆందోళన కల్గిస్తోంది.

Asteroid : భూమి అతి దగ్గరగా భారీ గ్రహ శకలం.. అదే జరిగితే వినాశనమే!
Asteroid
Follow us on

అనంత విశ్వంలో అనే గ్రహాలు, నక్షత్రాలు ఉన్నాయి. పాలపుంతలు.. అనేకరకాల వింతలు, విశేషాలు కనిపిస్తూనే ఉంటాయి. వాటిల్లో గ్రహ శకలాలు కూడా అప్పడప్పుడూ పడుతుంటాయి. అయితే అవి భూమి దగ్గరగా వచ్చినా భూమిని ఢీకొట్టకుండానే వెళ్లిపోతున్నాయి. అయితే నేడు(మార్చి 25) ఓ భారీ గ్రహశకలం భూమికి దగ్గరగా వస్తుందట. ఎంత దగ్గర అంటే మనకు అతి సమీపంగా ఉండే చందమామ కంటే దగ్గరగా వస్తుందట. అది కూడా భూ కక్ష్యలో నుంచే వెళ్లబోతోంది. దీని వల్ల కూడా ప్రమాదమేమి లేకపోయినా.. శాస్త్రవేత్తలను మాత్రం ఆందోళనకు గురిచేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..

నాసా ప్రకటన ఇది..

భూమికి చంద్రుడికి మధ్యలోకి ఓ భారీ గ్రహ శకలం శనివారం రానుంది. చంద్రుడి కంటే రెండు రెట్లు భూమికి దగ్గర వస్తుందని అమెరికా స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ నాసా శాస్త్రవేత్తలు ప్రకటించారు. భూమికి దగ్గరగా వచ్చినప్పుడు ఇది 107,500 మైళ్ల (173004 కిలోమీటర్ల) దూరంలో ఉంటుందని పేర్కొన్నారు. ఈ గ్రహ శకలానికి 2023 డీజెడ్2 అని నాసా శాస్త్రవేత్తలు పేరు పెట్టారు.

ఎప్పుడు గుర్తించారు..

ఈ గ్రహశకలాన్ని ఫిబ్రవరి 27న తొలిసారిగా కనిపెట్టారు. యూరోపియన్ నియర్ ఎర్త్ ఆస్ట్రరాయిడ్స్ రీసెర్చ్ ప్రాజెక్టులో భాగంగా దీన్ని గుర్తించారు. ఆ సమయంలో అది భూమికి 159 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది సూర్యుడి చుట్టూ ఒక రౌండ్ వేయడానికి 3.16 సంవత్సరాలు పడుతుందని అంచనా. ఈ గ్రహశకలం మళ్లీ 2026లో భూమికి దగ్గరగా రానుంది. అప్పుడు గనుక ఢీకొట్టకపోతే.. 2029లో భూమికి మరింత దగ్గరగా వస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మనం చూడొచ్చా..

దాదాపు పదేళ్లకోసారి ఏదైనా గ్రహశకలం ఇంత దగ్గరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందులోనూ వాటి సైజ్ 140 నుంచి 310 అడుగులు ఉన్నవి దగ్గరగా వస్తూ ఉంటే.. దాన్ని గమనించడం అరుదైన అవకాశంగా శాస్త్రవేత్తలు భావిస్తారు. ఈ గ్రహ శకలాన్ని కళ్లారా చూసే వీలు ఉంది. ఐతే.. ఆగ్నేయ ఆసియా దేశాల వారికి మాత్రమే ఇది కనిపిస్తుంది. భారత్‌లో ప్రజలకు ఇది కనిపించదు. ఈ 200 అడుగుల వెడల్పు ఉన్న రాయిని నాసా ఆస్ట్రరాయిడ్ టీమ్ పరిశీలిస్తోంది.

ఢీకొట్టే అవకాశాలు తక్కువ..

ఇవాళ వచ్చే గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశాలు లేవు. కానీ.. దగ్గరగా వస్తోంది కాబట్టి దాన్ని తేలిగ్గా తీసుకోకూడదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి గ్రహశకలాల్ని అంతరిక్షంలోనే పేల్చి వేసే టెక్నాలజీని మనం మరింతగా డెవలప్ చేసుకోవాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే ఆమధ్య నాసా ఓ చిన్న గ్రహశకలాన్ని విజయవంతంగా పేల్చివేసింది.

మరిన్నిసైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..