Stalin vs Alagiri: నేను మద్దతిచ్చినా ద్రోహం చేశాడు.. ఊరికే వదిలి పెట్టను.. సంచలన కామెంట్స్ చేసిన అళగిరి..

Stalin vs Alagiri: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నా కొద్దీ ఆ రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. డీఎంకే అధినేత..

Stalin vs Alagiri: నేను మద్దతిచ్చినా ద్రోహం చేశాడు.. ఊరికే వదిలి పెట్టను.. సంచలన కామెంట్స్ చేసిన అళగిరి..
Follow us

|

Updated on: Jan 03, 2021 | 7:35 PM

Stalin vs Alagiri: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నా కొద్దీ ఆ రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. డీఎంకే అధినేత స్టాలిన్‌, అతని సోదరుడు అళగిరి మధ్య పోరు తారాస్థాయికి చేరింది. తాజాగా స్టాలిన్‌పై డీఎంకే బహిష్కృత నేత అళగిరి సంచలన కామెంట్స్ చేశారు. స్టాలిన్‌ ఎట్టి పరిస్థితిలోనూ సీఎం కాలేడని.. తాను కానివ్వనని భీష్మించారు. ఆదివారం నాడు తన మద్దతుదారులతో తమిళనాడులోని మదురైలో అళగిరి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అళగిరి కీలక వ్యాఖ్యలు చేశారు.

అళగిరి వ్యాఖ్యలు యధాతధంగా..‘స్టాలిన్‌కి పార్టీలో ప్రాధాన్యత ఇచ్చినా.. డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినా నేను కాదనలేదు. నేను కూడా స్టాలిన్‌కు మద్దతు ఇచ్చాను. కానీ స్టాలిన్ నాకు ద్రోహం చేశాడు. దక్షిణ తమిళనాడులో డీఎంకే బలోపేతానికి ఎంతో కృషి చేశాను. అది మరిచి నన్ను కుట్రపూరితంగా పార్టీ నుంచి బయటకు పంపించేశారు. నాకు ద్రోహం చేసిన వారికి గుణపాఠం చెబుతాను. నాకు బలం ఉందా? లేదా? అని ప్రశ్నించేవారికి ఈ వేదికే సమాధనం చెబుతుంది. నా తండ్రి ఉన్నప్పుడు నన్ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని స్టాలిన్ వేడుకున్నాడు. ఇప్పుడు ద్రోహం చేసి పార్టీ నుంచి పంపించేశారు.’ అంటూ అళగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇవ్వాలంటూ అళగిరి తన మద్దతుదారులను కోరారు. యుద్ధానికి సిద్ధం అవండి అంటూ తన వర్గం నేతలకు ఆయన పిలుపునిచ్చారు.

ఇదిలాఉంటే అళగిరి పార్టీ పెడతారా? లేక మరో పార్టీకి మద్దతు ఇస్తారా? అనే అంశంపై స్పష్టత ఇవ్వకుండానే తన సమవేశాన్ని ముగించేశారు. అళగిరి ఎటూ తేల్చకపోవడంతో ఆయన మద్దతుదారుల్లో అయోమయం నెలకొంది. మరోవైపు అళగిరి వ్యాఖ్యలపై తమిళనాడు రాష్ట్ర బీజేపీ నాయకత్వం చాలా స్పీడ్‌గా స్పందించింది. అళగిరి పార్టీ పెడితే డీఎంకేలో చీలక ఖాయం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ మురుగన్ అభిప్రాయపడ్డారు. ఆయన నిర్ణయంతో డీఎంకే రెండుగా చీలిపోతుందన్నారు.

Also read:

స్టాలిన్‌పై అళగిరి యుద్ధం.. డీఎంకేని దెబ్బ కొట్టేందుకు కొత్త వ్యూహం.. తమిళనాడులో హీట్ పెంచుతున్న రాజకీయం

Covaxin Vaccines Approved: కరోనా మహమ్మారిని పీచమణిచేందుకు వస్తోన్న తొలి స్వదేశీ టీకా.. కొవాగ్జిన్ ప్రత్యేకతలివే..!