ప్రేమ వివాదం.. ఆత్మహత్య చేసుకున్న యువకుడు

Student commits Sucide in jangam due to love failure, ప్రేమ వివాదం.. ఆత్మహత్య చేసుకున్న యువకుడు

జనగాం జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. తనకు జరిగిన అవమానభారాన్ని తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైలు పట్టాల కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. స్నేహితులు కొట్టిన దెబ్బలు తాళలేక చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు యువకుడిపై దాడి దృశ్యాలు టీవీ9 చేతికి చిక్కాయి.

జనగామలోని వీవర్స్ కాలనీకి చెందిన సాయిప్రసాద్ అనే యువకుడిని ఇదే కాలనీకి చెందిన పవన్, వరుణ్ అనే ఇద్దరు యువకులు చితకబాదారు. ఈ దాడిని మరో వ్యక్తి వీడియో తీశాడు. అయితే వీరి మధ్య గొడవకు కారణాలు తెలియరాలేదు. ప్రేమ వ్యవహారమే కారణమా.. మరేదైనా కారణం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాయిప్రసాద్ తల్లిదండ్రులు మాత్రం ఆ ఇద్దరు యువకులే కొట్టి రైల్వే ట్రాక్‌పై పడేశారని ఆరోపిస్తున్నారు.

సాయి ప్రసాద్ ఓ ప్రైవేట్ కళాశాలలో బీఫార్మసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇతనిపై దాడికి పాల్పడిన యువకులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. సాయిప్రసాద్ ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాశాడు. తనను పవన్, వరుణ్‌లు దారుణంగా కొట్టారని.. ఆ దెబ్బలకు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆ సూసైడ్ నోట్‌లో వెల్లడించాడు. వారిద్దరినీ కఠినంగా శిక్షించాలని కోరాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *