సుశాంత్ సింగ్ కేసు, ప్రధాని మోదీకి సోదరి శ్వేత అభ్యర్థన

తన సోదరుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు దర్యాప్తులో అన్ని విషయాలూ పరిశీలించాలని, సాక్ష్యాధారాలు తారుమారు కాకుండా చూడాలని సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి ప్రధాని మోదీని కోరారు. 'సత్యం కోసం మీరు నిలబడతారని..

సుశాంత్ సింగ్ కేసు, ప్రధాని మోదీకి సోదరి శ్వేత అభ్యర్థన
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 01, 2020 | 2:10 PM

తన సోదరుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు దర్యాప్తులో అన్ని విషయాలూ పరిశీలించాలని, సాక్ష్యాధారాలు తారుమారు కాకుండా చూడాలని సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి ప్రధాని మోదీని కోరారు. ‘సత్యం కోసం మీరు నిలబడతారని నాకు తెలుసు.. మాది సాధారణ కుటుంబం.. నా సోదరుడికి బాలీవుడ్ లో ఏ గాడ్ ఫాదర్ లేరు.. దయచేసి ‘శానిటైజ్డ్’ పద్దతిలో ఆధారాలు తారుమారు కాకుండా చూడండి’ అని ఆమె ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో రూ. 15 కోట్ల అనుమానిత లావాదేవీలు జరిగాయని ఈడీ  ప్రకటించడంతో శ్వేత..మొదటిసారిగా స్పందిస్తూ.. నేరుగా ప్రధానిని ఉద్దేశించి ట్వీట్ చేశారు.

కాగా-ఈ కేసుదర్యాప్తులో  ముంబై పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి పురోగతి సాధించలేదు. సుమారు నలభై మంది బాలీవుడ్ సెలబ్రిటీలను వారు విచారించారు. అటు సుశాంత్ తండ్రి ఇఛ్చిన ఫిర్యాదుతో బీహార్ పోలీసులు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే.. ఈ కేసు దర్యాప్తునకు ముంబై పోలీసులు చాలని, సీబీఐ ఇన్వెస్టిగేషన్ అవసరం లేదని అంటున్నారు.