Mumbai Cop Saves : ఓ నిండు ప్రాణం కాపాడిన కానిస్టెబుల్ అప్రమత్తత.. ముంబై రైల్వే స్టేషన్‌లో ఘటన

ముంబైలోని ఓ రైల్వే కానిస్టేబుల్ అప్రమత్తత ప్రయాణికుడి ప్రాణం కాపాడింది. రైల్వే ట్రాక్ పై పడిన చెప్పును..

Mumbai Cop Saves : ఓ నిండు ప్రాణం కాపాడిన కానిస్టెబుల్ అప్రమత్తత.. ముంబై రైల్వే స్టేషన్‌లో ఘటన
Follow us

|

Updated on: Jan 03, 2021 | 7:06 AM

Mumbai Cop Saves : ముంబైలోని ఓ రైల్వే కానిస్టేబుల్ అప్రమత్తత ప్రయాణికుడి ప్రాణం కాపాడింది. రైల్వే ట్రాక్ పై పడిన చెప్పును తీసుకునేందుకు ప్రయత్నించడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ అరవై ఏళ్ల వ్యక్తి ట్రాక్‌పై ఉన్న సమయంలో సబర్బన్‌ రైలు దూసుకువచ్చింది.

ఈ క్రమంలో సదరు వ్యక్తి ఫ్లాట్‌ఫామ్‌పైకి ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్ ఈ విషయాన్ని గమనించి అతడికి సాయం చేశాడు. ఆ వ్యక్తిని ఫ్లాట్‌ఫామ్‌ పైకి లాగేశాడు. దాంతో అతడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి. ప్రాణాలు కాపడిన పోలీసుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Latest Articles