రాజ్‌కోట్‌ ఘటనపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. ఆస్పత్రుల్లో ఫైర్‌ సేఫ్టీ పద్ధతులు పాటించేలా చూడాలని కేంద్రానికి సూచన

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ కొవిడ్‌ ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనను సుప్రీంకోర్టు - సుమోటోగా స్వీకరించింది. దీనిపై వివరణ ఇవ్వాలని గుజరాత్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే - కొవిడ్‌ ఆస్పత్రుల్లో...

  • Sanjay Kasula
  • Publish Date - 1:55 pm, Fri, 27 November 20
రాజ్‌కోట్‌ ఘటనపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. ఆస్పత్రుల్లో ఫైర్‌ సేఫ్టీ పద్ధతులు పాటించేలా చూడాలని కేంద్రానికి సూచన

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ కొవిడ్‌ ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనను సుప్రీంకోర్టు – సుమోటోగా స్వీకరించింది. దీనిపై వివరణ ఇవ్వాలని గుజరాత్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే – కొవిడ్‌ ఆస్పత్రుల్లో ఫైర్‌ సేఫ్టీ పద్ధతులు పాటించేలా చూడాలని కేంద్రానికి సూచించింది. కొవిడ్‌ ఆస్పత్రిలో అగ్నిప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఆర్‌. సుభాష్‌రెడ్డి, జస్టిస్‌ ఎం.ఆర్‌. షాలతో కూడిన త్రి సభ్య బెంచ్‌ దీనిపై విచారణ జరిపింది.

ఆస్పత్రుల్లో నిబంధనలు పాటించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎలక్ట్రికల్‌ లైన్స్‌ను తనిఖీలు చేయకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణమే దేశవ్యాప్తంగా ఆస్పత్రులను తనిఖీచేస్తామని సొలిసిటర్ జనరల్ – సుప్రీంకోర్టుకు తెలిపారు.

మరోవైపు – ఈ తెల్లవారుజామున రాజ్‌కోట్‌లోని ఓ హాస్పటల్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఆరుగురు స్పాట్‌లోనే చనిపోయారు. మరికొందరి పరిస్థితి సీరియస్‌గా ఉంది. ఉదయ్‌ శివానంద్‌ కొవిడ్‌ ఆస్పత్రి ICUలో మంటలు చెలరేగడంతో ఈ ఘోరం జరిగింది. ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 33 మంది చికిత్స పొందుతున్నారు. షార్ట్‌ సర్య్కూట్‌ వల్లే మంటలు చెలరేగి ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు.