పురుషుల సంతానలేమికి తల్లే కారణమా?

TV9 Telugu

18 May 2024

పురుషుల సంతాన లేమికి తల్లి నుంచి సంక్రమించే లోపభూయిష్ట జన్యువు కారణమని తొలిసారిగా CCMB అధ్యయనంలో తేలింది.

అత్యాధునిక జన్యుక్రమ విశ్లేషణ పద్ధతులతో శాస్త్రవేత్తలు సంతానలేమితో బాధపడుతున్న పురుషులు, ఆరోగ్యవంతుల జన్యువులను విశ్లేషించారు.

ఎక్స్ క్రోమోజోమ్‌లో ఈ జన్యువు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. హైదరాబాద్‌లోని CCMB, ఇతర పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

పరిశోధకుల ప్రకారం, ప్రపంచంలోని ప్రతి ఏడు జంటల్లో ఒకరు సంతానలేమితో బాధపడుతున్నారు. పురుషుల్లో శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉంటుంది.

పురుషుల్లో శుక్రకణాల, సైజు, నిర్మాణం కదలికల్లో లోపాలు కారణంగానే సగం సందర్భాల్లో పురుషుల్లో సంతానలేమి తలెత్తుతోంది.

పురుషులకు వారి తల్లుల నుంచి ఎక్స్ క్రోమోజోమ్ ద్వారా సంక్రమించే జన్యులోపమే ఈ పరిస్థితికి కారణమని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు.

సంతానలేమితో బాధపడుతున్న పురుషుల్లోని ఎక్స్ క్రోమోజోమ్‌లో TEX 13 B అనే లోపభూయిష్ట జన్యువును గుర్తించారు.

అయితే కొందమంది విషయంలో మాత్రం ఎక్స్ క్రోమోజోమ్‌ ఈ సమస్యకి కారణం. మరో జన్యువు కూడా వీరిలో అధికంగా ఉన్నట్టు చెప్పారు.