Microsoft Bug: బగ్‌ను కనిపెట్టింది.. రూ. 22 లక్షలు గెలుచుకుంది. అసమాన ప్రతిభతో అదరగొట్టిన 20 ఏళ్ల ఢిల్లీ యువతి.

|

Jul 02, 2021 | 10:38 AM

Microsoft Bug: టెక్‌ కంపెనీలకు బగ్‌లు అతిపెద్ద సవాలుగా మారుతాయి. మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా సైబర్‌ నేరగాళ్లు తమ నేరాల పంథాను మార్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే సాఫ్ట్‌వేర్‌ల సహాయంతో వైరస్‌లను సృష్టించి ఒరిజినల్‌ సాఫ్ట్‌వేర్‌లోకి పంపిస్తారు...

Microsoft Bug: బగ్‌ను కనిపెట్టింది.. రూ. 22 లక్షలు గెలుచుకుంది. అసమాన ప్రతిభతో అదరగొట్టిన 20 ఏళ్ల ఢిల్లీ యువతి.
Microsoft Bug
Follow us on

Microsoft Bug: టెక్‌ కంపెనీలకు బగ్‌లు అతిపెద్ద సవాలుగా మారుతాయి. మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా సైబర్‌ నేరగాళ్లు తమ నేరాల పంథాను మార్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే సాఫ్ట్‌వేర్‌ల సహాయంతో వైరస్‌లను సృష్టించి ఒరిజినల్‌ సాఫ్ట్‌వేర్‌లోకి పంపిస్తారు. ఇలా చేయడం వల్ల సదరు సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించే వారి డేటా ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ కారణంగా టెక్‌ కంపెనీలు ఈ బగ్‌ను కనిపెట్టడానికి ప్రత్యేకంగా కొంత మంది ఉద్యోగులను సైతం నియమించుకుంటున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో బయటి వ్యక్తులు సైతం బగ్‌లను గుర్తిస్తే వారికి ప్రోత్సాహకంగా తగిన పారితోషకం ఇస్తుంటాయి కంపెనీలు.
తాజాగా మైక్రోసాఫ్ట్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌లో ఉన్న బగ్‌ను గుర్తించారు ఢిల్లీకి చెందిన 20 ఏళ్ల అదితి సింగ్‌. మైక్రోసాఫ్ట్‌ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సర్వీస్‌ అజ్యూర్‌లో బగ్‌ కనుగొన్నందుకుగాను అదితి సింగ్‌కు రూ. 22 లక్షల నగదు బహుమతి గెలుచుకున్నారు. అదితి.. అజ్యూర్‌లో ఉన్న రిమోట్‌ కోడ్‌ ఎక్సిక్యూషన్‌ బగ్‌ను కనుగొన్నారు. ఈ బగ్ సహాయంతో సైబర్‌ నేరగాళ్లు సులభంగా కంప్యూటర్‌లోని సమాచారాన్ని తస్కరించగలరని అదితి గుర్తించారు. ఈ విషయాన్ని అదితి రెండు నెలల క్రితమే మైక్రోసాఫ్ట్‌ దృష్టికి తీసుకెళ్లారు. అయితే కంపెనీ మాత్రం దీనిపై వెంటనే ప్రకటన చేయకుండా.. బగ్‌ ఉన్న ప్రోగ్రాంను యూజర్స్ డౌన్‌లోడ్ చేసుకోలేదని నిర్థారించుకున్న తర్వాత లోపాన్ని సరిచేసినట్లు తెలిపింది. ఇదిలా ఉంటే అదితి కెరీర్‌ విషయానికొస్తే నిజానికి ఆమె డాక్టర్‌ కావాలనుకుంది. కానీ మెడికల్‌ ఎంట్రన్స్‌లో సీటు రాకపోవడంతో ఎథికల్‌ హ్యాకింగ్‌పై దృష్టి సారించారు. అదితి.. ఇప్పటికే ఫేస్‌బుక్‌, టిక్‌టాక్‌, మైక్రోసాఫ్ట్‌, మొజిల్లా, పేటీఎం, ఎథీరియమ్‌, హెచ్‌పీ వంటి దిగ్గజ కంపెనీల్లో సుమారు 40 వరకు బగ్‌లను కనుగొన్నట్లు తెలిపారు. భవిష్యత్తులోనూ బగ్స్‌ను గుర్తించడం కొనసాగిస్తానని చెబుతున్నారు అదితి.

Also Read: Rajiv Gandhi Khel Ratna: ఖేల్ రత్న బరిలో కోనేరు హంపి.. అర్జున అవార్డులకు మరో ఏడుగురు: అఖిల భారత చెస్ సమాఖ్య

UAE Ban Travel :14 దేశాలకు ప్రయాణ నిషేధం విధించిన యూఏఈ..! భారత్, పాకిస్తాన్‌ తో సహా ఈ దేశాలకు వెళ్లలేరు..

Best Sleep: నిద్రలేమితో బాధపడుతున్నారా..? మంచి నిద్ర పోవాలంటే ఈ పదార్థాలు తీసుకోండి..!