Breaking News
  • అమరావతి: ఏపిలో ఒకే రోజు 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. మొత్తం 40 కి చేరిన కరోనా బాధితుల సంఖ్య.
  • మద్యం పిచ్చి కుదిరేనా: డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌తో వచ్చే వారికి మద్యం సరఫరాకు కేరళ సర్కార్‌ నిర్ణయం, తప్పుపట్టిన ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌, ఎర్రగడ్డ ఆస్పత్రికి క్యూకట్టిన బాధితులు, వందల సంఖ్యలో ఓపీ కేసులు.
  • కరోనాకు 50 మంది డాక్టర్లు బలి: ఒక్క ఇటలీలోనే కరోనాకు 50 మంది డాక్టర్లు చనిపోయినట్టు డాక్టర్ల సంఘం ప్రకటన.
  • అమెరికా కంటే భారత్‌లోనే కరోనా మరణాల రేటు అధికం, అమెరికాలో 1 పాయింట్‌ 74 శాతం ఉంటే ఇండియాలో 2 పాయింట్‌ 70 శాతం ప్రపంచ సగటు 4 పాయింట్‌ 69 శాతం.
  • ఢిల్లీ లోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ లో మతపరమైన ప్రార్దన కు వెళ్లి వచ్చిన వారిలో... 15 మందిని గుర్తించిన మియాపూర్ పోలీసులు. 10 మందిని టెస్టుల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలింపు. ఈ నెల 13 న ఢిల్లీ వెళ్లి 15 వ తేదీన తిరిగి వచ్చిన మియాపూర్ హఫీజ్ పేట్ కు చెందిన వాసులు..

కీచక టైలర్…ట్రయల్ రూమ్‌లో కెమెరా పెట్టి వందలమంది..

secret camera in trial room, కీచక టైలర్…ట్రయల్ రూమ్‌లో కెమెరా పెట్టి వందలమంది..
ప్రస్తుతం మహిళలకు భద్రత అనేది పెద్ద సమస్యగా మారింది. ఎక్కడ ఏ ఉన్మాది దాడి చేస్తాడో తెలీదు…ఏ కీచకుడు మీద పడతాడో ఊహకందదు..ఇలా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు అనేకం. ఈ మధ్య కాలంలో సీక్రెట్ కెమెరాలు కూడా వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. మహిళల డ్రెస్సింగ్ రూమ్స్, వాష్ రూమ్స్‌లో స్పై కెమెరాలు పెడుతోన్న ఉన్మాదులు..వాటిని ఇంటర్నెట్‌లో పెడతామంటూ వేధింపులు పాల్పడుతున్నారు. మరికొందరు సదరు ఫోటోలను, వీడియోలను పోర్న్ సైట్స్‌లో పెట్టి సైకిక్ ఆనందాన్ని పొందుతున్నారు.
ముంబయిలోని అంధేరిలో ఇప్పుడు అటువంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. టైలర్‌గా పనిచేసే ఓ వ్యక్తి తన షాపు..ట్రయల్ రూమ్‌లో ఓ చిన్న సీక్రెట్ కెమెరా పెట్టి మహిళలు దుస్తులు మార్చుకునే వీడియోలను చిత్రీకరించాడు. అలా కొన్ని వందలమంది వీడియోలను సేకరించాడు. ఇటీవలే కెమెరా ఉందని ఓ మహిళ అనుమానించడంతో..కీచకుడి బాగోతం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే..అంధేరి లోఖండ్‌వాలా ఏరియాలో నివశించే షహనాజ్ సజ్జాద్  మహిళల టైలరింగ్ షాపును రన్ చేస్తున్నాడు. బాగా కుడతాడని పేరుండటంతో అతని వద్దకు చాలామంది మహిళలు వచ్చేవారు. అక్కడే ఉన్న ట్రయిల్ రూమ్‌లో తమ దుస్తులు ఫిట్‌గా ఉన్నాయో, లేవో పరీక్షించుకునేవారు. అలానే ఈ నెల 9వ తేదీన షాపులోని ట్రయిల్ రూమ్‌కి వెళ్లిన మహిళకు గోడకు ప్లాస్టిక్ వస్తువు వేలాడుతూ కనిపించింది. అనుమానం వచ్చిన మహిళ..ఆ వస్తువును పరీక్షించగా వెనక భాగంలో సెల్‌ఫోన్ కనిపించింది. అది రికార్డ్ మోడ్‌లో ఉండటంతో భయాందోళనకు గురైన మహిళ..ఆ ఫోన్ పరిశీలించి చూడగా లోపల వందల సంఖ్యలో మహిళలు బట్టలు మార్చుకుంటున్న వీడియోలు దర్శనమిచ్చాయి. దీంతో వెంటనే సదరు మహిళ పోలీసులను సంప్రదించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Tags