స్టాలిన్‌పై అళగిరి యుద్ధం.. డీఎంకేని దెబ్బ కొట్టేందుకు కొత్త వ్యూహం.. తమిళనాడులో హీట్ పెంచుతున్న రాజకీయం

డీఎంకే పార్టీ నేత స్టాలిన్‌, అతని సోదరుడు అళగిరి మధ్య పోరు పీక్‌కు చేరింది. సోదరుడితో విబేధించి పార్టీ నుంచి బయటకొచ్చిన అళగిరి.. తనకు తానుగా కొత్త ప్రణాళికలు రచిస్తున్నారు.

స్టాలిన్‌పై అళగిరి యుద్ధం.. డీఎంకేని దెబ్బ కొట్టేందుకు కొత్త వ్యూహం.. తమిళనాడులో హీట్ పెంచుతున్న రాజకీయం
Follow us

|

Updated on: Jan 03, 2021 | 8:20 AM

Alagiri Discuss : కొత్త పార్టీనా? లేదంటే మరే పార్టీకైనా మద్ధతా? ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? రాజకీయంగా ఏ విధంగా ముందుకు వెళ్లాలి? దీనిపై డీఎంకే అసమ్మతి నేత, స్టాలిన్ సోదరుడు అళగిరి స్ట్రాటజీ వర్కవుట్ చేస్తున్నారు. తన బలాన్ని నిరూపించుకునేందుకు తమిళనాడు మదురైలో ఇవాళ సమావేశం ఏర్పాటు చేశారు. నీ బలమెంత? నా బలమెంత? నిరూపిస్తానంటూ స్టాలిన్‌కు సవాలు విసురుతున్నారు.

డీఎంకే పార్టీ నేత స్టాలిన్‌, అతని సోదరుడు అళగిరి మధ్య పోరు పీక్‌కు చేరింది. సోదరుడితో విబేధించి పార్టీ నుంచి బయటకొచ్చిన అళగిరి.. తనకు తానుగా కొత్త ప్రణాళికలు రచిస్తున్నారు. దక్షిణ తమిళనాడులో అతని వర్గానికి చెందిన నాయకులు, డీఎంకేలో అసమ్మతి నేతలను ఇవాళ్టి సమావేశానికి ఆహ్వానించారు.

అళగిరి ఏర్పాటు చేస్తోన్న ఈ సమావేశంతో డీఎంకే ముఖ్య నేతల్లో ఆందోళన మొదలైంది. పార్టీ నుంచి ఎవరు వీడతారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అళగిరి బీజేపీలో చేరే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి.

ఇవి కూడా చదవండి :

Mumbai Cop Saves : ఓ నిండు ప్రాణం కాపాడిన కానిస్టెబుల్ అప్రమత్తత.. ముంబై రైల్వే స్టేషన్‌లో ఘటన స్వదేశీ వ్యాక్సిన్‌పై అఖిలేశ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు.. ఆ పార్టీ టీకా వేయించుకోనంటూ..

Latest Articles